Photo Credit: Vivo
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ Vivo తన Vivo T3 Pro 5Gని దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తూ.. 12GB వరకు RAMతో రూపొందించబడింది. దీనికి 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తోపాటు 5,500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. ఈ హ్యాండ్‌సెట్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ లాంచ్‌తో ఇప్పటికే మన దేశంలో అందుబాటులో ఉన్న Vivo T3 5G సిరీస్‌లో కొత్తగా చేరినట్లయింది. ఈ సిరీస్‌లో Vivo T3 5G, Vivo T3 లైట్ 5G, Vivo T3x 5G మోడల్స్ ఉన్న విషయం తెలిసిందే. మరెందుకు ఆలస్యం.. Vivo T3 Pro 5G ధరతోపాటు సరికొత్త ఫీచర్స్ చూసేద్దామా?!
ఇక మనదేశంలో Vivo T3 Pro 5G ప్రారంభ ధర 8GB + 128GB వేరియంట్ అయితే రూ. 24,999, అలాగే 8GB + 256GB వేరియంట్ అయితే రూ. 26,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ మోడల్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా వెబ్‌సైట్ ద్వారా సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12 గంటల నుండి దేశీయ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, సాండ్‌స్టోన్ ఆరెంజ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో బ్యాక్ లెదర్ ఎండ్, మెటాలిక్ ఫ్రేంతో రానుంది.
Vivo T3 Pro 5G 6.77-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,392 పిక్సెల్స్) 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో 8GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజీతో రూపొందించబడింది. ఇది Android 14-ఆధారిత Funtouch OS 14తో రన్ చేయబడుతుంది. గతంలో వచ్చిన మోడల్స్‌తో పోల్చుకుంటే ఈ స్పెసిఫికేషన్స్ కాస్త అప్‌డేట్‌గా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
కెమెరా విభాగం గురించి చూస్తే..
Vivo T3 Pro 5G కెమెరా విభాగం విషయానికి వస్తే.. దీనికి డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను అందించారు. ఇందులో 50-మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇంకా.. సెల్ఫీలు, నాణ్యమైన వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే, డ్యుయల్ స్టీరియో స్పీకర్లతోపాటు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తూ.. Vivo T3 Pro 5Gలో 5,500mAh బ్యాటరీని అందించారు.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS అలాగే, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. దుమ్ము మరియు స్ప్లాష్ నిరోధించేందుకు IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ శాండ్‌స్టోన్ ఆరెంజ్ అయితే 163.72 x 75.0 x 7.99 మిమీ పరిమాణంలో 190 గ్రాముల బరువు అలాగే, ఎమరాల్డ్ గ్రీన్ వేరియంట్ 7.49 మిమీ పరిమాణంతో 184 గ్రాముల బరువు ఉంటుంది. మరి మీ ఎంపిక ఏమనుకుంటున్నా.. సెప్టెంబర్ 3వ తేదీన ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో అడుగుపెడుతోన్న Vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను మాత్రం అస్సలు మిస్సవ్వొద్దు.
ప్రకటన
ప్రకటన