Photo Credit: HMD
గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత మన దేశీయ మొబైల్ మార్కెట్‌లోకి HMD Skyline స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 12GB RAMతో జత చేయబడిన Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే, 4,600mAh బ్యాటరీ సామర్థ్యంతో సెల్ఫ్-రిపేర్ కిట్‌తో అందించబడుతోంది. దీంతో వినియోగదారులు డిస్‌ప్లే, బ్యాటరీతో సహా ఫోన్‌లోని కొన్ని భాగాలను విడదీయడంతోపాటు మళ్లీ సెట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 108-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో దీనిని రూపొందించారు.
మన భారతదేశంలో HMD Skyline 12GB + 256GB వేరియంట్ ధర రూ. 35,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ నియాన్ పింక్, ట్విస్టెడ్ బ్లాక్ కలర్‌వేస్‌లో మార్కెట్‌లోకి వచ్చింది. ఇది అమెజాన్, HMD ఇండియా వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా దేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్-HD+ (1,800 x 2,400 పిక్సెల్‌లు) పోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 1,000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ట్రిపుల్ రక్షణతో వస్తుంది. అలాగే, 12GB RAM, 256GB RAMతో జత చేయబడిన Snapdragon 7s Gen 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది.
HMD Skyline హ్యాండ్‌సెట్‌లో కెమారా విషయానికి వస్తే.. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, అల్ట్రావైడ్ లెన్స్‌తో జత చేసిన 13-మెగాపిక్సెల్ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ముందు కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 50-మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. అలాగే, ఈ ఫోన్‌లో ఎడమవైపు అంచున కస్టమ్ బటన్‌ను అమర్చారు. ప్రెస్, హోల్డ్ మరియు డబుల్ ప్రెస్ చేయడం ద్వారా వివిధ యాక్టివిటీలను నిర్వహించుకోవచ్చు. ఇది సెల్ఫ్-రిపేర్ కిట్‌తో వస్తుంది. దీని ద్వారా వినియోగదారులు వెనుక ప్యానెల్‌ను ఓపెన్ చేసి, డిస్‌ప్లే దెబ్బతిన్నట్లయితే దాన్ని రీప్లేస్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm aptX అడాప్టివ్ ఆడియో-సపోర్టెడ్ డ్యూయల్ స్పీకర్‌లు ఉన్నాయి. 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 4,600mAh రీప్లేస్ చేయగల బ్యాటరీని HMD Skylineలో అందించారు. ఇది 15W మాగ్నెటిక్ వైర్‌లెస్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC, OTG, USB టైప్-C ఉన్నాయి. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. హ్యాండ్‌సెట్ దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధకత కోసం IP54-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఇది 160.0 x 76.0 x 9.0mm పరిమాణంతో 210గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన