Photo Credit: Realme
త్వరలోనే కర్వ్డ్ స్క్రీన్‌తో Realme Narzo 70 Curve హ్యాండ్‌సెట్ మార్కెట్‌లోకి వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Realme నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, రాబోయే Narzo 70 సిరీస్ ఫోన్‌కు సంబంధించిన RAM, స్టోరేజీతోపాటు కలర్ వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రెండు కలర్‌వేలతోపాటు నాలుగు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లతో Realme Narzo 70 Curve స్మార్ట్ ఫోన్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్ లాంచ్ టైమ్‌లైన్‌తోపాటు ధర విషయాలపై ఇప్పటికే పలు ఊహాగానాలు వస్తోన్న సమయంలో ఈ కొత్త లీక్ బహిర్గతమైంది. అంతేకాదు, Realme Narzo 70 సిరీస్ నాలుగు వేరియంట్‌లలో ఉంది. ఈ మోడల్‌లన్నీ MediaTek డైమెన్సిటీ ప్రాసెసర్‌పైనే రన్ అవుతున్నాయి.
Realme Narzo 70 సిరీస్‌కు సంబంధించి ఇదివరకే లీక్ అయిన వివరాల ఆధారంగా దీని RAM, స్టోరేజీ, కలర్ ఆప్షన్‌లను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, 8GB + 128GBతోపాటు 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GBలతో మన దేశంలో నాలుగు RAM, స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. అలాగే, ఈ Narzo 70 Curve స్మార్ట్ ఫోన్ డీప్ స్పేస్ టైటానియం, డీప్ వైలెట్ రంగుల ఎంపికలో అందుబాటులోకి తీసకువచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నాయి. అంతేకాదు, దీని మోడల్ నంబర్ RMX3990ని కలిగి ఉంటుందని వెల్లడైంది.
ఈ కొత్త Narzo సిరీస్ ఫోన్‌కు సంబంధించి Realme ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, ఇది వచ్చే నెల చివరి నాటికి మన దేశీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతుందని మార్కెట్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అలాగే, దీని ధర రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ హ్యాండ్‌సెట్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు Realme Narzo 70 సిరీస్‌లోని Realme Narzo 70, Narzo 70 Proలతోపాటు Narzo 70x, Narzo 70 Turbo 5G వంటి ఫోన్‌ల డిజైన్, స్పెసిఫికేషన్‌లతోనే వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ Realme Narzo 70 స్మార్ట్‌ఫోన్ అండర్ ది హుండ్ MediaTek డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్‌తో వస్తుండగా, Narzo 70x హ్యండ్‌సెట్ మాత్రం MediaTek డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌పై నడుస్తోంది. అలాగే, Realme Narzo 70 Pro 5G స్మార్ట్ ఫోన్ అండర్ ది హుడ్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో, Narzo 70 Turbo 5G ఫోన్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G ప్రాసెసర్‌తో అందులోబాటులోకి వస్తోంది. అయితే, హౌస్ 5,000mAh సామర్థ్యం గల బ్యాటరీలను, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను ఈ నాలుగు మోడల్స్‌లోనూ అందించారు. మరి, ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం కంపెనీ అధికారిక ప్రకటన రావాల్సిందే.
ప్రకటన
ప్రకటన