ఇకపై Samsung One UI 8 ఫోన్లలో OS ను మార్చుకునేందుకు అవకాశం లేకుండా అన్ లాక్ చేశారు.
Photo Credit: Samsung
గెలాక్సీ Z ఫ్లిప్ 7 (చిత్రంలో) పై స్థిరమైన వన్ UI 8 బిల్డ్‌లో ఆధారాలు కనుగొనబడ్డాయి
మీరు Samsung One UI 8 ఫోన్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే మీరు ఈ అప్‌డేట్‌ని తెలుసుకోవాల్సిందే. Samsung One UI 8 ఫోన్‌లో కీలకమైన మార్పు జరిగింది. దీనిద్వారా ఫోన్ సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు మరింత అనుకూలంగా మారనుంది. ఈ మేరకు ఫోన్ ఫీచర్లలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. నిజానికి ఈ నెల ప్రారంభంలో గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7లను ప్రారంభించడంతో Samsung తన ఆండ్రాయిడ్ 16-ఆధారిత One UI 8 ఫర్మ్‌వేర్‌ను విడుదల చేసింది. దీనిద్వారా సెట్టింగ్‌లలో కొన్ని అప్‌డేట్స్‌ని చేసింది. కొన్ని ఫీచర్లను కూడా తొలగించింది. ఒక రిపోర్ట్ ప్రకారం ONE UI 8 స్థిరమైన బిల్డ్‌లో OEM అన్‌లాకింగ్ సెట్టింగ్ తొలగించబడింది. ఈ అన్‌లాకింగ్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు తమ గెలాక్సీ పరికరాల్లో కస్టమ్ ROMలను ఫ్లాష్ చేయడానికి, అమలు చేయడానికి వీలు ఏర్పడుతుంది. దీంతో ఇకపై కంపాటిబుల్ OS మార్చడానికి వీలుండదు.
SammyGuru నివేదిక ప్రకారం డెవలపర్ ఆప్షన్లలో గతంలో కనుగొనబడిన OEM అన్‌లాకింగ్ టోగుల్‌ను Samsung తొలగించింది. ఇది ఏడో జనరేషన్ గెలాక్సీ ఫోల్డబుల్స్‌తో విడుదలైన స్థిరమైన One UI 8 బిల్డ్‌తో పాటు, Galaxy S25 Ultra కోసం One UI 8 బీటా అప్‌డేట్‌కు వర్తించనుంది. ఇది ప్రారంభ ఫర్మ్‌వేర్‌లలో ఎటువంటి సాంకేతిక లోపం కాదు. ఎందుకంటే XDA ఫోర్మ్‌లోని డెవలపర్లు Samsung Android 16 ఆధారిత ఫర్మ్‌వేర్ కోడ్ నుంచి OEM అన్‌లాకింగ్ ఫీచర్ టోగుల్‌ను పూర్తిగా తీసివేసినట్లు రిపోర్టులో పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా SystemProperties.get('ro.boot.other.locked').equals('1') కోడ్ స్నిప్పెట్‌లో కూడా ఈ మార్పును సూచిస్తున్నట్టు నివేదికలో ఉంది. ఈ విషయంతో పాటు equals విలువ 0 కి సెట్ చేసినప్పుడు, వినియోగదారు బూట్‌లోడర్‌ను అన్‌లాక్ చేయగలరని నివేదించబడింది. విలువ 1కు సెట్ చేయబడినప్పుడు అలా చేయడం సాధ్యం కాదు. ఇప్పటి వరకు Samsung ఫోన్‌ల US వేరియంట్‌లలో ఈ విలువ 1కు సెట్ చేయబడినట్టు తెలుస్తుంది. దీంతో అన్ని ఇతర మార్కెట్లలో అందుబాటులో ఉన్న హ్యాండ్ సెట్‌లలో బూట్‌లోడర్‌ను అన్‌లాక్ చేయవచ్చు.
అయితే One UI 8 కోడ్‌లో అంతర్జాతీయ యూనిట్లకు కూడా ఈ విలువ డిఫాల్ట్‌గా 1కి సెట్ చేయబడినట్టు రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ విషయం Samsung Galaxy Z Flip 7లోని AYFK బిల్డ్‌లోని పబ్లికేషన్ ద్వారా తెలిసింది. Samsung ఉద్దేశపూర్వకంగా ఈ మార్పు చేసిందని, One UI 8లో అందరికీ OEM అన్‌లాకింగ్ ఆప్షన్‌ని నిలిపివేసిందని రిపోర్ట్ సూచిస్తుంది. బూట్‌లోడర్‌లో అన్‌లాక్ చేయడానికి కోడ్ లేనందున కంపెనీ లాజిక్‌ను తిరిగి జోడించాలని నిర్ణయించుకునే వరకు వినియోగదారులు దానిని యాక్సెస్ చేయలేకపోవచ్చు. ఇంకా One UI 8 నడుస్తున్న గెలాక్సీ పరికరాల్లో బ్రూట్ ఫోర్స్ వర్క్‌అరౌండ్ కూడా బూట్‌లోడర్‌ను అన్‌లాక్ చేయకపోవచ్చని రిపోర్ట్ సూచిస్తుంది.
OEM అన్‌లాకింగ్ అనేది ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడానికి, కస్టమ్ ROMలను ఇన్‌స్టాల్ చేయడానికి అవసరమయ్యే ప్రక్రియ దీనివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. OEM అన్‌లాకింగ్ వల్ల ఫోన్‌లో రూట్ యాక్సెస్ పొందే ఛాన్స్ ఉంది. ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌ని మరింత సులభంగా మార్చుకోవచ్చు.
Samsung ఫోన్లకు భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎక్కువ మంది వినియోగదారులు ఈ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. నిజానికి అతి తక్కువ సమయంలోనే Samsung ఇక్కడ తన బ్రాండ్‌కు స్థిరం చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన దేశంలో ప్రీమియం విభాగంలో Samsung స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటా గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Samsung చాలా కీలకమైనది. ఎన్నో బ్రాండ్‌ల ఫోన్లు మార్కెట్‌లో ఉన్నా Samsung వాటికి గట్టి పోటీనిస్తుంది. డ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం వరకు Samsung ఫోన్లు అందుబాటులో ఉంటాయి. అంటే వినియోగదారులు తమ కొనుగోలు, అభిరుచిని బట్టి Samsung ఫోన్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇలా వినియోగదారులకు అనుకూలంగా Samsung మార్కెట్‌ని విస్తరించుకుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ వెర్షన్లతో ఫోన్లకు రిలీజ్ చేయడం, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా అందించడంలో Samsung ముందు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన