ఈవెంట్‌లో విడుదలైన ఉత్పత్తుల ప్రీ-ఆర్డర్లు నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది

2021లో అక్టోబర్ 18న జరిగిన ఫాల్ ఈవెంట్‌లో, ఆపిల్ M1 MacBook Pro, AirPods 3, అలాగే కొత్త HomePod mini రంగులను పరిచయం చేసింది. తదుపరి సంవత్సరం, 2022లో, కంపెనీ M2 iPad, 10వ తరం iPad, మరియు Apple TV 4K (3rd Gen)ను ఒక సాధారణ ప్రెస్ రిలీజ్ ద్వారా అక్టోబర్ 18ననే ప్రకటించింది

ఈవెంట్‌లో విడుదలైన ఉత్పత్తుల ప్రీ-ఆర్డర్లు నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది

Photo Credit: Apple

2023లో ఆపిల్ అక్టోబర్‌లో జరిగే లాంచ్ ఈవెంట్‌ను 'స్కేరీ ఫాస్ట్' అని పిలుస్తారు

ముఖ్యాంశాలు
  • అక్టోబర్లో జరగనున్న ఆపిల్ ఈవెంట్ 2025
  • కొత్త iPad Pro, AirTag 2 లాంచ్ అయ్యే అవకాశం
  • ప్రీ-ఆర్డర్లు నవంబర్ 7 నుంచి ప్రారంభం
ప్రకటన

ఇటీవల విడుదలైన iPhone 17 తర్వాత, ఇప్పుడు టెక్ ప్రపంచం దృష్టంతా Apple అక్టోబర్ ఈవెంట్‌పైనే నిలిచింది. ఈ నెల చివర్లో జరగనుందని భావిస్తున్న ఈ ఈవెంట్‌లో, కుపర్టినో ఆధారిత టెక్ దిగ్గజం తన కొత్త iPad Pro, స్మార్ట్ హోమ్ డివైజ్‌లు, అలాగే ఇతర గ్యాడ్జెట్లను పరిచయం చేసే అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా వెలువడిన లీక్‌ల ప్రకారం, M5 చిప్‌తో నడిచే iPad Pro, AirTag 2, మరియు అప్‌డేటెడ్ Vision Pro వంటి డివైజ్‌లు ఈ ఈవెంట్‌లో వెలుగులోకి వచ్చే అవకాశముంది. అయితే, Apple ఇప్పటివరకు ఈ ఈవెంట్ ఖచ్చితమైన తేదీపై నోరు విప్పలేదు. కానీ, గత సంవత్సరాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, ఈ నెలలోనే ఆపిల్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆపిల్ అక్టోబర్ ఈవెంట్:

2021లో అక్టోబర్ 18న జరిగిన ఫాల్ ఈవెంట్‌లో, ఆపిల్ M1 MacBook Pro, AirPods 3, అలాగే కొత్త HomePod mini రంగులను పరిచయం చేసింది.

తదుపరి సంవత్సరం, 2022లో, కంపెనీ M2 iPad, 10వ తరం iPad, మరియు Apple TV 4K (3rd Gen)ను ఒక సాధారణ ప్రెస్ రిలీజ్ ద్వారా అక్టోబర్ 18ననే ప్రకటించింది.2023లో మాత్రం మళ్లీ లైవ్ ఈవెంట్ రూపంలో “Scary Fast” పేరుతో అక్టోబర్ 30న ఆపిల్ ఈవెంట్ నిర్వహించి, M3 MacBook Pro మరియు iMacలను విడుదల చేసింది.

2024లో మాత్రం ఆపిల్ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించకుండా, M4 MacBook Pro, iMac, మరియు Mac miniలను చిన్న వీడియో పరిచయం ద్వారా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ప్యాటర్న్ చూస్తే, ఆపిల్ ప్రతి రెండో సంవత్సరం లైవ్ ఈవెంట్ రూపంలో ఉత్పత్తులను ప్రకటించే పద్ధతిని అనుసరిస్తోంది. అందువల్ల, 2025లో లైవ్ ఈవెంట్ ఉండే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి.

ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది:

ముందుగా ఆపిల్ అక్టోబర్ మధ్యలోనే తన ఉత్పత్తులను పరిచయం చేసేది. కానీ, గత రెండు సంవత్సరాలుగా కంపెనీ నెలాఖరులో విడుదల చేసే పద్ధతికి మారింది. ఈ నేపధ్యంలో, Apple October Event 2025 కూడా అక్టోబర్ 28 నుండి 30 మధ్య జరిగే అవకాశం ఉంది.ఈ అంచనా సరైనదై ఉంటే, ఈవెంట్‌లో విడుదలైన ఉత్పత్తుల ప్రీ-ఆర్డర్లు నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అయితే, ఇవన్నీ గత ట్రెండ్‌ల ఆధారంగా చేసిన అంచనాలే. అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ, టెక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆపిల్ అక్టోబర్ ఈవెంట్ 2025 గురించి కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. అయితే, ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగించాలంటే యూజర్లు తమ WhatsApp అకౌంట్‌ను మెటా ఎకౌంటు సెంటర్ కి లింక్‌ చేయాలి
  2. త్వరలో భారత మార్కెట్‌లోకి Lava Shark 2 స్మార్ట్‌ఫోన్, 50 మెగాపిక్సెల్ AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, రెండు కలర్ ఆప్షన్లలో హ్యాండ్ సెట్
  3. వీటిలో 6,000mAh మరియు 6,200mAh బ్యాటరీలు అందించబడ్డాయి
  4. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి 2025 సేల్లో అదిరిపోయే ఛాన్స్, అతి తక్కువ ధరకే ఆపిల్ ఎయిర్‌పాడ్స్
  5. ROG Xbox Ally లో 60W బ్యాటరీ ఉండగా, Ally X మోడల్‌లో 80Wh బ్యాటరీ కలదు
  6. ఇదే విధంగా హోమ్ స్క్రీన్‌లోని ఫోల్డర్ పేర్లు కూడా ఇప్పుడు ఎడమవైపుకే సెట్ అవుతున్నాయి.
  7. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్16 బేస్డ్ OriginOS 6 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రాబోతున్నాయి
  8. Realme 15 Pro 5G గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎడిషన్ ధర, ఫీచర్స్ వివరాలివే
  9. స్మార్ట్ వాచ్‌లపై అదిరే ఆఫర్లు.. ఏ ఏ బ్రాండ్లపై ఎంతెంత తగ్గింపు లభిస్తోందంటే?
  10. ఈవెంట్‌లో విడుదలైన ఉత్పత్తుల ప్రీ-ఆర్డర్లు నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »