independence day offer.. Samsung Galaxy S24 ధ‌ర భారీగా త‌గ్గింపు!

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని Samsung Galaxy S24 మోడ‌ల్ ధ‌ర‌పై ప్ర‌త్యేక ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఏకంగా రూ.12 వేల ధర త‌గ్గించింది.

independence day offer.. Samsung Galaxy S24 ధ‌ర భారీగా త‌గ్గింపు!
ముఖ్యాంశాలు
  • Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్‌ మీద ఏకంగా రూ.12 వేల ధర త‌గ్గింపు
  • 24 నెల‌ల‌పాటు నెల‌కు రూ.5,666 చొప్పున no-cost EMI ఆప్ష‌న్‌
  • ఈ ప్ర‌త్యేక ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్ర‌మే
ప్రకటన
Samsung Galaxy S24 మోడ‌ల్ ఫోన్‌ను ఈ ఏడాదిద జ‌న‌వ‌రిలో మ‌న దేశీయ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ మోడ‌ల్‌ లాంచింగ్ ధర రూ.79,999గా నిర్ణ‌యించారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని Samsung Galaxy S24 మోడ‌ల్ ధ‌ర‌పై ప్ర‌త్యేక ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ఈ డిస్కౌంట్ ధ‌ర తెలిస్తే.. Samsung మొబైల్ వినియోగ‌దారులు ఎగిరి గంతేస్తారు. అంతేకాదు.. దీనికి no-cost EMI అవ‌కాశాన్ని కూడా క‌ల్పించింది. అయితే, ఈ ఆఫ‌ర్ ప‌రిధి వచ్చే వారం వరకూ మాత్ర‌మే ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది. ఈ Samsung Galaxy S24 పోన్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. Samsung కంపెనీ అందిస్తోన్న ప్ర‌త్యేక ఆఫ‌ర్‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలను చూసేద్దాం రండి!

ప్ర‌త్యేక ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్ర‌మే..


ప్ర‌తి సంవత్స‌రం ఆగ‌స్టు 15కి మొబైల్ కంపెనీలు ఆఫ‌ర్‌ల‌ను ప్ర‌క‌టించ‌డం మామూలే. ఈ ఏడాది ఆ జాబితాలో దూసుకొచ్చింది Samsung సంస్థ‌. మార్కెట్ వ‌ర్గాలు ఆశ్చ‌ర్య‌పోయేలా లిమిటెడ్ ఆఫర్‌గా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఓ స‌రికొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. త‌న Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్‌ మీద ఏకంగా రూ.12 వేల ధర త‌గ్గించి మార్కెట్ వర్గాల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8GB RAM మ‌రియు 128GB స్టోరేజీ వేరియంట్‌లో రూ.62,999లకు లభిస్తుండ‌గా.. ఈ వేరియంట్ వాస్తవ ధర రూ.74,999గా ఉంది. అంతేకాదు, ఈ ఆఫ‌ర్‌లో భాగంగా.. 24 నెల‌ల‌పాటు నెల‌కు రూ.5,666 చొప్పున no-cost EMI ఆప్ష‌న్‌ అవ‌కాశం కూడా అందుబాటులో ఉంది. ఈ నిర్ణ‌య‌మే దేశీయ మార్కెట్‌లో త‌న ప్ర‌భావం ఎంత‌లా ఉండ‌నుందో స‌ద‌రు కంపెనీ అంచ‌నా వేయ‌బోతోంది. అయితే, ఈ ప్ర‌త్యేక ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్ర‌మే ఉండ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఇదే మోడ‌ల్‌లో 256GB  స్టోరేజీ వెర్ష‌న్ ఫోన్ అస‌లు ధ‌ర‌ రూ.79,999 ఉండ‌గా రూ.67,999కు, 512GB  స్టోరేజీ వెర్ష‌న్‌ ఫోన్ రూ.89,999 ఉండ‌గా రూ.77,999లకు ల‌భించ‌నున్నాయి. అంతేకాదు, Samsung Galaxy S24 స్మార్ట్‌ ఫోన్ అమెజాన్‌లో రూ.56 వేలకు లిస్టయితే, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ రూ.62 వేలకు పోటీప‌డి విక్ర‌యిస్తోంది. 

అధిరిపోయే స్పెసిఫికేషన్స్‌..


Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్‌ల విష‌యానికి వ‌స్తే ఒక‌ Hz to 120Hz వరకూ వేరియబుల్ రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో 6.2-అంగుళాల full-HD+ Dynamic AMOLED 2X డిస్‌ప్లేను అందిస్తున్నారు. అలాగే, దీనిలో Exynos 2400 ప్రాసెస‌ర్‌ ఆధారంగా పనిచేస్తోంది. 8GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామ‌ర్థ్యంతో అందుబాటులో ఉంటుంది. అలాగే, Samsung Galaxy S24 మోడ‌ల్‌లో కెమెరా సెటప్ కూడా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించారు. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్.. అంటే, 50-మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాను అందించారు. 12-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను ముందుభాగంలో కలిగి ఉంటుంది. అంతేకాదు, Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్‌ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్, 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో న‌డుస్తుంది. ఈ ఫోన్‌ 4,000mAh బ్యాటరీ సామ‌ర్థ్యం క‌లిగి ఉండి, వైర్‌లెస్ పవర్‌షేర్ ఫంక్షనాలిటీని జోడించారు. బ్యాట‌రీ విష‌యంలో ఈ మోడ‌ల్ వినియోగ‌దారుల‌ను కాస్త నిరాశ ప‌రుస్తోంద‌నే చెప్పాలి. ఏది ఏమైనా Samsung ఆఫ‌ర్ విష‌యంలో త్వ‌ర‌ప‌డాల్సందే. మ‌రెందుకు ఆల‌స్యం.. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్ త‌క్కువ ధ‌ర‌కే సొంతం చేసుకోండి!
Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ రెండు ఫోన్‌లు Android 16 బేస్డ్ HyperOS 3 పై నడుస్తాయి
  2. ఈ ఫోన్ కూడా అదే Dimensity 9500 చిప్‌సెట్ మరియు Android 16 OSపై నడుస్తుంది
  3. ఇది ప్రస్తుతం మిడ్‌నైట్ బ్లాక్ అనే ఒక్క కలర్ ఆప్షన్‌లో మాత్రమే కనిపిస్తుంది
  4. వాట్సప్‌లో కొత్త అప్డేట్ ఇదే.. ఈ విషయాలు తెలుసుకోండి
  5. మార్కెట్లోకి రెడ్ మీ వాచ్ 6.. అదిరే ఫీచర్స్
  6. వాట్సప్‌లో కొత్త అప్డేట్.. ఈ ఫీచర్ గురించి తెలుసా?
  7. జియో సావన్‌లో యాడ్ ఫ్రీ మ్యూజిక్.. ఈ వివరాలు తెలుసుకోండి
  8. స్క్రీన్-టు-బాడీ రేషియో 94.37%గా ఉంది, అంటే బెజెల్‌లు చాలా సన్నగా ఉంటాయి.
  9. అయితే, వైర్‌లెస్ చార్జింగ్ పై వివరాలు ఇంకా వెల్లడించలేదు.
  10. అదనంగా, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నారు.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »