ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ హ్యాండ్‌సెట్‌లో 6.9 అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేను అమర్చారు, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ సాంప్లింగ్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కంటి సంరక్షణ కోసం TÜV Rheinland నుండి మూడు ప్రత్యేక సర్టిఫికేషన్లు కూడా ఈ డిస్ప్లేకు లభించాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు

Photo Credit: Xiaomi

రెడ్‌మి 15 5G ఫ్రాస్టెడ్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ మరియు శాండీ పర్పుల్ షేడ్స్‌లో అమ్మకానికి ఉంది

ముఖ్యాంశాలు
  • ఈ ఫోన్లో 7000 mAh బ్యాటరీ బ్యాకప్ ఇస్తున్నారు
  • 50 మెగాపిక్సల్ డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్ ఉంది
  • IIP64 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్స్ ఉన్నాయి
ప్రకటన

భారత మార్కెట్‌లో షావోమీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్ మీ 15 5Gను మంగళవారం విడుదల చేసింది. 6GB+128GB వెర్షన్ ధర రూ.14,999గా ఉండగా, 8GB+128GB వెర్షన్ రూ.15,999, 8GB+256GB వెర్షన్ రూ.16,999 ధరల్లో అందుబాటులోకి వస్తోంది. ఇక కలర్ అవైలబిలిటీలో ఈ ఫోన్ ఫ్రాస్టెడ్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, శాండీ పర్పుల్ రంగుల ఎంపికల్లో లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఆగస్టు 28 నుంచి అమెజాన్, షావోమీ ఇండియా వెబ్‌సైట్ మరియు రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్‌లో 7,000mAh సామర్థ్యం గల సిలికాన్-కార్బన్ బ్యాటరీని అమర్చారు, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఇతర పరికరాలను ఛార్జ్ చేయగల 18W రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ హ్యాండ్‌సెట్‌లో 6.9 అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేను అమర్చారు, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 288Hz టచ్ సాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. దీనివల్ల ఫోన్లో చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయవచ్చు. అంతేకాకుండా 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. సన్లైట్ లో కూడా ఫోన్ డిస్ప్లేని చాలా బ్రైట్ గా చేసుకోవచ్చు. కంటి సంరక్షణ కోసం TÜV Rheinland నుండి మూడు ప్రత్యేక సర్టిఫికేషన్లు కూడా ఈ డిస్ప్లేకు లభించాయి. దీంతో ఎక్కువసేపు ఫోన్ యూస్ చేసినా కూడా కళ్ళకు ఎటువంటి డామేజ్ అవ్వదు. HyperOS 2.0తో, ఆండ్రాయిడ్ 15పై నడిచే ఈ ఫోన్ రెండు సంవత్సరాల మెజర్ OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

ఈ ఫోన్లో అధునాతన ఏఐ టెక్నాలజీని కూడా అమర్చారు. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి AI ఫీచర్లతో ఏ విషయం అయినా కూడా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా... వీడియో చాటింగ్, సెల్ఫీలు దిగేందుకు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు. అంతేకాకుండా ఈ ఫోన్‌లో AI స్కై, AI బ్యూటీ, AI ఎరేజ్ వంటి ఇమేజ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. దీంతో ఫోటోలు దిగిన వెంటనే బ్యూటిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక వీడియోలు చూసే సమయంలో, పాటలు వినే సమయంలో బెస్ట్ సౌండ్ క్వాలిటీ అందించేందుకు డాల్బీ సర్టిఫైడ్ స్పీకర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఫోన్కు సెక్యూరిటీ ఫీచర్ గా సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. IP64 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ తో ఈ ఫోన్ వస్తుంది. పొరపాటున నీటిలో పడిన, దుమ్ములో పడిన కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అలాగే IR బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.కనెక్టివిటీ పరంగా 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB Type-C సపోర్ట్ ఇస్తున్నారు. ఇక ఈ ఫోన్ డైమెన్షన్స్ విషయానికి వస్తే 168.48×80.45×8.40 మిల్లీమీటర్ల పరిమాణంలో 217 గ్రాముల బరువుతో లభిస్తుంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మంచి కాంపిటీషన్ ఇస్తుందని టెక్నాలజీ పండితులు అంచనా వేస్తున్నారు. రెడ్ మీ ఫోన్లో ఇష్టపడే కస్టమర్లకి ఈ మొబైల్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. హువావే నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్, 5500mAh బ్యాటరీ, డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌
  2. Huawei ఇప్పటివరకు Nova Flip S ప్రాసెసర్ లేదా RAM వివరాలను అధికారికంగా వెల్లడించలేదు
  3. అదనంగా, Vivo కంపెనీ Vivo Sans అనే కొత్త ఫాంట్‌ను ప్రవేశపెట్టింది
  4. అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ ప్రారంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది
  5. వాట్సప్‌లో అదిరే అప్డేట్.. త్వరలోనే ప్రారంభం
  6. ఆపిల్ నుంచి కొత్త మ్యాక్ బుక్ ప్రో.. అదిరే ఫీచర్స్
  7. ఇన్ స్టాగ్రాంలో దీపావళి స్పెషల్.. ఈ ఎడిట్ గురించి మీకు తెలుసా?
  8. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్26 ఎడ్జ్ మోడల్‌కి గుడ్ బై.. దాని స్థానంలో రానున్నది ఇదే
  9. ఒప్పో వాచ్ ఎస్ ప్రారంభం.. కళ్లు చెదిరే ధర, ఫీచర్స్
  10. ఈ రెండు ఫోన్లూ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »