మోటరోలా సిగ్నేచర్ సిరీస్.. ఈ విశేషాలు మీకు తెలుసా

మోటరోలా నుంచి సిగ్నేచర్ సిరీస్ త్వరలోనే లాంఛ్ కాబోతోంది. ఇది ఫ్లిప్ కార్ట్ పేజీలో "సిగ్నేచర్ క్లాస్ త్వరలో వస్తోంది!" అని ఇంట్రెస్టింగ్‌ను క్రియేట్ చేశారు.

మోటరోలా సిగ్నేచర్ సిరీస్.. ఈ విశేషాలు మీకు తెలుసా

కార్బన్ కలర్‌వేలో మోటరోలా సిగ్నేచర్ • మార్టిని ఆలివ్ కలర్‌వేలో మోటరోలా సిగ్నేచర్

ముఖ్యాంశాలు
  • మోటరోలా నుంచి న్యూ మోడల్
  • సిగ్నేచర్ సిరీస్ గురించి లీక్స్
  • ఎడ్జ్ 70 అల్ట్రాగా రానున్న కొత్త ఫోన్
ప్రకటన

మోటరోలా సిగ్నేచర్ యొక్క రెండర్‌లు గత వారం ఆన్‌లైన్‌లో కనిపించాయి, స్మార్ట్‌ఫోన్ డిజైన్, రంగు ఎంపికలను వెల్లడించాయి. 'ఉరుస్' అనే కోడ్‌నేమ్‌తో గతంలో ఎడ్జ్ 70 అల్ట్రాగా పుకార్లు వచ్చిన మోటరోలా సిగ్నేచర్, మోటరోలా కొత్త సిగ్నేచర్ సిరీస్‌లోని మొదటి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి అవుతుంది. మోటరోలా నుండి దీని గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కానీ భారతీయ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్‌కు సిగ్నేచర్ సిరీస్ త్వరలో వస్తుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో సిగ్నేచర్ సిరీస్ కోసం "సిగ్నేచర్ క్లాస్ త్వరలో వస్తోంది!" అని ఒక ప్రోమో పేజీని ఏర్పాటు చేసింది.ఫ్లిప్ కార్ట్ పేజీలో మోటరోలా గురించి స్పష్టంగా ప్రస్తావించలేదు. బదులుగా మోటరోలా సిగ్నేచర్ బ్యాట్వింగ్ లోగో, పాంటోన్ భాగస్వామ్యం వంటి సూచనల ఆధారంగా బ్రాండ్‌ను ఊహించమని కస్టమర్లను అడుగుతోంది. మీరు బ్రాండ్ పేరును సరిగ్గా ఊహించిన తర్వాత, పేజీ "కమ్ బ్యాక్ ఆన్ 28th డిసెంబర్" అని చెప్పే సందేశాన్ని చూపిస్తోంది. ఆ సమయంలో సిగ్నేచర్ గురించి మరిన్ని వివరాలు ఉండవచ్చని అర్థం అవుతోంది.


మోటరోలా త్వరలో లాంచ్ కాగల కొత్త 'సిగ్నేచర్' స్మార్ట్‌ఫోన్‌పై పని చేస్తుందని ఇది వరకే లీక్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలి నివేదికల ప్రకారం, మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రా కంపెనీ ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌కు మరో అదనంగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కానీ కొత్త లీక్ ప్రకారం అదే డిజైన్‌తో కూడిన ఫోన్ మోటరోలా సిగ్నేచర్ బ్రాండింగ్ కింద రావచ్చని సమాచారం. డిజైన్ రెండర్‌లు ఫోన్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను అలాగే దాని డిస్ప్లే, కలర్ ఆప్షన్‌లను చూపుతాయి.


మోటరోలా సగ్నేచర్ డిజైన్, కలర్ ఆప్షన్స్ (అంచనా)

మోటరోలా సిగ్నేచర్ ఫోన్ యొక్క రెండర్‌లను కొందరు ఇది వరకే లీక్ చేశారు. ఆ లీకుల ప్రకారం మోటరోలా ఎడ్జ్ 70 అల్ట్రాతో అసాధారణమైన పోలికను కలిగి ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను వెల్లడించింది. హ్యాండ్‌సెట్ చదరపు ఆకారంలో ఉన్న వెనుక కెమెరాతో కనిపిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. ఇది మధ్యలో మోటరోలా బ్రాండింగ్‌ను కలిగి ఉన్న టెక్స్చర్డ్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చు. రెండర్ ప్రకారం, హ్యాండ్‌సెట్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), డాల్బీ విజన్ సపోర్ట్‌తో సోనీ లిటియా సెన్సార్ ఉంటుందని సమాచారం.
మోటరోలా సిగ్నేచర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 SoC, 16GB RAM, ఆండ్రాయిడ్ 16, 6.7" 120Hz 1.5K రిజల్యూషన్ OLED స్క్రీన్‌తో వస్తుందని తెలుస్తోంది. వెనుక కెమెరాలు 50MP సెన్సార్‌లను ఉపయోగిస్తాయని సమాచారం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఇలాంటి కూలింగ్ సిస్టమ్ ఇప్పటికే Oppo K13 Turbo Proలో ఉండటం విశేషం.
  2. డిజైన్ పరంగా చూస్తే, OnePlus Turbo ఫోన్ ప్లాస్టిక్ బాడీతో రావచ్చని సమాచారం.
  3. మోటరోలా సిగ్నేచర్ సిరీస్.. ఈ విశేషాలు మీకు తెలుసా
  4. 19 వేల తగ్గింపుతో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో.. అదిరే ఆఫర్ ఎక్కడంటే
  5. వన్ ప్లస్ నార్డ్ 4పై సరసమైన సేల్.. ఎంత తగ్గిందంటే
  6. ఈ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Xiaomi Watch 5లో Snapdragon W5 చిప్‌సెట్ను వినియోగిస్తున్నారు.
  7. ప్రస్తుతం ఈ మోడళ్లలో కొన్ని ఫిలిప్పీన్స్, మలేషియా వంటి మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.
  8. భారీ యాప్‌లు, మల్టీటాస్కింగ్, గేమింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించవచ్చు.
  9. వాట్సప్ చానెల్‌లో క్విజ్.. ఇంటరాక్షన్స్ పెంచేందుకు కొత్త ఫీచర్
  10. కెమెరాల విషయానికి వస్తే, వెనుక భాగంలో 13MP f/1.8 అపర్చర్ ఆటోఫోకస్ కెమెరా ఉంది.
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »