వివో T4 అల్ట్రా త్వరలో విడుదల.. ఆకట్టుకుంటున్న కెమెరా ఫీచర్లు

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన కొత్త ఫోన్ T4 అల్ట్రాను జూన్ మొదటి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. ఈ ఫోన్ శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్, pOLED డిస్‌ప్లే వంటి మరెన్నో అత్యాధునిక ఫీచర్లతో రానుంది.

వివో T4 అల్ట్రా త్వరలో విడుదల.. ఆకట్టుకుంటున్న కెమెరా ఫీచర్లు

Photo Credit: Vivo

వివో తన T సిరీస్‌లో తదుపరి స్మార్ట్‌ఫోన్ T4 అల్ట్రా లాంచ్‌ను ప్రారంభించింది

ముఖ్యాంశాలు
  • ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌తో లభించుతుంది
  • ఈ ఫోన్‌ pOLED డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి రానుంది
  • ట్రిపుల్ కెమెరా సెటప్‌, 50MP సోనీ IMX921 ప్రధాన కెమెరా
ప్రకటన

ప్రముఖ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మరో మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు టీజర్‌ను విడుదల చేసింది. వివో T4 అల్ట్రా పేరుతో భారత్‌లో విడుదల చేయనుంది. ఇది గతేడాది విడుదలైన T3 అల్ట్రాకు అప్‌గ్రేడ్ వెర్షన్.వివో T4 అల్ట్రా స్పెసిఫికేషన్స్,ఈ గ్యాడ్జెట్‌లో ఫ్లాగ్‌షిప్ రెంజ్‌లో జూమ్ ఫీచర్‌ను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివో విడుదల చేసిన టీజర్ ప్రకారం T4 అల్ట్రా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇది 100X జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది.గతేడాది విడుదలైన T3 అల్ట్రా మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఉన్నప్పటికీ, కెమెరా పరంగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే ఉండేది. అయితే ఈసారి వివో T4 Ultra విషయంలో కెమెరా సామర్థ్యాన్ని పెంచారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఇది 6.67 అంగుళాల pOLED డిస్‌ప్లేతో వస్తున్నట్లు టాక్. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌ కలిగి ఉండనుందని సమాచారం. T4 Ultra మోడల్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటి 9300 ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలిసింది.

శక్తివంతమైన కెమెరా

ఇక కెమెరా విషయానికొస్తే.. 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా ఉండనుంది. దీనికి సపోర్ట్‌గా 50MP పెరిస్కోప్ జూమ్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ Android 15-ఆధారిత Funtouch OS 15పై నడుస్తుంది.

ఈ మోడల్‌ బ్యాటరీ వివరాలు తెలియనప్పటికీ 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్నట్లు తెలిసింది. అయితే సెల్ఫీ కెమెరా, బ్యాటరీ కెపాసిటీ వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ ఫోన్ జూన్ మొదటి వారంలో భారతదేశంలో విడుదల కానుందని టాక్.

ఇక్కడ కొనొచ్చు

వివో T4 అల్ట్రా విడుదలైన తర్వాత.. ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌ లైన్ స్టోర్‌లలో ఇది అందుబాటులోకి రానుంది. దీని కోసం ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ల్యాండింగ్ పేజ్ను క్రియేట్ చేశారు. లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ AI- ఆధారిత ఫీచర్లను కలిగి ఉంటుంది. వివో తన T సిరీస్‌లో కెమెరా, పెర్ఫార్మెన్స్ పరంగా అప్‌గ్రేడ్ చేయడంతో వినియోగదారులకు కొత్త అనుభూతిని అందివ్వనుంది.

వివో T4 అల్ట్రా ధర (అంచనా):

'వివో T3 అల్ట్రా' స్మార్ట్ఫోన్ను గతేడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో విడుదలైంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 8GB RAM + 128GB మోడల్ ధర రూ. 31,999 ఉంది. అయితే దీనికి మించి అప్గ్రేడెడ్ ఫీచర్లతో వస్తున్న వివో T4 అల్ట్రా ఎక్కువ ధరలో లాంచ్ కావొచ్చని సమాచారం.

T4 Ultra తన ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మిడ్‌రేంజ్ మార్కెట్‌లో ఏలాంటి పోటీ ఇవ్వనుందో వేచి చూడాల్సి ఉంది.

Comments

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »