Photo Credit: Samsung
కొత్త ఏడాది జనవరి నెలలో Samsung Galaxy S25 సిరీస్ రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్ ఈ సిరీస్‌లో టాప్-ఆఫ్-లైన్ హ్యాండ్‌సెట్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలి ఓ నివేదిక ప్రకారం, ఈ ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ సీమ్‌లెస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల సపోర్ట్‌తో వచ్చేలా ఆండ్రాయిడ్ A/B ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్ సిస్టమ్‌ను ప్రభావితం చేయనుంది. తాజా అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఎలాంటి డౌన్ టైమ్ లేకుండా ఉండేలా వినియోగదారులు గెలాక్సీ S25 అల్ట్రాను ఉపయోగించేలా ఇది అనుమతిస్తుంది.
తాజా నివేదికలో ఆండ్రాయిడ్ అథారిటీ ఉద్దేశించిన గెలాక్సీ S25 అల్ట్రా మోడల్‌కు సంబంధించిన కొన్ని లీకైన ఫైల్‌లు ద్వారా నిర్ధారణ అయినట్లు వెల్లడైంది. దీని ద్వారా ఇది ఆండ్రాయిడ్ A/B OTA అప్‌డేట్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఇంటర్నల్ ఫైల్స్ సిరీస్‌లోని టాప్-ఆఫ్-లైన్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించినవి అయితే, శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లోని ఇతర రెండు హ్యాండ్‌సెట్‌లైన గెలాక్సీ S25, గెలాక్సీ S25 ప్లస్‌లకు కూడా వర్తిస్తుందని అంచనా వేయబడింది. ఈ విషయం టిప్‌స్టర్ @chunvn8888 ద్వారా బహిర్గతం అయ్యింది. ఇతను నవంబర్‌లో సీమ్‌లెస్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్ట్ చేసే Samsung Galaxy S25 సిరీస్ గురించిన విషయాన్ని మొదటగా వెల్లడించాడు.
ఈ ఆండ్రాయిడ్‌లో A/B అప్‌డేట్ సిస్టమ్ అనేది సిస్టమ్ స్టోరేజ్‌లో రెండు వేర్వేరు పారిటేషన్‌ల ద్వారా పని చేస్తోంది. ఒకసారి ట్రిగ్గర్ చేసినప్పుడు అప్‌డేట్ ఇన్‌స్టాలేషన్ ఇన్‌యాక్టివ్ B పారిటేషన్‌పై స్టార్ట్ అవుతూ, స్మార్ట్ ఫోన్ సిస్టమ్ A పారిటేషన్‌పై రన్ అవుతున్న దాని కార్యాచరణను కలిగి ఉండడం ద్వారా బహుళ ప్రయోజనాలను అందిస్తుందని వెల్లడించారు. స్టార్టర్స్ కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రాసెస్‌లో వినియోగదారులు తమ డివైజ్‌ను ఉపయోగించడాన్ని ఇది అనుమతిస్తుంది.
ఈ ప్రక్రియలో అప్‌డేట్ చేయబడిన డిస్క్ పారిటేషన్‌లోకి రీబూట్ చేసినప్పుడు మాత్రమే డౌన్‌టైమ్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే, అప్‌డేట్ ఫెయిల్ అయినా లేదా హ్యాండ్‌సెట్‌కు మరేదైనా సమస్య ఎదురైనా అది పాత పారిటేషన్ లేదా OSలోకి రీబూట్ అయిపోతుంది. ఇది సాధారణంగా బ్రికింగ్‌గా చెప్పబడే నిష్క్రియ స్థితికి పడిపోయే అవకాశాలను తగ్గిస్తోంది. అలాగే, వినియోగదారులు ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇన్‌స్టాల్‌ని మళ్లీ ప్రయత్నించేందుకు అవకాశం ఉంటుంది.
తాజాగా SM-S938 మోడల్ నంబర్‌తో బహిర్గతమైన Samsung Galaxy S25 Ultra, Qualcomm న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇది మార్కెట్‌లో ఫ్లాగ్‌షిప్ మొబైల్ ప్రాసెసర్. అయితే, సిరీస్‌కు సంబంధించి కంపెనీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడకపోవడంతో ఇవి ఊహాగానాలుగానే చెప్పబడుతున్నాయి. త్వరలోనే Samsung ఈ వార్తలకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన