వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నుండి అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన 'జుటోపియా 2' ఎట్టకేలకు డిజిటల్ తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.
Photo Credit: JioHotstar
జియో హాట్‌స్టార్‌లో జూటోపియా 2
వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ నుండి అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూసిన 'జుటోపియా 2' ఎట్టకేలకు డిజిటల్ తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత, ఇప్పుడు అధికారిక జెడ్.పి.డి భాగస్వాములుగా జుడీ హాప్స్, నిక్ వైల్డ్ ఒక సరికొత్త ఇన్వెస్టిగేషన్ తో మన ముందుకు వచ్చారు. ఈ సీక్వెల్ కేవలం ఒక సాధారణ యానిమేటెడ్ చిత్రం మాత్రమే కాకుండా, నేటి తరం మెచ్చే క్రైమ్ కామెడీ, డ్రామా అంశాలతో నిండి ఉంది. నగరంలో జరుగుతున్న ఒక స్మగ్లింగ్ రింగ్ ను ఛేదించే క్రమంలో మన హీరోలు ఎదుర్కొనే సవాళ్లు, ఆ క్రమంలో బయటపడే నమ్మలేని నిజాలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
కథలోకి వెళ్తే, ఒక చిన్న స్మగ్లింగ్ ముఠాను పట్టుకోవడానికి బయలుదేరిన జుడీ, నిక్, అనూహ్యంగా ఒక భారీ కుట్రలో చిక్కుకుంటారు. ఒక ప్రభావవంతమైన కుటుంబం నడిపిస్తున్న ఈ అండర్ గ్రౌండ్ మాఫియా వెనుక ఉన్న అసలు రహస్యాలను ఛేదించడమే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ క్రమంలో జుటోపియా నగరంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు, ముఖ్యంగా రెప్టైల్ జనాభా బహిష్కరణ వెనుక ఉన్న గూఢచారి కోణాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అవినీతి, స్మగ్లింగ్ వంటి సీరియస్ అంశాలను కూడా దర్శకులు చాలా హాస్యాస్పదంగా, సాహసోపేతమైన సన్నివేశాలతో మేళవించి అందించడంలో సఫలీకృతులయ్యారు.
ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్ ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉండటం విశేషం. దీనివల్ల మన స్థానిక ప్రేక్షకులకు సినిమాలోని జోకులు , భావోద్వేగాలు మరింత లోతుగా అర్థమవుతున్నాయి. మీరు ఈ అడ్వెంచర్ ను వీక్షించాలనుకుంటే యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ ఉండటం తప్పనిసరి. ఈ తరం యూత్ కు కావాల్సిన ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే,విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి, కాబట్టి ఇంట్లోనే కూర్చుని ఈ వీకెండ్ లో చక్కటి ఎంటర్టైన్మెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు.
దర్శకులు జారెడ్ బుష్, బైరాన్ హోవార్డ్ ఈ కథను చాలా గ్రిప్పింగ్‌గా మలిచారు. ముఖ్యంగా లింక్స్లీ కుటుంబం నగరంలోని క్లైమేట్ కంట్రోలింగ్ వెదర్ వాల్స్ పేటెంట్‌ను దొంగిలించిన తీరు, దానివల్ల నగరం ఎదుర్కొనే ముప్పు వంటి పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. జుడీ, నిక్ ల మధ్య ఉండే కెమిస్ట్రీ, వారి ఆన్-డ్యూటీ కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పాలి. కేవలం పిల్లల కోసమే కాకుండా, పెద్దలు కూడా ఆలోచించే విధంగా నేటి సమాజంలోని లోపాలను అంతర్లీనంగా ఈ సినిమాలో చర్చించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం.
సాంకేతిక పరంగా ఈ సినిమా అద్భుతమనే చెప్పాలి. గిన్నిఫర్ గుడ్విన్, జేసన్ బేట్మాన్ తమ వాయిస్ ఓవర్లతో జుడీ, నిక్ పాత్రలకు ప్రాణం పోశారు. అలాగే కీ హుయ్ క్వాన్, ఇద్రిస్ ఎల్బా వంటి స్టార్స్ చేరిక ఈ సీక్వెల్ కు మరింత బలాన్ని ఇచ్చింది. మైఖేల్ గియాచినో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయగా, టైలర్ కుప్ఫెరర్, డేనియల్ రైస్ ల సినిమాటోగ్రఫీ జుటోపియా నగరాన్ని మరింత రంగులమయంగా చూపించాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ యానిమేషన్ క్వాలిటీ, డిటెయిలింగ్ మనకు ప్రపంచ స్థాయి అనుభూతిని కలిగిస్తాయి.
నవంబర్ 2025లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి డిస్నీ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది. ఐఎండిబి రేటింగ్ 7.4 సాధించి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. జుటోపియా ప్రపంచాన్ని ఇష్టపడే వారికి ఈ రెండో భాగం ఒక విందు లాంటిది. పాత పాత్రలతో పాటు కొత్తగా పరిచయమైన విలన్లు, వారి ఎత్తుగడలు సినిమాను ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. మీరు ఒక మంచి థ్రిల్లర్, కామెడీ సినిమా చూడాలనుకుంటే మాత్రం జుటోపియా 2 మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
ప్రకటన
ప్రకటన