Photo Credit: Samsung
Galaxy S23 FEకి కొనసాగింపుగా Samsung Galaxy S24 FEని త్వరలో లాంచ్ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. Galaxy S23 FE గత ఏడాది అక్టోబర్ 2023లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ ఫ్యాన్ ఎడిషన్ ఫోన్ Samsung Galaxy S24 FE డిజైన్ లీక్‌లు ఆన్‌లైన్‌లో కనిపించాయి. ప్రాసెసర్, డిస్‌ప్లేతో సహా స్మార్ట్‌ఫోన్‌లోని పలు కీలక ఫీచర్లు కూడా లీకయ్యాయి. అంతేకాదు, గతంలో విడుదలైన Galaxy S23 FE కంటే ఈ కొత్త మోడల్ హ్యాండ్‌సెట్ అధిక ధరతో మార్కెట్‌లోకి రావచ్చని యూఎస్‌లో టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే కొన్ని నివేదికలు సైతం వెలువడుతున్నాయి.
మార్కెట్ అంచనాల ప్రకారం.. Samsung Galaxy S24 FE ఫోన్ Galaxy S23 FE కంటే ఎక్కువ ధర ట్యాగ్‌తో USలో లాంచ్ అవ్వొచ్చు. లీక్ అయిన కొన్ని స్మార్ట్‌ప్రిక్స్ నివేదిక ప్రకారం.. Galaxy S24 FE 128GB వేరియంట్ USలో $649 (సుమారు రూ. 54,200) వద్ద ప్రారంభమవుతుంది. అలాగే, 256GB వేరియంట్ $709(దాదాపు రూ. 59,200) ఉండవచ్చు. మొదటి వేరియంట్‌లో Galaxy S23 FE లాంచ్ ధర $599 (దాదాపు రూ. 50,000)గా ఉంది. అంటే, $50 (దాదాపు రూ. 4,200) పెరిగింది. అలాగే, Galaxy S24 FE 8GB + 128GB వేరియంట్ ఐరోపా దేశాలలో EUR 799 (దాదాపు రూ. 74,100)గా ఉండవచ్చని లీక్ కాగా, ఇది గత మోడల్‌తో పోల్చితే దాని ధర కంటే EUR 100 (దాదాపు రూ. 9,200) పెరిగింది.
Samsung Galaxy S24 FE హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, 1900 nits గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయి, గొరిల్లా గ్లాస్ Victus+ రక్షణతో రూపొందించబడింది. ఈ ఫోన్‌కు Exynos 2400e ప్రాసెసర్, 25W వైర్డు మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 4,565mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదల కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇది 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 10-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉండవచ్చని అంచనా. గత మోడల్‌కు వినియోగించిన కనెక్టవిటీ ఫీచర్స్‌తోపాటు ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను దీనికి కూడా కొనసాగించవచ్చు.
గతంలో లీకైన విషయాలను బట్టీ Samsung Galaxy S24 FE కూడా గతంలో రిలీజ్ అయిన Galaxy S23 FE వేరియంట్‌కు సమానమైన డిజైన్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఇది అల్యూమినియం మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ రియర్ ప్యానెల్‌తో డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, గ్రాఫైట్, సిల్వర్/వైట్, ఎల్లో అనే ఐదు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
ప్రకటన
ప్రకటన