Photo Credit: Redmi
చైనాలో లాంచ్ అయిన దాదాపు మూడు నెలల తర్వాత Redmi Note 14 సిరీస్ భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. రానున్న డిసెంబర్ 9న ఇది దేశీయ మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ బేస్, ప్రో, ప్రో+ వేరియంట్‌తో మూడు మోడళ్లలలో రానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ విడుదలకు ముందు Xiaomi ఇండియా టాప్-ఆఫ్-ది-లైన్ Redmi Note 14 ప్రో+ మోడల్‌కు చెందిన కీలక స్పెసిఫికేషన్‌లను బహిర్గతం చేసింది. ఇది చైనీస్ వేరియంట్‌ను పోలిన ఒంపు ఉన్న AMOLED స్క్రీన్, 50-మెగాపిక్సెల్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్‌లను చూపిస్తోంది. మరెందుకు ఆలస్యం.. Redmi Note 14 ప్రో+ ప్రత్యేకతలను తెలుసుకుందామా.
Xiaomi ఇండియా Redmi Note 14 Pro+ స్మార్ట్ ఫోన్‌కు చెందిన వివిధ స్పెసిఫికేషన్‌లను తెలిపేందుకు స్పెషల్ మైక్రోసైట్‌ను రూపొందించింది. రాబోయే హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌తో ఒంపు తిరిగిన AMOLED స్క్రీన్‌తో వస్తున్నట్లు స్పష్టమైంది. అలాగే, నలుపు, ఊదా రంగులలో రానున్నట్లు కంపెనీ టీజ్ చేసింది. రెండోది ఆకర్షణీయమైన లెదర్ ఫినిషింగ్‌తో కనిపిస్తోంది.
ఇక Redmi Note 14 Pro+ కెమెరా విషయానికి వస్తే.. దీనిని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రూపొందించారు. అలాగే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ద్వారా అందించబడుతోంది. ఇది దుమ్ము, నీటిని నిరోదించడానికి IP68-రేటెడ్ బిల్డ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, త్వరలో రాబోయే ఈ స్మార్ట్ ఫోన్ 20కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో వస్తుందని కంపెనీ విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వివరాలను మాత్రం ఇంకా వెలువరించలేదు.
ఇప్పటివరకు కంపెనీ వెల్లడించిన డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.. ఈ హ్యాండ్‌సెట్ దాని చైనీస్ కౌంటర్‌తో సమానంగానే కనిపిస్తోంది. అయితే, Redmi Note 14 Pro+ చైనీస్ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED స్క్రీన్‌తో అందించారు. అలాగే, ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో గరిష్టంగా 16GB RAM, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరజ్‌ని అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది ఈ మోడల్‌కు ప్రత్యేకతను తీసుకు వస్తోందనే చెప్పాలి.
ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ లైట్ హంటర్ 900 ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను అందించారు. అలాగే, హ్యాండ్‌సెట్‌లో సెల్ఫీల కోసం ముందు భాగంలో ప్రత్యేకంగా 20-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV20B సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,200mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తోంది. ఇండియన్ మార్కెట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధరలతోపాటు పలు ఫీచర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం డిసెంబర్ 9వరకూ చూడాల్సిందే.
ప్రకటన
ప్రకటన