రియల్ మీ P4 సిరీస్‌ స్పెసిఫికేషన్లు తాజాగా ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ లో విడుదల అయ్యాయి

రియల్ మీ P4 ప్రో 5Gలోని హైపర్ గ్లో AMOLED 4D Curve+ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 6,500 nits లోకల్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సర్టిఫికేషన్, 4,320Hz హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. దీనికి TÜV Rheinland సర్టిఫికేషన్ కూడా లభించింది.

రియల్ మీ P4 సిరీస్‌ స్పెసిఫికేషన్లు తాజాగా ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ లో విడుదల అయ్యాయి

Photo Credit: Realme

రియల్‌మే పి 4 సిరీస్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు

ముఖ్యాంశాలు
  • 7000mAh బ్యాటరీకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు
  • ఫోన్ టెంపరేచర్ కంట్రోల్ కి vc కూలింగ్ సిస్టం సపోర్ట్
  • రూ.30,000 లోపు ధర ఉండే అవకాశం
ప్రకటన

రియల్ మీ P4 సిరీస్‌ స్పెసిఫికేషన్లు తాజాగా ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ లో విడుదల అయ్యాయి. ఇప్పుడు చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ తమ రాబోయే మోడళ్ల హార్డ్‌వేర్ ఫీచర్లపై మరిన్ని వివరాలు వెల్లడించింది. రియల్ మీ P4 సిరీస్ వచ్చే వారం భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్లు ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అమ్మకానికి లభిస్తాయి. రియల్ మీ P4 5G, P4 ప్రో 5G స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే...మంగళవారం రియల్ మీ వెల్లడించిన వివరాల ప్రకారం, రియల్ మీ P4 5G స్మార్ట్‌ఫోన్‌ మీడియా టెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్‌తో వస్తుంది. దీనికి ప్రత్యేకంగా పిక్సెల్ వర్క్స్ చిప్‌ను జత చేస్తున్నారు. ఈ ఫోన్ 6.77 అంగుళాల హైపర్ గ్లోAMOLED డిస్‌ప్లేతో వస్తోంది.

ఇది Full-HD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 4,500 nits బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ మొబైల్ స్క్రీన్‌లో 3,840Hz PWM డిమ్మింగ్, హార్డ్‌వేర్ స్థాయి బ్లూ లైట్ మరియు ఫ్లికర్ రిడక్షన్ సపోర్ట్ కూడా లభిస్తుంది.రియల్ మీ P4 5Gలో 7,000mAh టిటాన్ బ్యాటరీని 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందిస్తున్నారు. కంపెనీ ప్రకారం, ఈ హ్యాండ్‌సెట్‌ సుమారు 11 గంటల పాటు BGMI గేమింగ్ టైమ్ అందించగలదు. కేవలం 25 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని రియల్ మీ చెబుతోంది. రివర్స్ ఛార్జింగ్, AI స్మార్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా లభిస్తాయి. ఫోన్ టెంపరేచర్ కంట్రోల్ కోసం 7,000 చదరపు మిల్లీమీటర్ల ఎయిర్ ఫ్లో VC కూలింగ్ సిస్టమ్‌ని అమర్చారు.

మరోవైపు, రియల్ మీ P4 ప్రో 5G స్నాప్ డ్రాగన్ 7 Gen 4 చిప్‌సెట్‌తో వస్తుంది. దీని గ్రాఫిక్ పనితీరును మెరుగుపరచడానికి ప్రత్యేక హైపర్ వెర్షన్ AI GPUని జోడించారు. ఈ ఫోన్ థిక్నెస్ కేవలం 7.68 మిల్లీమీటర్లే. స్టాండర్డ్ వెర్షన్‌లాగే దీనిలో కూడా 7,000mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కువ సేపు ఫోన్ యూస్ చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికి 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఈ మోడల్ 90FPS వద్ద 8 గంటలకు పైగా BGMI గేమ్ ప్లే టైమ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

రియల్ మీ P4 ప్రో 5Gలోని హైపర్ గ్లో AMOLED 4D Curve+ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 6,500 nits లోకల్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సర్టిఫికేషన్, 4,320Hz హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది

దీనికి TÜV Rheinland సర్టిఫికేషన్ కూడా లభించింది. దీనివల్ల కళ్ళకు స్క్రీన్ నుండి ప్రొటెక్షన్ లభిస్తుంది.

రియల్ మీ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఫ్రాన్సిస్ వాంగ్ తెలిపిన ప్రకారం, రాబోయే రియల్ మీ P4 5G మరియు P4 ప్రో 5G ధర రూ.30,000లోపు ఉండనుంది. అలాగే, గతంలో లాంచ్ చేసినట్లుగా రియల్ మీ P4 అల్ట్రా మోడల్‌ను ఈసారి విడుదల చేయకపోవచ్చని ఆయన సంకేతాలిచ్చారు.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  2. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  3. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  4. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
  5. iQOO 15 మొబైల్ లాంఛింగ్‌పై వార్తలు, అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న స్మార్ట్ ఫోన్, అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్
  6. షల్ మీడియా కోసం ఫాస్ట్ షాట్స్ తీసే యూజర్లకు ఇది ఉపయోగపడుతుంది
  7. తక్కువ ధరకే Vu Glo QLED స్మార్ట్ టీవీలు
  8. రియల్ మీ P4 సిరీస్‌ స్పెసిఫికేషన్లు తాజాగా ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ లో విడుదల అయ్యాయి
  9. K13 టర్బో బరువు 207 గ్రాములు, ప్రో మోడల్ బరువు 208 గ్రాములు ఉన్నాయి
  10. Lava Blaze AMOLED 2 5G కొత్త మోడల్ ధర ఇదే.. స్టోరేజీ, ధర ఎంతంటే?
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »