డిస్ప్లే విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ హోల్-పంచ్ స్టైల్ ఫ్రంట్ కెమెరా డిజైన్ కొనసాగించబడింది

Narzo 90 5G బ్యాటరీతో సంగీతం, గేమింగ్, వీడియోలో దీర్ఘకాలం పనిచేస్తుంది

డిస్ప్లే విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ హోల్-పంచ్ స్టైల్ ఫ్రంట్ కెమెరా డిజైన్ కొనసాగించబడింది

Photo Credit: Realme

ఇటీవలే Realme ఈ రెండు మోడళ్లు భారతదేశంలో డిసెంబర్ 16న లాంచ్ కానున్నట్లు ప్రకటించింది. ఫోన్లు అమెజాన్తో పాటు Realme ఇండియా ఆన్లైన్ స్టోర్లో కూడా అందుబాటులోకి రానున్నాయి.

ముఖ్యాంశాలు
  • Narzo 90 5G మరియు 90x 5G మోడళ్లలో 7,000mAh టైటాన్ బ్యాటరీ
  • 60W ఫాస్ట్ చార్జింగ్, AI కెమెరా ఫీచర్లతో మెరుగైన పనితీరు
  • డిసెంబర్ 16న భారత్లో లాంచ్, అమెజాన్ మరియు Realme స్టోర్లో విక్రయం
ప్రకటన

Realme తన కొత్త Narzo 90 సిరీస్ను ఈ నెల మూడవ వారంలో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. Narzo 90 5G మరియు Narzo 90x 5G అనే రెండు మోడళ్లతో లైనప్ రూపొందించబడింది. ఈ ఫోన్లు అమెజాన్ ద్వారా విక్రయించబడతాయి. కంపెనీ ఇప్పటికే డిజైన్ టీజ్ చేసిన తర్వాత, అమెజాన్లోని మైక్రోసైట్ను అప్డేట్ చేయడం ద్వారా ముఖ్యమైన స్పెసిఫికేషన్లు అధికారికంగా బయటపడ్డాయి. రెండు మోడళ్లలోనూ 7,000mAh భారీ బ్యాటరీని అందిస్తూ, 60W ఫాస్ట్ చార్జింగ్ను సపోర్ట్ చేస్తాయి. అయితే Narzo 90 5G మాత్రమే బైపాస్ ఛార్జింగ్ మరియు రివర్స్ చార్జింగ్ ఫీచర్లను కలిగి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదే మోడల్కు IP66, IP68, IP69 రేటింగులు ఇవ్వబడటం వల్ల ధూళి మరియు నీటి నుండి సంరక్షణ దొరుకుతుంది.

బ్యాటరీ పనితీరుని పరిశీలిస్తే, Narzo 90 5G ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే... దాదాపు 143 గంటలకు పైగా మ్యూజిక్ వినవచ్చు, గేమింగ్లో సుమారు ఎనిమిది గంటలు, ఆన్లైన్ వీడియో వీక్షణలో 24 గంటలు, వీడియో కాలింగ్లో 28 గంటలకు పైగా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంటోంది. మరో వైపు Narzo 90x 5G నావిగేషన్ నుండి వీడియో స్ట్రీమింగ్ వరకు, మెసేజింగ్ నుండి మ్యూజిక్ వినడానికి వరకు విస్తృతంగా మంచి బ్యాటరీ బ్యాకప్ని అందించనుంది.

డిస్ప్లే విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ హోల్-పంచ్ స్టైల్ ఫ్రంట్ కెమెరా డిజైన్ కొనసాగించబడింది. Narzo 90 5G డిస్ప్లే బ్రైట్నెస్ 4,000 nits వరకు ఉండగా, Narzo 90x 5G డిస్ప్లే 1,200 nits బ్రైట్నెస్ తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ను అందిస్తుంది. రెండు మోడళ్ల వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా అమర్చబడింది. ఫోటోగ్రఫీ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు AI Edit Genie, AI Editor, AI Eraser, AI Ultra Clarity వంటి అనేక AI టూల్స్ కూడా అందించబడుతున్నాయి. డిజైన్ పరంగా చూస్తే Narzo 90 5G మూడు కెమెరాలతో కూడిన స్క్వేర్ మాడ్యూల్ తో కనిపిస్తుండగా, Narzo 90x 5G రెండు కెమెరాలతో కూడిన చతురస్రాకార డెకో డిజైన్ను కలిగి ఉంది.

ఇటీవలే Realme ఈ రెండు మోడళ్లు భారతదేశంలో డిసెంబర్ 16న లాంచ్ కానున్నట్లు ప్రకటించింది. ఫోన్లు అమెజాన్తో పాటు Realme ఇండియా ఆన్లైన్ స్టోర్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. మొత్తం మీద, భారీ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ప్రకాశవంతమైన డిస్ప్లేలు, శక్తివంతమైన కెమెరాలు..ఇవన్నీ Narzo 90 సిరీస్ను ఈసారి మరింత ఆసక్తికరంగా మార్చుతున్న అంశాలు...

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఒప్పో రెనో 15సి ఫీచర్స్ ఇవే.. ఎన్నో ప్రత్యేకతలతో రానున్న న్యూ మోడల్
  2. శక్తివంతమైన Snapdragon చిప్తో, పెరిస్కోప్ కెమెరాతో రాబోతున్న Realme 16 Pro+ 5G...!
  3. ఒప్పో రెనో 15సి ఫీచర్స్ ఇవే.. ఎన్నో ప్రత్యేకతలతో రానున్న న్యూ మోడల్
  4. డిస్ప్లే విషయానికి వస్తే, రెండు ఫోన్లలోనూ హోల్-పంచ్ స్టైల్ ఫ్రంట్ కెమెరా డిజైన్ కొనసాగించబడింది
  5. డీజిల్ అల్ట్రా హ్యూమన్ రింగ్.. అవాక్కయ్యే ధర.. ఫీచర్స్ ఇవే
  6. ప్రాంతీయ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకునే ప్లాన్.. టాటా ప్లే బింగ్‌లో కొత్త ఆప్షన్స్ ఇవే
  7. Poco X8 Pro ధర భారత్‌లో రూ.30,000 కంటే ఎక్కువగా ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి
  8. రలోనే లాంఛ్ కానున్న సామ్ సంగ్ గెలాక్సీ మోడల్స్.. వీటి గురించి తెలుసుకున్నారా?
  9. ఇక V70తో పాటు మరో మోడల్ గురించి కూడా సమాచారం బయటకు రావడం జరిగింది
  10. మోడల్ కామోల్లియా పింక్, మాస్టర్ గోల్డ్, మాస్టర్ గ్రే కలర్‌లలో లభించనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »