గ‌్లోబ‌ల్ మార్కెట్‌లో హ‌వా చాటిన‌ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 15.. కౌంటర్ పాయింట్ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే

ఐఫోన్ 15 సిరీస్ నుండి ప‌లు మోడ‌ల్స్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా మొదటి మూడు స్థానాలను కైవ‌సం చేసుకుంది. అలాగే, Samsung కూడా ఈ జాబితాలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది

గ‌్లోబ‌ల్ మార్కెట్‌లో హ‌వా చాటిన‌ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 15.. కౌంటర్ పాయింట్ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే

Photo Credit: Apple

Apple's iPhone 15 series took the top three spots in the list

ముఖ్యాంశాలు
  • ఈ టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్ వాటాలో 19 శాతం వాటాను సాధించాయి
  • Redmi Note 13C 4G ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది
  • Samsung Galaxy S24 10వ స్థానాన్ని కైవసం చేసుకుంది
ప్రకటన

ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల హ‌వా కొన‌సాగుతూ ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా మొబైల్‌ మార్కెట్ Apple మ‌రోసారి త‌న స‌త్తా చాటింది. మార్కెట్‌ రీసెర్చ్ సంస్థ నివేదికలో.. 2024 మూడవ త్రైమాసికానికి (క్యూ3) గ్లోబల్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్‌ల జాబితాలో Apple అగ్రస్థానంలో నిలిచింది. ఈ టెక్ దిగ్గజం దాని ఐఫోన్ 15 సిరీస్ నుండి ప‌లు మోడ‌ల్స్‌ను విడుద‌ల చేయ‌డం ద్వారా మొదటి మూడు స్థానాలను కైవ‌సం చేసుకుంది. అలాగే, Samsung కూడా ఈ జాబితాలో అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది. Galaxy S సిరీస్‌తో మొద‌టిసారిగా 2018 నుండి టాప్ 10 ర్యాంకింగ్‌లలోకి అడుగుపెట్టింది. ఈ టాప్ 10 మోడల్స్‌లో నిలిచిన‌ మొత్తం స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోని 19 శాతం వాటాను పొందాయి. మ‌రి ఈ జాబితాలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల వివ‌రాలను చూసేద్దామా?!

ఐఫోన్ 15 ప్రపంచంలోనే అత్యధికంగా..

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ గ్లోబల్ హ్యాండ్‌సెట్ మోడల్ సేల్స్ ట్రాకర్ నివేదిక‌ ప్రకారం.. క్యూ3 2024లో ఐఫోన్ 15 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఐఫోన్ 15 ప్రో మాక్స్, ఐఫోన్ 15 ప్రోలు వ‌రుస‌గా రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి. మొత్తంగా ఆపిల్ నాలుగు స్థానాలను కైవసం చేసుకోగలిగింది. అంతేకాదు, ఐఫోన్ 14 కూడా ఈ లైనప్‌లో ఏడవ స్థానంలో నిలిచింది.

రీసెర్చ్ నోట్ సూచ‌న ప్ర‌కారం..

ఈ నివేదిక ఆదారంగా.. వినియోగ‌దారులు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రాధాన్యత ఇస్తున్న‌ట్లు రీసెర్చ్ నోట్ సూచిస్తుంది. ఆపిల్ కంపెనీ దాని స్టాన్డ‌ర్డ్‌, ప్రో మోడల్స్‌ మధ్య అమ్మకాల వ్య‌త్యాసాన్ని తగ్గించడంలో స‌హాయ‌ప‌డుతోంది. అలాగే, మూడవ త్రైమాసికంలో మొదటిసారి, క్యూ3లో మొత్తం ఐఫోన్ అమ్మకాలలో సగానికిపైగా ప్రో వేరియంట్‌లు యాపిల్ మిడ్‌-ప్రైజ్ ఉత్ప‌త్తుల‌ అమ్మకాలను సాధించడంలో ప్ర‌ధాన‌ కార‌ణంగా నిలిచాయి.

మిడ్ ప్రైజ్ బ్రాండ్ ఉత్ప‌త్తులు..

మరోవైపు, ఈ జాబితాలో అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లతో సామ్‌సంగ్ కంపెనీ ఉత్ప‌త్తులు కూడా త‌మ సత్తా చాటాయి. ఇందులో ఐదింట నాలుగు ఉత్ప‌త్తులు బడ్జెట్ A-సిరీస్‌కు చెందినవి. అంతేకాదు, Samsung Galaxy S24 10వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 2018 నుండి టాప్ 10 ర్యాంకింగ్‌లలోకి ప్రవేశించిన మొదటి Galaxy S-సిరీస్ మోడ‌ల్‌గా గుర్తింపు పొందింది. దక్షిణ కొరియా టెక్నాలజీతో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తోన్న ఈ మిడ్ ప్రైజ్ బ్రాండ్ ఉత్ప‌త్తులు గ్లోబ‌ల్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాయి.

తొమ్మిద‌వ స్థానంలో Redmi 13C 4G..

మొత్తంగా యాపిల్, శాంసంగ్ రెండు కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లలో కృత్రిమ మేధస్సు (AI)ని ప్రవేశపెట్టడం ద్వారానే అగ్రస్థానంలో నిలిచాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఐఫోన్ మోడల్ ఫోన్‌లు ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో AI ఫీచర్‌లను పొందుతున్నాయి. అలాగే, Samsung హ్యాండ్‌సెట్‌లు Galaxy AI ద్వారా ప‌వ‌ర్‌ను పొందుతున్నాయి. ఈ రెండు టెక్ దిగ్గజాలతోపాటు బడ్జెట్ ఉత్ప‌త్తుల జాబితాలో Redmi 13C 4G కూడా చేరింది. ర్యాంకింగ్స్‌లో ఇది తొమ్మిదవ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.

Comments

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »