రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?

కొత్త మొబైల్‌ కొనుగోలు చేయాలనుకునే అభ్యర్థులు శుభవార్త. గూగుల్ పిక్సెల్ 10 సీరిస్ ఫోన్లు మన దేశంలో లాంఛ్ అయ్యాయి. కంపెనీ మొత్తం 4 ఫోన్లను విడుదల చేసింది. ఈ కొత్త ఫోన్లలో మోడ్రన్ ఫీచర్లు, ఆప్షన్లు ఉన్నాయి.

రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు,  ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?

Photo Credit: Google

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుంది

ముఖ్యాంశాలు
  • గూగుల్ పిక్సెల్ 10లో 4,970mAh బ్యాటరీ
  • Pro హ్యాండ్‌సెట్‌లలో 48-మెగాపిక్సెల్ 5x టెలిఫోటో కెమెరాలు
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌తో పిక్సెల్ 10 సిరీస్ ఫోన్
ప్రకటన

గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు మార్కెట్‌లో విడుదలయ్యాయి. అధునాతనమైన ఫీచర్లు, ఆప్షన్లు ఈ హ్యాండ్‌సెట్‌లలో ఉన్నాయి. గూగుల్ బుధవారం భారతదేశంలో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్‌తో పాటు బేస్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XLలను లాంఛ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌లతో ఇన్-హౌస్ టెన్సర్ G5 చిప్‌సెట్‌లను అమర్చారు. అవి ఇన్‌బిల్ట్ Qi2 ఛార్జింగ్ మాగ్నెట్‌లతో అమర్చబడి ఉంటాయి. పిక్సెల్ స్నాప్ మాగ్నెటిక్ ఛార్జింగ్ ఉపకరణాలతో అనుకూలంగా ఉంటాయి. ప్రో, ప్రో XL మోడల్‌లు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాలు, 42-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌లతో వస్తాయి. పిక్సెల్ 10, ప్రో మోడల్‌లు 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్‌తో టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటాయి. కానీ వరుసగా సూపర్ రెస్ జూమ్ (20x), ప్రో రెస్ జూమ్ (100x) లకు సపోర్ట్ చేస్తాయి.

గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL ధర, లభ్యత

భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 10 ధర 256GB ఏకైక వేరియంట్ ధర రూ. 79,999లు. ఈ హ్యాండ్‌సెట్ ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్, అబ్సిడియన్ షేడ్స్‌లో అమ్మానికి ఉంది. ఈ మొబైల్‌తోపాటు

పిక్సెల్ 10 Pro రూ. 1,09,999లు, పిక్సెల్ 10 Pro XL ధర రూ. 1,24,999ల. రెండు మోడళ్లు Jade, మూన్‌స్టోన్, అబ్సిడియన్ కలర్స్‌లో లభించనున్నాయి. పిక్సెల్ 10 ప్రో అదనపు పింగాణీ వేరియంట్‌లో కూడా రానుంది. ఈ అన్ని Google Pixel 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండనున్నాయి.

గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ గూగుల్ పిక్సెల్ 10 ఫోన్‌ 6.3 అంగుళాల పూర్తి-HD+ (1,080×2,424 పిక్సెల్స్) OLED సూపర్ ఆక్టువా డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. అలాగే ఈ హ్యాండ్ సెట్ 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో కలిగి ఉంది. వెనుక ప్యానెల్‌లో కూడా అదే ప్రొటెక్టివ్ గ్లాస్ ఉంటుంది. హ్యాండ్‌సెట్ 3nm టెన్సర్ G5 SoC, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్‌తో, 12GB RAM, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఏడు సంవత్సరాల OS, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. ఈ ఫోన్ గూగుల్ Geminiకి సపోర్ట్ చేస్తుంది. మెటీరియల్ యు ఎక్స్‌ప్రెసివ్ డిజైన్ సిస్టమ్‌ను అందిస్తుంది.

