ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) పరిశోధకులు సమిష్టి కృషిలో ఖగోళ వస్తువుల నుండి వెలువడే రేడియేషన్ సిద్ధాంతాలను సవాలు చేసే ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. స్విఫ్ట్ J0243.6+6124 ద్వారా విడుదలైన X-కిరణాలు మొదటగా వెలువడిన గెలాక్సీ అల్ట్రాల్యూమినస్ ఎక్స్-రే పల్సర్ ఊహించని విధంగా తక్కువ స్థాయి ధ్రువణతను ప్రదర్శిస్తాయని కనుగొన్నారు. మన గెలాక్సీలో ఉన్న ఈ పల్సర్, దాని X- కిరణాలలో కేవలం 3 శాతం ధ్రువణాన్ని మాత్రమే చూపిస్తుంది. ఇది ప్రస్తుత సిద్ధాంతాల ప్రకారం అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ అని నిర్థారణ అయింది.
స్విఫ్ట్ J0243.6+6124 NASA యొక్క స్విఫ్ట్ అంతరిక్ష నౌక ద్వారా 2017-2018లో ఒక పెద్ద ఎక్స్-రే అలజడి సమయంలో మొదటిసారిగా గుర్తించబడింది. అల్ట్రాల్యూమినస్ ఎక్స్-రే మూలాల (ULXs) స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది ఒక ముఖ్యమైన అధ్యయన అంశంగా మారింది. ULXలు సాధారణంగా ఇంటర్మీడియట్-మాస్ బ్లాక్ హోల్స్‌తో సంబంధం కలిగి ఉంటాయి. అయితే కొన్ని, స్విఫ్ట్ J0243.6+6124 వంటివి పల్సర్‌లుగా భావిస్తారు. పల్సర్‌లు ఒక రకమైన న్యూట్రాన్ నక్షత్రంగా గుర్తించబడినవి. ఇవి సొంత గురుత్వాకర్షణ ఆధారంతో కూలిపోయిన భారీ నక్షత్రాల అవశేషాలు. ఈ ఖగోళ వస్తువులు దట్టంగా విస్తరించి, సూర్యునితో సమానమైన ద్రవ్యరాశితో ఉంటాయి. ఇవి ఒక్కొక్కటీ దాదాపుగా ఒక నగరం పరిమాణంలో ఉంటాయి.
న్యూట్రాన్ స్టార్ ఇంటీరియర్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ (NICER) మరియు న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోపిక్ టెలిస్కోప్ అర్రే (NuSTAR) మిషన్‌లతో పాటు NASA యొక్క ఇమేజింగ్ ఎక్స్-రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ (IXPE) నుండి డేటాను ఉపయోగించి, పరిశోధకులు స్విఫ్ట్ J0243 నుండి X-కిరణాల ధ్రువణాన్ని 2023లో దాని క్రియాశీల దశలో 6+6124 అధ్యయనం చేశారు. ఎక్స్-కిరణాలు కేవలం 3 శాతం వద్ద మాత్రమే ధ్రువపరచబడిందని, ఇది ఇప్పటికే అంచనా వేసిన స్థాయిల కంటే చాలా తక్కువగా ఉందని పరిశోధనలు వెల్లడించాయి. ఈ ఆవిష్కరణ బైనరీ సిస్టమ్‌లలో న్యూట్రాన్ నక్షత్రాల చుట్టూ ఉన్న బలమైన అయస్కాంత క్షేత్రాలతో పరస్పర చర్య చేసినప్పుడు ఎక్స్-కిరణాలు ఎలా ప్రవర్తిస్తాయనే దాని గురించి దీర్ఘకాలంగా ఉన్న ఊహలను సవాలు చేస్తోంది.
స్విఫ్ట్ J0243.6+6124లో గమనించిన తక్కువ ధ్రువణత న్యూట్రాన్ నక్షత్రాల రేడియేషన్ ప్రవర్తనపై ప్రస్తుత సిద్ధాంతాల పునః మూల్యాంకనానికి దారితీయవచ్చని ISRO శాస్త్రవేత్త డాక్టర్ అనుజ్ నంది ఈ పరిశోధనల ప్రాముఖ్యతను వెల్లడించారు. డాక్టర్ నంది అభిప్రాయం ప్రకారం.. IXPE మిషన్ యొక్క సామర్థ్యాలు ఈ తక్కువ ధ్రువణ స్థాయిలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయి. ఇవి విడుదలయిన X-రే పల్స్‌తో మారుతూ ఉంటాయని తెలిపారు. IIT గౌహతి ప్రొఫెసర్ శాంతబ్రత దాస్ మాటల ప్రకారం.. న్యూట్రాన్ నక్షత్రాల చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాలు, ఎక్స్-రే ఉద్గారాలను నియంత్రించే ప్రక్రియలపై మన అవగాహనను నవీకరించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే.. అక్కడ ఊహించని విధంగా తక్కువ ధ్రువణత సూచిస్తోందని ఆయన వివరించారు. ఇది మన గెలాక్సీలో మరియు వెలుపల ఉన్న సారూప్య ఎక్స్-రే మూలాలపై భవిష్యత్ పరిశోధనకు ఎంతో సహాయపడుతుందన్నారు.
లోతైన అవగాహనను..
IIT గౌహతి మరియు ISRO సంయుక్తంగా చేసిన X-రే పల్సర్‌ల పరిశోధనలు విశ్వ దృగ్విషయాలను అధ్యయనం చేయడానికి కొత్త మార్గాలను చూపుతుందని భావించవచ్చు. అలాగే, శాస్త్రవేత్తలు విశ్వం యొక్క రహస్యాలను అన్వేషించడం కొనసాగిస్తున్నందున, ఈ ఈ ఊహించని పరిశోధనా ఫలితాలు వారిని మరింత ప్రేరేపిస్తాయనడంలో సందేహం లేదు. అంతరిక్ష అధ్యయనంలో నిమగ్నమై ఉన్న ఎందరో శాస్త్రవేత్తలకు ఈ పరిశోధనలు లోతైన అవగాహనను కల్పిస్తాయని చెప్పొచ్చు.
ప్రకటన
ప్రకటన