ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ Vivo తన సంస్థ నుంచి Y58 5G మొబైల్‌ను మన దేశంలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ద్వారా ద్వారా శక్తిని పొందుతుంది. అలాగే, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ సమార్థ్యంతో విడుదలైంది. ఇది 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనితోపాటు దుమ్ము ధూళిని నిరోదించేలా IP64-రేటెడ్ బిల్డ్‌తో అమర్చబడింది. ఈ హ్యాండ్‌సెట్ దేశంలోని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సింగల్ RAM మరియు స్టోరేజ్ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. తాజాగా Vivo ఈ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ మోడల్ మొబైల్ ప్రత్యేకతలు ఏంటో చూసేద్దామా?!
దేశీయ మార్కెట్‌లో Vivo Y58 5G ఇప్పుడు 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,499గా నిర్ణయించినట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఇది ఫ్లిప్‌కార్ట్, Vivo ఇండియా ఇ-స్టోర్‌తోపాటు దేశవ్యాప్తంగా భాగస్వామ్య రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది జూన్‌లో ఈ మోడల్‌ను లాంచ్ చేసినప్పుడు Vivo Y58 5G సింగల్ 8GB RAM + 128GB కాన్ఫిగరేషన్‌తో ధర రూ. 19,499గా ఉంది. ఆ ఫోన్ హిమాలయన్ బ్లూ మరియు సుందర్‌బన్స్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందించబడుతోంది. అయితే, తాజాగా తగ్గించిన ధర విషయమై మార్కెట్‌లో మంచి స్పందన వస్తుందని మార్కెట్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ఈ మోడల్‌కు ఇచ్చిన ఫీచర్స్ ఆ విషయాన్ని దృవీకరిస్తాయని అభిప్రాయపడుతున్నాయి.
1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు..
ఇక Vivo Y58 5G స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.72-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,408 పిక్సెల్స్) 2.5D LCD స్క్రీన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. అలాగే, TUV రీన్‌ల్యాండ్‌లో బ్లూ లైట్ ఐ కేర్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. ఇది 8GB LPDDR4X RAM మరియు 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జత చేయబడిన 4nm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ద్వారా శక్తిని అందించబడుతుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్ Android 14-ఆధారిత Funtouch OS 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. అలాగే, ఫోన్ విషయంలోనూ ప్రత్యేక ఫీచర్స్‌ను అందించారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఈ మోడల్ ఫోన్‌కు అందించారు. నాలుగేళ్ల వరకూ బ్యాటరీ లైఫ్ హామీ
అలాగే, కెమెరా విషయానికి వస్తే.. Vivo Y58 5G డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో పాటు LED ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. అందమైన సెల్ఫీలకు మరియు వీడియో కాల్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. దీంతోపాటు 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌తో 6000 mAh సామర్థ్యం ఉన్న గల బ్యాటరీ దీని ప్రత్యేకత. అలాగే, కొనుగోలుదారులకు అదిరిపోయే ప్రటనను విడుదల చేసింది. మొబైల్ తీసుకున్న నాలుగేళ్ల వరకకూ బ్యాటరీ లైఫ్ హామీ ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫోన్ పరిమాణం చూస్తే 1657 x 76 x 7.99mm కొలతతో 199 గ్రాముల బరువు ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా Vivo అభిమానులైతే.. తగ్గింపు ధరతో వస్తోన్న Vivo Y58 5G మోడల్‌ను వెంటనే సొంతం చేసుకోండి!