అధునాతమైన Tecno Spark Go 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 14 నుంచి ప్రారంభం, అమెజాన్‌లో సేల్స్ కానున్నాయి.
Photo Credit: Tecno
టెక్నో స్పార్క్ గో 5G 6,000mAh బ్యాటరీతో వస్తుంది
అధునాతమైన మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. Tecno Spark Go 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇక్కడ లాంఛ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన తేదీని కంపెనీ ఇప్పటికే నిర్ధారించింది. దాంతోపాటు బ్యాటరీ సామర్థ్యంతో సహా రాబోయే హ్యాండ్ సెట్ కీ స్పెషికేషన్లు కూడా కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్‌లో గూగుల్ సెర్చ్, అనేక భారతీయ భాషలకు మద్దతు ఇచ్చే టెక్నో Ella AI అసిస్టెంట్‌తో సహా అనేక AI ఫీచర్లు ఉంటాయి. 5,000mAh బ్యాటరీ, 4G LTE కనెక్టివిటీకి మద్దతుతో Tecno Spark G 2ను కంపెనీ జూన్‌లో ఆవిష్కరించింది.14న భారతదేశంలో లాంఛ్ కానున్న Tecno Spark Go 5G ఫోన్,అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం రాబోయే టెక్నో స్పార్క్ గో 5G భారతదేశంలో ఆగస్టు 14న మధ్యాహ్నం 12 గంటలకు (IST) లాంఛ్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ అమ్మకాలు ఈ -కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఉన్న Tecno Spark Go 5G స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా రాబోయే మోడల్ 5G కనెక్టివిటీకి మద్దతును అందించనుంది.
ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే గణనీయమైన 6000mAh బ్యాటరీ. దీంతో వినియోగదారులకు ఎక్కువ సేపు ఫోన్‌ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. బ్యాటరీ అయిపోతుందేమోననే ఆందోళన చెందాల్సిన అవసరం, తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 5G క్యారియర్ అగ్రిగేషన్‌కు మద్దతుతో మెరుగైన కనెక్టివిటీని అందించనుంది. ఈ ఫోన్ ద్వారా కంపెనీ ఇది వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన నెట్‌వర్క్ పనితీరును అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికికుగుణంగా స్మార్ట్ ఫోన్‌లో అన్ని రకాల ఫీచర్లను జత చేసింది.ఇదే ధరలో చూసుకుంటే ఈ హ్యాండ్‌సెట్ భారతదేశంలోని అత్యంత సన్నని, తేలికైన 5G స్మార్ట్‌ఫోన్ ఇదని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్ ఫోన్ 7.99mm మందం, 194g బరువు ఉంటుంది.
కంపెనీ ప్రకటన ప్రకారం Tecno Spark Go 5G స్మార్ట్ ఫోన్ ఎటువంటి నెట్‌వర్క్ కమ్యూనికేషన్‌కు మద్దతు ఇవ్వదు. బహుశా టెక్నో ఉచిత లింక్ యాప్ ద్వారా పని చేసే అవకాశం ఉంది. Tecno Spark Go 5G 2 కూడా ఈ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ ఫోన్‌ని వినియోగించే యూజర్లకు సెల్యులార్ కనెక్టివిటీ లేకుండా కాల్స్ చేయడానికి లేదా మెసెజ్‌లను పంపడానికి అనుమతిస్తుంది.
టెక్నో స్పార్క్ గో 5G Ella AI అసిస్టెంట్ వంటి AI ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. ఇది హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, బంగ్లా వంటి భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ఈ ఫోన్ AI రైటింగ్ అసిస్టెంట్, గూగుల్ సర్కిల్ టు సెర్చ్ వంటి టూల్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ముఖ్యంగా Tecno Spark Go 2 4GB + 64GB వేరియంట్ ధర రూ. 6,999 లు. ఇది 5,000mAh బ్యాటరీ, Unisoc T7250 చిప్‌సెట్, 13 మెగాఫిక్సల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో వస్తుంది. ఇది IP64-రేటెడ్ డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉంది. Tecno ఉచిత లింక్ యాప్, 4G క్యారియర్ అగ్రిగేషన్ 2.0, లింక్ బూమింగ్ V1.0 టెక్నాలజీలకు మద్దతును కలిగి ఉంది.
TECNO Spark Go 5G ద్వారా భారతదేశంలోని విస్తృత ప్రేక్షకులకు అధునాతన సాంకేతికతలో మరో దశను అందుబాటులోకి తీసుకురానుంది. సొగసైన డిజైన్, బలమైన బ్యాటరీ, వినూత్న AI ఫీచర్ల కలయికతో విభిన్న వినియోగదారుల అవసరాలను తీర్చడం దీని లక్ష్యం.
ప్రకటన
ప్రకటన