Photo Credit: OnePlus
OnePlus 13, OnePlus 13R హ్యాండ్‌సెట్‌లు భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. తాజా ఈ OnePlus స్మార్ట్ ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తోపాటు 100W వరకు ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు మోడల్స్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ వెనుక కెమెరా యూనిట్లను కలిగి ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో OnePlus 13 చైనాలో లాంచ్ అయ్యింది. బ్రాండ్-న్యూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్ ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. OnePlus 13R ఫోన్ OnePlus Ace 5 గ్లోబల్ వెర్షన్‌గా కనిపిస్తోంది.
OnePlus 13 ప్రారంభ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 69,999గా నిర్ణయించారు. అలాగే, 16GB RAM + 512GB, 24GB + 1TB వేరియంట్‌ల ధర వరుసగా రూ. 76,999, రూ. 86,999గా ఉన్నాయి. ఇది ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్‌తోపాటు మిడ్‌నైట్ ఓషన్ షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. OnePlus 13R ఫోన్ 12GB+256GB వెర్షన్ ధర రూ. 42,999, 16GB+512GB మోడల్ ధర రూ. 49,999గా ఉన్నాయి. ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి.
డ్యూయల్-సిమ్ (నానో)తో OnePlus 13 Android 15-ఆధారిత ఆక్సిజన్OS 15.0పై రన్ అవుతోంది. అలాగే, 6.82-అంగుళాల క్వాడ్-HD+ (1,440x3,168 పిక్సెల్‌లు) LTPO 4.1 ProXDR డిస్‌ప్లేతో వస్తోంది. దీని డిస్‌ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్, సిరామిక్ గార్డ్ ప్రొటెక్షన్‌ను అందించారు. ఇది 1TB వరకు UFS 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజీని అందిస్తోంది. ఇది Hasselblad-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సోనీ IMX615 కెమెరాతోపాటు ఫోన్‌లో అలర్ట్ స్లైడర్‌ను అమర్చారు. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. అలాగే, నాయిస్ క్యాన్సిలేషన్, ORReality ఆడియో సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. 162.9x76.5x8.9mm పరిమాణంతో 213 గ్రాముల బరువు ఉంటుంది.
డ్యూయల్-సిమ్ (నానో)తో OnePlus 13R ఆండ్రాయిడ్ 15లో ఆక్సిజన్ OS 15.0తో రన్ అవుతుంది. 93.9 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 450ppi పిక్సెల్ టుడెన్సిటీ పిక్సెల్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ (1,264x2,780 పిక్సెల్‌లు) LTPO డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌తో వస్తుంది. ఇది అండర్ ది హుడ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో గరిష్టంగా 16GB RAM, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీతో అటాచ్ చేయబడింది. OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony LYT-700 1/1.56-అంగుళాల ప్రైమరీ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం దీనికి ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తోపాటు అలెర్ట్ స్లయిడర్‌తో వస్తుంది. 161.72x75.8x8.02mm పరిమాణంతో 206 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన