ఈ ఫెస్టివ్ డీల్స్‌లో కస్టమర్లు గరిష్టంగా రూ. 58,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రీమియమ్ నుండి మిడ్‌రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్ వరకు ఉన్న మోడళ్లపై ఈ తగ్గింపులు వర్తిస్తాయి.
అమెజాన్ సేల్ సమయంలో Samsung Galaxy S24 Ultra టాప్ డిస్కౌంట్లతో లభిస్తుంది
ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సామ్‌సంగ్ ఈ వారం తన కొత్త ఫెస్టివ్ ఆఫర్లను ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమయ్యే ఈ ఆఫర్లలో, గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24 FE, గెలాక్సీ S24 (Snapdragon వెర్షన్), గెలాక్సీ A55 5G తో పాటు గెలాక్సీ A-సిరీస్, M-సిరీస్, F-సిరీస్ మోడళ్లను కూడా తగ్గింపు ధరలకు అందించనుంది. కంపెనీ ఇప్పటికే ఈ ఆఫర్లలో ఉండే ఫోన్ల లిస్టుతో పాటు వాటి కొత్త ధరలను కూడా వెల్లడించింది. ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే ఉండనున్నాయని సామ్‌సంగ్ తెలిపింది.ఈ ఫెస్టివ్ డీల్స్‌లో కస్టమర్లు గరిష్టంగా రూ. 58,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రీమియమ్ నుండి మిడ్‌రేంజ్, బడ్జెట్ సెగ్మెంట్ వరకు ఉన్న మోడళ్లపై ఈ తగ్గింపులు వర్తిస్తాయి. తగ్గిన ధరలు రూ. 9,999 నుండి రూ. 1,29,999 వరకు ఉంటాయి. అయితే ఈ ఆఫర్లు ఎంతకాలం కొనసాగుతాయో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
2024 జనవరిలో Snapdragon 8 Gen 3 చిప్‌తో లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S24 అల్ట్రా ఇప్పుడు రూ. 75,000 లోపలే దొరకనుంది. మిడ్‌రేంజ్ విభాగంలో గెలాక్సీ A55 5G ధర రూ. 25,000 వరకు తగ్గించబడింది....అంటే దీని అసలు లాంచ్ ధరతో పోలిస్తే సుమారు రూ. 15,000 తగ్గింపు. బడ్జెట్ సెగ్మెంట్‌లో గెలాక్సీ F06 5G, గెలాక్సీ M06 5G, గెలాక్సీ M16 5G వంటి మోడళ్లు కూడా డిస్కౌంట్ ధరలకు అందుబాటులో ఉంటాయి.
సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమయ్యే ఈ ఫెస్టివ్ సేల్‌లో సామ్‌సంగ్ బెస్ట్ డీల్స్‌ను కస్టమర్లు పొందవచ్చు. కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం కావొచ్చు. గెలాక్సీ S-సిరీస్‌లో, జనవరిలో విడుదలైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S24 అల్ట్రా ధరను రూ. 1,29,999 నుంచి రూ. 71,999 కి తగ్గించారు. అదే విధంగా Snapdragon చిప్‌సెట్‌తో వచ్చే గెలాక్సీ S24 ఇప్పుడు రూ. 39,999 కి దొరకనుంది, ఇది అసలు ధర రూ. 74,999 తో పోలిస్తే భారీ తగ్గింపు. గెలాక్సీ S24 FE మోడల్ ధర కూడా రూ. 59,999 నుండి రూ. 29,999 కి తగ్గింది.
మిడ్‌రేంజ్ గెలాక్సీ A-సిరీస్‌లో, గెలాక్సీ A55 5G ని రూ. 23,999 కి అందిస్తుండగా, A35 5G ని రూ. 17,999 కి తీసుకెళ్లవచ్చు. బడ్జెట్ స్నేహపూర్వక గెలాక్సీ M-సిరీస్‌లో, M36 5G ధరను రూ. 19,999 నుండి రూ. 13,999 కి తగ్గించారు. M16 5G కేవలం రూ. 10,499 లోపలే లభిస్తుంది, M06 5G ని రూ. 7,499 కి అందిస్తున్నారు. ఇదే ధరలు గెలాక్సీ F-సిరీస్‌కూ వర్తిస్తాయి – F36 5G రూ. 13,999 కి, F06 5G రూ. 7,499 కి అందుబాటులో ఉన్నాయి. సామ్‌సంగ్ మొబైల్ కొనాలి అని ఎదురుచూస్తున్న కస్టమర్లకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.
ప్రకటన
ప్రకటన