Photo Credit: Alcatel
అల్కాటెల్ స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో తయారు చేయబడతాయి
మన దేశీయ మార్కెట్‌లోకి మళ్లీ సరికొత్తగా ఆల్కాటెక్ V3 అల్ట్రా మోడల్‌తో కంపెనీ దాదాపు మూడేళ్ల అనంతరం మళ్లీ కొత్త డివైస్‌తో అడుగుపెట్టింది. దీనికి ట్రిపుల్ రియల్ కెమెరా యూనిట్‌తో రూపొందించినట్లు కంపెనీ ఫౌండర్ హైటెక్ మాధవ్ శేత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన రిటైల్ బాక్స్ ఫోటోతో ద్వారా కనిపిస్తోంది. అంతే కాదు, దీని డిజైన్‌తోపాటు డివైస్ పేరు కూడా ఈ ఇమేజ్‌తో ధృవీకరించినట్లు అయ్యింది. అలాగే, రాబోయే ఆల్కాటెక్ V3 అల్ట్రాలో స్టైలస్ కూడా ఉండనున్నట్లు రిటైల్ బాక్స్‌ల ద్వారా స్పష్టమైంది.స్టైలస్ ఇమేజ్‌ను కూడా,X వేదికగా రాబోయే ఆల్కాటెక్ V3 అల్ట్రా రిటైల్ బాక్స్‌ను ఆల్కాటెక్ ఇండియా ఫౌండర్ అండ్ టెక్నికల్ అడ్వైజర్ అయిన మాధవ్ శేత్ అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ మోడల్‌పై మార్కెట్ వర్గాలలో పెద్దఎత్తున చర్చ మొదలైంది. ఈ ఇమేజ్‌లో రిటైల్ బాక్స్ బ్లాక్ షేడ్‌పై ఎల్లో కలర్ లెటరింగ్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అలాగే, ఈ బాక్స్ మీద స్టైలస్ ఇమేజ్‌ను కూడా చూడొచ్చు. అంతే కాదు, ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను అందిస్తున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాదు, దీని కెమెరా సెన్సార్ లు ఎల్ఈడీ ష్లాష్‌తో రూపొందించబడి ఉన్నాయి.
ఆల్కాటెక్ V3 అల్ట్రా మోడల్‌కు సంబంధించి షేర్ చేసిన ఇమేజ్‌లో కుడివైపున బ్లూ కలర్ రిటైల్ బాక్స్ కనిపిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో కెమెరాను కేంద్రంగా చేసుకుని, హోల్ పంచ్ కటౌట్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లే అమర్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఫోన్ మన దేశీయ మార్కెట్‌లోకి మాత్రం అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, దీనికి సంబంధించిన అధికారిక లాంఛ్ తేదీతోపాటు స్పెసిఫికేసన్స్ వంటి కీలక విషయాలను మాత్రం కంపెనీ ఇంత వరకూ బహిర్గతం చేయలేదు.
మన ఇండియా మొబైల్ మార్కెట్‌లోకి ఆల్కాటెక్ ఏప్రిల్ మొదటి వారంలోనే మళ్లీ అడుగుపెడుతున్న విషయం నిర్ధారించబడింది. భారత్‌లోని స్మార్ట్ ఫోన్‌ల విభాగంలోని వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది టీసీఎల్ కమ్యూనికేషన్ ద్వారా స్వతంత్రంగా రన్ అవుతోన్న ఈ బ్రాండ్. అంతే కాదు, రాబోయే ఆల్కాటెక్ హ్యాండ్‌సెట్‌ల విక్రయానికి ఫ్లిప్‌కార్ట్ ప్రధాన ఫ్లాట్‌ఫాంగా కంపెనీ ఎంపిక చేసింది. అలాగే, డిలవరీ సర్వీస్ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా అందించనుంది.
ఈ సంస్థ తమ వెబ్ సైట్‌లో స్పెషల్ ల్యాండింగ్ పేజీతో ఈ- కామర్స్ ద్వారా రాబోయే కొత్త మోడల్స్ లాంఛ్‌ను పకటిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్‌లో NXTPAPER డిస్‌ప్లేతో కొత్త ఆల్కాటెక్ V3 అల్ట్రా రానున్నట్లు కూడా ఇప్పటికే ప్రచారంలో ఉంది. అలాగే, మేక్ ఇన్ ఇండియా ఇంటివేషన్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి మన దేశంలోనే ఉన్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా కస్టమర్ సపోర్ట్ సర్వీస్ నెట్‌వర్క్‌ను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన