2026లో రూ.30,000 బడ్జెట్‌లో ఒక పర్ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్ ఎంచుకోవడం నిజంగా సవాల్‌తో కూడుకున్న పని
2026లో రూ.30,000 బడ్జెట్‌లో ఒక పర్ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్
2026లో రూ.30,000 బడ్జెట్‌లో ఒక పర్ఫెక్ట్ స్మార్ట్‌ఫోన్ ఎంచుకోవడం నిజంగా సవాల్‌తో కూడుకున్న పని. మార్కెట్‌లో వందలాది మోడల్స్ అందుబాటులో ఉన్నా, ప్రతి ఫోన్ ఏదో ఒక విషయంలో రాజీ పడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే 'realme 16 5G' యువత అభిరుచులకు తగ్గట్టుగా ఒక స్టైలిష్ లైఫ్ స్టైల్ ఫోన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కేవలం ఆకర్షణీయమైన ఫీచర్లనే కాకుండా, రోజువారీ వినియోగంలో ఎదురయ్యే సమస్యలను తీర్చేలా ఈ ఫోన్ డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ సెగ్మెంట్‌లో రాజీ పడకూడదనుకునే వారికి ఇది ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 7,000mAh టైటాన్ బ్యాటరీ. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా, లావుగా ఉంటుందని అనుకుంటాం, కానీ realme 16 5G కేవలం 183 గ్రాముల బరువు, 8.1mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. దీనిలోని 60W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం ఈ బ్యాటరీ 6 ఏళ్ల పాటు ఆరోగ్యకరంగా పనిచేస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిశ్చింతగా ఉండటమే కాకుండా, ఫోన్ లైఫ్ కూడా పెరుగుతుంది.
కెమెరా విషయానికి వస్తే, ఇందులో 50MP రియర్, 50MP ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. సోషల్ మీడియా వాడే యువత కోసం ప్రత్యేకంగా రియర్ కెమెరా మాడ్యూల్ వద్ద 'సెల్ఫీ మిర్రర్' ఏర్పాటు చేశారు. దీనివల్ల వెనుక ఉన్న మెయిన్ కెమెరాతోనే మీ ఫ్రేమింగ్‌ను చూసుకుంటూ హై-క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవచ్చు. లూమా కలర్ ఇమేజింగ్ టెక్నాలజీ వల్ల ఫోటోలు సహజమైన రంగులతో, స్కిన్ టోన్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. అదనంగా ఉన్న ఆరా ఫ్లాష్ తక్కువ వెలుతురులో కూడా ముఖం స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.
ఫోన్ పనితీరు విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 టర్బో చిప్‌సెట్ వాడారు. ఇది రోజువారీ యాప్స్, మల్టీ టాస్కింగ్, గేమింగ్‌ను చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తుంది. 6.57 అంగుళాల AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే డిస్ప్లే రక్షణ కోసం డ్రాగన్‌ట్రైల్ స్టార్ డి+ గ్లాస్‌ను వాడటం వల్ల ఫోన్ ధృడంగా ఉంటుంది.
డిజైన్ పరంగా 'గ్లీమింగ్ వింగ్స్' కాన్సెప్ట్‌తో ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. వెలుతురు పడినప్పుడు రంగులు మారే విధానం యూత్‌ను బాగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, ఈ ఫోన్‌కు IP69 రేటింగ్ ఉంది, అంటే ఇది ధూళి, నీటి నుంచి గరిష్ట రక్షణను అందిస్తుంది. అనుకోకుండా ఫోన్ నీటిలో పడినా లేదా వర్షంలో తడిసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగా ఈ ధరకు లభించే ఫోన్లలో ఇలాంటి అత్యున్నత రక్షణ ఫీచర్లు ఉండటం చాలా అరుదు.
మొత్తానికి చూస్తే, రూ.31,999 ప్రారంభ ధరతో లభిస్తున్న realme 16 5G తన సెగ్మెంట్‌లో ఒక కిల్లర్ డీల్ అని చెప్పవచ్చు. భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లే, స్టైలిష్ డిజైన్, సెల్ఫీ ప్రియుల కోసం ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. మీకు రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తూ, చేతిలో పట్టుకుంటే ప్రీమియం అనుభూతిని ఇచ్చే ఫోన్ కావాలంటే ఇది ఖచ్చితంగా సరైన ఎంపిక. 2026 మార్కెట్ పరిస్థితుల్లో అన్ని ఫీచర్లను బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటుంది అనడంలో సందేహం లేదు.
ప్రకటన