Photo Credit: Poco
గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చేవారం Xiaomi సబ్-బ్రాండ్ Poco C75 లాంచ్ కానున్నట్లు కంనెనీ X వేదికగా వెల్లడించింది. Poco మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారంలో ఈ కొత్త C సిరీస్ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను తెలుపుతూ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధరను కూడా కంపెనీ ప్రకటించింది. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా యూనిట్, 5,160mAh బ్యాటరీతో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేసింది. Poco C75 Redmi 14C రీబ్రాండ్‌గా ప్రారంభించబడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది రెండు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం...!
Poco C75 ఈ అక్టోబర్ 25న గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది 6.88-అంగుళాల టన్ స్ర్కీన్ డిస్‌ప్లే, 5,160mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతోపాటు వెనుక డ్యూయల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. క్వాలిటీతో కూడిన ఇమేజ్‌లకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
కంపెనీ షేర్ చేసిన పోస్ట్ ప్రకారం.. Poco C75 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌కు $109 (దాదాపు రూ. 9,100), 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర $129 (సుమారు రూ. 10,000)గా నిర్ణయించారు. ఈ హ్యాండ్‌సెట్ నలుపు, గోల్డ్, ఆకుపచ్చ మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. అంతేకాదు, గ్రీన్, గోల్డ్ దిగువ భాగంలో పాలరాయి లాంటి ఫిన్‌షింగ్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, Redmi 14C డిజైన్‌తో పోలి ఉండే వృత్తాకార ఆకారంలో ఉన్న వెనుక కెమెరా మాడ్యూల్‌లో ఉంటుందని ఈ పోస్టర్ ద్వారా స్పష్టమైంది.
Redmi 14C మాదిరిగానే Poco C75 మోడల్ కూడా అదే హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది 4GB RAM, 128GB స్టోరేజీతో ధర CZK 2,999 (దాదాపు రూ. రూ. 11,100), 8GB + 256GB వేరియంట్ కోసం CZK 3,699 (సుమారు రూ. 13,700) ధర ట్యాగ్‌తో ఆగస్టులో ప్రారంభమైంది. ఈ ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు కొత్తగా వస్తోన్న ఈ మోడల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టకునే అవకాశం ఉన్నట్లు కంపెనీ అంచనా వేస్తోంది.
Redmi 14C మోడల్ మాదిరిగానే Poco C75 కూడా MediaTek Helio G85 ప్రాసెసర్‌తో రూపొందించినట్లు స్పష్టమైంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించే అవకాశం ఉంది. అలాగే, ఈ హ్యాండ్‌సెట్ 18W ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతోపాటు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ బడ్జెట్‌లో మార్కెట్‌లోకి అడుగుపెడితే.. ఇతర కంపెనీలకు మంచి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మోడల్‌ను సొంతం చేసుకునేందుకు మీరూ సిద్ధంగా ఉండండి.
ప్రకటన
ప్రకటన