Photo Credit: Vivo
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారత్‌లో Vivo Y300 5G స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ తేదీని ధృవీకరించింది. రాబోయే ఈ Y సిరీస్ ఫోన్ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాతోపాటు దాని అధికారిక వెబ్‌సైట్ పేజీ ద్వారా షేర్ చేసింది. Vivo Y300 హ్యాండ్‌సెట్ మూడు ఆకర్షణీయమైన రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని చెబుతోంది. అలాగే, Y300లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అలాగే, గతేడాది విడుదలైన Vivo Y200కి కొనసాగింపుగా ఇది వస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ సెప్టెంబర్ నెలలో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేసిన Vivo V40 Liteకు రీబ్రాండ్ కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Vivo India తన X ద్వారా నవంబర్ 21న Vivo Y300 5Gని మనదేశంలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పోస్ట్ ప్రకారం.. లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. Vivo Y300 స్మార్ట్‌ఫోన్ ఆకుపచ్చ, నలుపు, సిల్వర్ షేడ్స్ రంగులలో ఉన్నట్లు టీజ్‌లో చూడొచ్చు. Vivo తన వెబ్‌సైట్‌లో Vivo Y300 5G కోసం ప్రత్యేకమైన ల్యాండింగ్ పేజీని పరిచయం చేసింది. ఇది డిజైన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అందిస్తుంది. దీని ద్వారా మొబైల్‌కు వెనుకవైపున నిలువుగా ఉండే డ్యూయల్ కెమెరా సెటప్‌ను చూడొచ్చు. కెమెరా సెన్సార్ల అమరిక, LED ఫ్లాష్‌లను చూస్తే.. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇండోనేషియాలో విడుదలైన Vivo V40 లైట్‌ని పోలి ఉన్నట్లు కనిపిస్తుంది. Vivo Y300 5G టీజ్డ్ షేడ్స్ కూడా Vivo V40 Lite 5G డైనమిక్ బ్లాక్, టైటానియం సిల్వర్ కలర్‌వేలను పోలి ఉన్నాయి.
ఇండోనేషియాలో Vivo V40 Lite 5G స్మార్ట్ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ప్రారంభ ధర IDR 4,299,000 (దాదాపు రూ. 23,700)గా అందుబాటులో ఉంది. ఇది గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌తో 12GB వరకు LPDDR4X RAMతో అటాచ్ చేయబడి ఉంది. అంతేకాదు, UFS2 GB వరకు బోర్డ్ స్టోరేజ్‌ని అందించారు.
ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. Vivo V40 Lite 5G స్మార్ట్‌ఫోన్‌కు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించడంతో పాటు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వస్తోంది. వచ్చే వారం Vivo Y300 5G హ్యాండ్‌సెట్ భారతదేశంలో అధికారికంగా విడుదల అయినప్పుడు కూడా ఈ ఖచ్చితమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన