వివో ఎక్స్500 ప్రో మాక్స్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో SoC మరియు 7,000mAh బ్యాటరీతో పనిచేస్తుందని ఒక పాత నివేదిక వెల్లడించింది
Photo Credit: Vivo
ఇటీవలే చైనాలో విడుదలైన Vivo X300 Ultra
వివో మొబైల్ కంపెనీ వివో X500 సిరీస్‌తో తన ఫ్లాగ్‌షిప్ లైనప్‌ను ఈ ఏడాది చివర్లో విస్తరించనుంది. ఇటీవల విడుదలైన లీకుల ఆధారంగా చూస్తే.. డిస్‌ప్లే సైజు ఆప్షన్లు, కెమెరా వివరాలు ఉండనున్నాయని తెలుస్తుంది. ఈ కొత్త లైనప్, అక్టోబర్ 2025లో చైనాలో విడుదలైన వివో X300 మరియు X300 ప్రోల తర్వాత రానుంది. ఇక X300 అల్ట్రా మార్చి 2026లో రానుంది. రాబోయే తరం ఫోన్లలో పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, మరియు డిస్‌ప్లే టెక్నాలజీలో అప్‌గ్రేడ్‌లు ఉంటాయని ఇదివరకు రికార్డయిన నివేదికలు సూచించాయి.
టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు అనే ఒక వీబో పోస్ట్ (చైనీస్ నుండి అనువదించబడింది) ఆధారంగా చూస్తే.. రాబోయే వివో X500 లైనప్ రెండు వేర్వేరు డిస్‌ప్లే సైజుల్లో రావచ్చని తెలుస్తుంది. ఈ వేరియంట్లలో 6.4-అంగుళాలు, 6.9-అంగుళాల ప్యానెల్‌లు ఉంటాయి. టాప్-ఎండ్ వేరియంట్, బహుశా వివో ఎక్స్500 ప్రో మాక్స్, LOFIC (Lateral Overflow Integration Capacitor) టెక్నాలజీని ఉపయోగించే 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పరీక్షించబడుతున్నట్లు సమాచారం.
బ్రైట్ సీన్స్ దృశ్యాలలో అదనపు ఛార్జ్‌ను మేనేజ్ చేయటానికి, ఓవర్‌ఫ్లో ఎలక్ట్రాన్‌లను ఒక ప్రత్యేక కెపాసిటర్‌లోకి మళ్లించటానికి ఈ సెన్సార్ డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ డిజైన్ వలన డైనమిక్ రేంజ్‌ను మరింత పెంచి.. ఓవర్‌ఎక్స్‌పోజర్‌ను తగ్గిస్తుంది.
అంచనా ప్రకారం.. వివో ఎక్స్500 ప్రో మాక్స్‌లో 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుందని.. ఇది లాంగ్-రేంజ్ జూమ్ సామర్థ్యం కలిగి ఉండనుందని సమాచారం. దీంతోపాటుగా కలర్ రిప్రొడక్షన్ మరియు వైట్ బ్యాలెన్స్ మరింత మెరుగుపరచడానికి వివో మల్టీస్పెక్ట్రల్ సెన్సార్ వాడకాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారం లీక్స్ లో లేనప్పటికీ.. ఈ సెటప్ లో కెమెరా సిస్టమ్‌లో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ కూడా ఉండవచ్చు.
వివో ఎక్స్500 ప్రో మాక్స్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో SoC మరియు 7,000mAh బ్యాటరీతో పనిచేస్తుందని ఒక పాత నివేదిక వెల్లడించింది. ఇందులో 144Hz వరకు రిఫ్రెష్ రేట్ గల 2K LTPO ఫ్లాట్ ప్యానెల్, అలాగే బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉండవచ్చు.
Vivo X500 సీరీస్ లో.. స్టాండర్డ్, ప్రో వేరియంట్‌లతో పాటుగా.. ప్రో మాక్స్ కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో చైనాలో విడుదల కావచ్చు. దీంతో పాటుగా.. Xiaomi నుండి రాబోయే ఫ్లాగ్‌షిప్ లైనప్ కూడా.. అనగా Xiaomi 18 సిరీస్ కూడా ఇదే సమయానికి దేశంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Elle OTT Release Date: When and Where to Watch it Online?
Love Mocktail 3 Now Available to Stream on Zee 5: All You Need to Know About Cast, Plot, and More
Adivi Sesh and Mrunal Thakur’s Dacoit Now Streaming Online: What You Need to Know
House Of The Dragon Season 3 OTT Release Date Confirmed: When and Where to Watch it Online?