Photo Credit: Redmi
ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో Redmi Note 14 5G డిసెంబర్ 9న Redmi Note 14 Pro+, Redmi Note 14 Proతో పాటు లాంచ్ కానుంది. ఈ లైనప్ చైనాలో సెప్టెంబరులో దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP68 రేటింగ్‌తో విడుదలైంది. ఇండియన్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌లు చైనీస్ కౌంటర్‌పార్ట్‌లను పోలి ఉండే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఇండియాలో లాంచ్‌కు ముందు అమెజాన్ బేస్ Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ లభ్యతతోపాటు కీలకమైన ఫీచర్స్, కలర్ ఆప్షన్‌లను వెల్లడించింది.
అమెజాన్ ఇండియా మైక్రోసైట్ Redmi Note 14 5G ఫోన్ ఈ-కామర్స్ సైట్ ద్వారా మన దేశంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ ఫోన్ చైనీస్ వెర్షన్ మాదిరి డిజైన్‌తో వస్తుంది. అలాగే, నలుపు, తెలుపు రెండు రంగులలో వస్తున్నట్లు లిస్టింగ్ చెబుతోంది. అంతేకాదు, ఈ రెండూ మార్బుల్ షేడ్‌లో ఉంటాయి. అయితే, చైనాలో మాత్రం ఈ ఫోన్ నీలిరంగు మూడవ ఆప్షన్‌గా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది.
అమెజాన్ లిస్ట్ Xiaomi ఇండియా మైక్రోసైట్ Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ వేరియంట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. అలాగే, చైనీస్ వేరియంట్ కెమెరా విభాగంలో 2-మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. దీంతో ఇండియన్ వెర్షన్‌లోనూ ఈ తరహా కెమెరా ఫీచర్స్‌ను అందించ వచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Redmi Note 14 5G స్మార్ట్ ఫోన్ ఇండియన్ వెర్షన్ ప్రకాశవంతమైన డిస్‌ప్లేతో వస్తూ.. AiMi అనే AI అసిస్టెంట్‌తో పాటు అధునాతన ప్రైవసీ ఫీచర్‌లను అందించినట్లు తెలుస్తోంది. అలాగే, చైనీస్ మోడల్ హ్యాండ్‌సెట్‌ను 6.67-అంగుళాల ఫుల్-HD+ AMOLED స్క్రీన్‌తో రూపొందిచారు. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయితోపాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్‌ను కలిగి ఉన్నట్లు స్పష్టమైంది.
చైనీస్ కౌంటర్ మాదిరిగానే Redmi Note 14 5G హ్యాండ్‌సెట్ ఇండియా వేరియంట్ కూడా MediaTek డైమెన్సిటీ 7025 Ultra ప్రాసెసర్‌తో రావొచ్చు. ఇది దుమ్ము, నీటి నియంత్రణ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఈ ఫోన్‌కు 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,110mAh బ్యాటరీని అందించొచ్చు. దీంతోపాటు Android 15-ఆధారిత HyperOS 2.0పై రన్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే గత లీక్‌లను పరిశీలిస్తే.. ఇండియాలో 6GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది. ఈ ఫోన్ 8GB + 128GB మరియు 8GB + 256GB వేరియంట్‌ల ధరలు వరుసగా రూ. 22,999, రూ. 24,999గా ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన