Galaxy Z Fold 6 Ultra లాంచ్‌పై Samsung కంపెనీ అధికారిక ప్ర‌క‌ట‌న రావడ‌మే ఆల‌స్యం

ఓ కొరియన్ రిటైలర్ Galaxy Fold 6 స్పెషల్ ఎడిషన్ అనే ఫోల్డబుల్ మోడ‌ల్‌ లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలను సూచించే పోస్టర్‌ను షేర్ చేశారు. షేర్ చేసిన‌ పోస్టర్‌లో ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్న అల్ట్రా మోడల్ నంబర్‌ను జోడించారు

Galaxy Z Fold 6 Ultra లాంచ్‌పై Samsung కంపెనీ అధికారిక ప్ర‌క‌ట‌న రావడ‌మే ఆల‌స్యం

Photo Credit: Samsung

Samsung’s Galaxy Z Fold 6 is available in India starting at Rs. 1,64,999

ముఖ్యాంశాలు
  • Samsung Galaxy Z Fold 6 జూలై, 2024లో లాంచ్ అయింది
  • Galaxy Z Fold 6 Ultra స్లిమ్‌ మోడల్ తర్వాత లాంచ్ అవుతుందని ప్ర‌క‌ట‌న‌
  • అదే మోనికర్‌తో ఆన్‌లైన్‌లో ట్యాగ్ చేయబడిన Galaxy Fold 6 స్పెషల్ ఎడిషన్
ప్రకటన

Samsung నుంచి Galaxy Z Fold 6 Ultra మోడ‌ల్ లాంచ్ కాబోతున్న‌ట్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోంది. అయితే, జులైలో Galaxy Z Fold 6 విడుదుల కావ‌డంతోపాటు, Samsung ఫోల్డబుల్ ఈవెంట్‌లో కొత్త మోడ‌ల్‌కు సంబంధించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. దీంతో Samsung త‌న Galaxy Z Fold 6 Ultra డెవ‌ల‌ప్‌మెంట్‌పై పని చేయడం ఆపివేసిందని ఒక నివేదికలో పేర్కొంది. Samsung మొట్టమొదటి అల్ట్రా-బ్రాండెడ్ ఫోల్డబుల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న Galaxy Z Fold 6 కంటే స‌న్న‌గా ఉండి, అప్‌గ్రేడ్‌ వెర్షన్‌గా మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్‌ను అక్టోబర్‌లో విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా, దీనికి సంబంధించిన వివరాలు ఓ రిటైలర్ ద్వారా ఆన్‌లైన్‌లో బ‌హిర్ఘతం అయ్యాయి.

లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలు..

ఓ కొరియన్ రిటైలర్ Galaxy Fold 6 స్పెషల్ ఎడిషన్ అనే ఫోల్డబుల్ మోడ‌ల్‌ లాంచ్ తేదీ, ప్రీ-ఆర్డర్ వివరాలను సూచించే పోస్టర్‌ను షేర్ చేశారు. అంతేకాదు, ఒక వినియోగదారు షేర్ చేసిన‌ పోస్టర్‌లో ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్న అల్ట్రా మోడల్ నంబర్‌ను కూడా జోడించారు. స్పెషల్ ఎడిషన్ Galaxy Z Fold 6 అక్టోబర్ 25న లాంచ్ అవుతుందని, ప్రీ-ఆర్డర్‌లు అక్టోబర్ 18 నుంచి 24 మధ్య శామ్‌సంగ్ హోమ్ మార్కెట్ సౌత్ కొరియాలో అందుబాటులో ఉంటాయని పోస్టర్‌లో పేర్కొన్నారు.

Galaxy Z Fold 6 క్రాఫ్టెడ్ బ్లాక్ వెర్షన్..

ఈ పోస్టర్‌లో లింక్‌ను కూడా యాడ్ చేశారు. అయితే, ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. Samsung అధికారిక వెబ్‌సైట్‌లోని Galaxy Z Fold 6 (క్రాఫ్టెడ్ బ్లాక్ వేరియంట్) ఓపెన్ అవుతోంది. Galaxy Z Fold 6 క్రాఫ్టెడ్ బ్లాక్ వెర్షన్ ప్రత్యేకమైన‌ రంగుగా మ‌న దేశీయ మార్కెట్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉంది. దీనిని Samsung అధికారిక‌ వెబ్‌సైట్ నుండి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. స్థానిక రిటైలర్‌ల వద్ద అందుబాటులో ఉండదు. ఆన్‌లైన్‌లో వినియోగ‌దారులు పోస్ట్ చేసిన రెండవ లింక్ T స్టోర్ ఈవెంట్‌ను సూచిస్తుంది. దాని URLలో f958 అనే మోడల్ నంబర్ ఉంది.

అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ..

అయితే, ఈ మోడల్ నంబర్ SM-F958 మ‌నుప‌టి Galaxy Z Fold 6 Ultra లీక్‌లలో కూడా కనిపించింది. ఈ నంబర్‌ను సూచించే అనేక నివేదికలు ప్ర‌చారంలో ఉన్నాయి. వాటిలో 8 సంఖ్య Samsung స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో అల్ట్రా పరికరాన్ని, 6 నాన్-అల్ట్రా మోడల్‌లను సూచిస్తుంది. అప్‌గ్రేడ్ చేయబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ మడతపెట్టినప్పుడు 10.6mm మందంతో పాటు 8-అంగుళాల పెద్ద‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే, ఈ పోస్టర్ ఆధారంగా Galaxy Z Fold 6 Ultraకు సంబంధించి ఎలాంటి దృవీక‌ర‌ణ‌కు రాలేమ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీని లాంచ్ గురించి Samsung అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే వ‌ర‌కూ ఇవ‌న్నీ ఊహాగానాలుగానే చూడాల‌ని సూచిస్తున్నాయి.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  2. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  3. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  4. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  5. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  6. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  7. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  8. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
  9. కొత్తగా షావోమీ 16 ప్రో మినీ అనే కాంపాక్ట్ వెర్షన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం
  10. సామ్ సంగ్ గెలాక్సీ S26 ప్రో.. ఫీచర్స్‌లో హైలెట్స్ ఇవే
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »