కెమెరా విభాగంలో కూడా షావోమీ 16 హైలైట్ అవుతుంది. వెనుక వైపు 50MP ఓమ్ని విజన్ ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, అలాగే 50MP శాంసంగ్ ఐసో సెల్ JN5 టెలిఫోటో సెన్సార్ కలిపి ట్రిపుల్ కెమెరా సెట్‌అప్ ఇచ్చే అవకాశం ఉంది.
Photo Credit: Xiaomi
Xiaomi 16 Xiaomi 15 (చిత్రంలో) తర్వాత వస్తుందని భావిస్తున్నారు
గత కొన్ని నెలలుగా షావోమీ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్ 2024లో విడుదలైన షావోమీ 15 తరువాత, ఈసారి షావోమీ 16 సిరీస్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. తాజాగా లీక్ అయిన వివరాల ప్రకారం, చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం సెప్టెంబర్ చివరి వారంలోనే ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురావచ్చని తెలుస్తోంది.షావోమీ 16 ముఖ్య ఫీచర్లు (లీక్‌డ్),ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల 1.5K LTPO OLED డిస్‌ప్లే ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేయనుందని చెబుతున్నారు. ప్రాసెసర్ విషయానికి వస్తే, Snapdragon 8 Elite 2 లేదా Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌తో రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. ఇది నిజమైతే, ఈ కొత్త సిరీస్ మార్కెట్‌లో తొలిసారిగా ఈ చిప్‌సెట్‌తో వచ్చే స్మార్ట్‌ఫోన్లలో ఒకటిగా నిలుస్తుంది.
కెమెరా విభాగంలో కూడా షావోమీ 16 హైలైట్ అవుతుంది. వెనుక వైపు 50MP ఓమ్ని విజన్ ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, అలాగే 50MP శాంసంగ్ ఐసో సెల్ JN5 టెలిఫోటో సెన్సార్ కలిపి ట్రిపుల్ కెమెరా సెట్‌అప్ ఇచ్చే అవకాశం ఉంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉండనుందని సమాచారం. ఫోన్ HyperOS 3తో రానుంది. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని షావోమీ అందించే అవకాశం ఉంది.
ఈ ఫోన్ డస్ట్ మరియు వాటర్ లో పడిన ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు షావోమీ 16కి IP68 లేదా IP69 రేటింగ్ ఉండవచ్చని లీక్‌ల ద్వారా తెలిసింది. పవర్ సెక్షన్‌లో 7,000mAh భారీ బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్లో ఎక్కువసేపు వీడియో చూసిన, గేమింగ్ ఆడినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.
తాజా రిపోర్ట్‌ల ప్రకారం షావోమీ 16 సెప్టెంబర్ 24 నుండి 26 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశముంది. ఇది నిజమైతే, గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన షావోమీ 15 కంటే ఈసారి కొంచెం ముందుగానే కొత్త సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు అవుతోంది. ఈ సిరీస్‌లో షావోమీ 16, షావోమీ 16 ప్రోతో పాటు, కొత్తగా షావోమీ 16 ప్రో మినీ అనే కాంపాక్ట్ వెర్షన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫోన్ లాంచింగ్ కోసం షావోమి అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉందని టెక్నాలజీ పండితులు అంచనా వేస్తున్నారు.
ప్రకటన
ప్రకటన