కెమెరా విభాగానికి వస్తే గూగుల్ పిక్సెల్ 10 లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5x జూమ్ సపోర్ట్‌తో 10.8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం హ్యాండ్‌సెట్‌లో 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది కెమెరా కోచ్‌తో సహా అనేక AI- ఆధారిత ఇమేజింగ్ ఇన్‌పుట్స్‌కి మద్దతు ఇస్తుంది.

గూగుల్ పిక్సెల్ 10లో 4,970mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 15W వరకు Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పిక్సెల్ స్నాప్ ఉపకరణాలకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దుమ్ము, నీటి నుంచి రక్షణగా IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చబడింది. ఇది eSIM, 5G, 4G, GPS, GNSS, Google Cast, బ్లూటూత్ 6, Wi-Fi, NFC, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

గూగుల్ పిక్సెల్ 10 Pro మొబైల్ 1,280×2,856 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3 అంగుళాల సూపర్ ఆక్టువా డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే పిక్సెల్ 10 Pro XL 1,344×2,992 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పెద్ద 6.8-అంగుళాల స్క్రీన్‌ను అందిస్తుంది. రెండూ 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌లతో LTPO ప్యానెల్‌లను ఉపయోగిస్తాయి. 3,000 నిట్‌ల బ్రైట్‌నెస్‌‌ కలిగి ఉంటుంది. ముందు, వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటక్ట్ చేయబడతాయి. ప్రో మోడల్స్ టెన్సర్ G5 చిప్‌లతో కూడా సపోర్ట్ ఇవ్వబడినప్పటికీ, అవి 16GB RAMకి సపోర్ట్ చేస్తాయి.

ఇక పిక్సెల్ 10 Pro, పిక్సెల్ 10 ప్రో XL రెండూ స్టాండర్డ్ మోడల్ లాగానే ఆపరేటింగ్ సిస్టమ్, కనెక్టివిటీ, ఛార్జింగ్, కూలింగ్, బిల్డ్, సెక్యూరిటీ ఫీచర్లు కలిగి ఉంటాయి. ప్రో వెర్షన్లు 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక సెన్సార్లను, 48-మెగాపిక్సెల్ 5x టెలిఫోటో కెమెరాలు, 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటాయి. వాటికి ఒక్కొక్కటి 42-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్ కూడా ఉంది. Pro, Pro XL మోడల్స్ వరుసగా 4,870mAh, 5,200mAh బ్యాటరీలను కలిగి ఉంటాయి. రెండో హ్యండ్‌సెట్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 25W వరకు వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ Pixel 10 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే 6:30 అంగుళాలు

ముందు కెమెరా 10.5-మెగాపిక్సెల్

వెనుక కెమెరా 48 మెగాపిక్సెల్ + 13 మెగాపిక్సెల్ + 10.8 మెగాపిక్సెల్

RAM 12 GB

స్టోరేజ్ 256GB

బ్యాటరీ సామర్థ్యం 4970mAh

ఆండ్రాయిడ్ 16

రిజల్యూషన్ 1080x242 పిక్సెల్స్

గూగుల్ పిక్సెల్ 10 Pro స్పెసిఫికేషన్స్

డిస్‌‌ప్లే - 6.30-అంగుళాలు

ముందు కెమెరా - 42 మెగాపిక్సెల్

వెనుక కెమెరా - 50-మెగాపిక్సెల్ + 48-మెగాపిక్సెల్ + 48-మెగాపిక్సెల్

RAM - 16 జిబి

స్టోరేజ్ - 256GB

బ్యాటరీ సామర్థ్యం - 4870mAh

ఆండ్రాయిడ్ 16

రిజల్యూషన్ - 1280x2856 పిక్సెల్స్

గూగుల్ పిక్సెల్ 10 Pro XL స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే - 6.80-అంగుళాలు

ముందు కెమెరా - 42 మెగాపిక్సెల్

వెనుక కెమెరా 50 - మెగాపిక్సెల్ + 48-మెగాపిక్సెల్ + 48-మెగాపిక్సెల్

RAM 16 GB

స్టోరేజ్ - 256GB

బ్యాటరీ సామర్థ్యం - 5200mAh

ఆండ్రాయిడ్ - 16

రిజల్యూషన్ - 1344x2992 పిక్సెల్స్

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »