Photo Credit: Xiaomi India
భారత మొబైల్ మార్కెట్‌లోకి Xiaomi వచ్చే నెలలో Redmi Note 14 5G సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి కంపెనీ తన సోషల్ మీడియా ఛానెల్‌లో అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జనవరిలో లాంచయిన నోట్ 13 సిరీస్‌కు ఇది కొనసాగింపుగా రానుంది. ఇందులో బేస్, ప్రో, ప్రో+ వేరియంట్‌లలో మూడు మోడల్‌లను కలిగి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Xiaomi సబ్-బ్రాండ్ ఇప్పటికే సెప్టెంబరులో చైనాలో తాజా నోట్ 14 సిరీస్‌ను ప్రారంభించింది. భారత్‌తో సహా ఈ ఫోన్‌లను అదే తరహాలో గ్లోబల్ లాంచ్ చేయనున్నట్లు భావిస్తున్నారు.
అధికారిక X ఖాతాలో Xiaomi ఇండియా Redmi Note 14 5G సిరీస్ భారత్‌లో లాంచ్‌పై ఒక పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఇది అధికారిక ప్రకటన చేసిన సంస్థకు చెందిన Instagram ప్రసార ఛానెల్. దీని ప్రకారం డిసెంబర్ 9న భారత్‌లో ఈ ఫోన్‌లు విడుదల కానున్నాయి. రాబోయే ఈ స్మార్ట్ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు వెల్లడించనప్పటికీ, Xiaomi ఇండియా కృత్రిమ మేధస్సు (AI), కెమెరా-సెంట్రిక్ ఫీచర్‌లను అందిచనున్నట్లు ధృవీకరిస్తోంది.
అయితే, Redmi Note 14 5G సిరీస్ భారతీయ వేరియంట్‌లు ఇదే సిరీస్ చైనీస్ కౌంటర్‌పార్ట్‌లతో సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు, మార్పులకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ సిరీస్‌లో మొత్తంగా Redmi Note 14 5G, Note 14 Pro 5G, Note 14 Pro Plus 5Gలు భారత్ మొబైల్ మార్కెట్‌లోకి లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
గతంలో వచ్చిన నివేదికల ఆధారంగా ఈ Redmi Note 14 సిరీస్‌లోని అన్ని మోడల్స్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉండొచ్చని భావించవచ్చు. అలాగే, ప్రో, ప్రో+ వేరియంట్‌లు వరుసగా స్నాప్‌డ్రాగన్ 7s Gen 3, డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయని తెలుస్తోంది. అయితే, బేస్ మోడల్‌లో మాత్రం అండర్ ది హుడ్ MediaTek డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ కలిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Redmi Note 14 Pro, Note 14 Pro+ రెండూ కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండొచ్చని అంచనా. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో ఈ రెండు మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, Note 14 Pro+కి 50-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరా, ప్రో మోడల్ 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో రూపొందించనున్నట్లు ప్రచారంలో ఉంది. గత మోడల్స్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,200mAh బ్యాటరీని అందించగా, రెండోది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో రూపొందించారు.
ప్రకటన
ప్రకటన