స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Pad 3.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి

540 హెచ్‌జెడ్ ట‌చ్ సాంప్లింగ్ రేట్‌, 900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తోంది. ఎన్నో స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన OnePlus Pad 3 కి సంబంధించిన కీలక విష‌యాల‌ను తెలుసుకుందాం.

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Pad 3.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి

Photo Credit: OnePlus

వన్‌ప్లస్ ప్యాడ్ 3 ఫ్రాస్టెడ్ సిల్వర్ మరియు స్టార్మ్ బ్లూ షేడ్స్‌లో వస్తుంది

ముఖ్యాంశాలు
  • 13.2 అంగుళాల 3.4కె ఎల్‌సీడీ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది
  • ఇది ఓమ్నీ బేరింగ్ సౌండ్ ఫీల్డ్ టెక్నాల‌జీ ఆధారంగా ప‌ని చేస్తుంది
  • ఈ ట్యాబ్‌కు 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అంద
ప్రకటన

OnePlus కంపెనీ త‌మ కొత్త ఫ్లాగ్‌షిప్ ట్యాబ్‌ OnePlus Pad 3 ని అధికారికంగా విడుద‌ల చేసింది. స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో వ‌స్తోన్న ఈ ట్యాబ్ ఆక‌ర్షణీయ‌మైన స్పెసిఫికేష‌న్స్‌తో ఆక‌ట్టుకునే ఆడియో అనుభ‌వాన్ని అందిస్తుంద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇది 13.2 అంగుళాల 3.4కె ఎల్‌సీడీ డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అలాగే, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను క‌లిగి ఉంది. 540 హెచ్‌జెడ్ ట‌చ్ సాంప్లింగ్ రేట్‌, 900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వ‌స్తోంది. ఎన్నో స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన OnePlus Pad 3 కి సంబంధించిన కీలక విష‌యాల‌ను తెలుసుకుందాం.OnePlus Pad 3 ధ‌ర‌లు ఇలా,కొత్త OnePlus Pad 3 మోడ‌ల్ 12జీబీ+ 256జీబీ ధ‌ర 699.99 డాల‌ర్లు (సుమారు రూ. 60,070)గా ఉంది. అలాగే, 16జీబీ+ 512జీబీ మోడ‌ల్ ధ‌ర 799 డాల‌ర్లు (సుమారు రూ. 68,570), జూలై 8 నుంచి యూర‌ప్‌, నార్త్ అమెరికాలో అందుబాటులోకి రానుంది. అలాగే, మ‌న దేశంలో 12జీబీ+ 256జీబీ, 16జీబీ+ 512జీబీ స్టోరేజీ ఆప్ష‌న్‌ల‌లో ల‌భించ‌నుంది. దేశీయ మార్కెట్‌లో అమ్మ‌కాల తేదీ వెల్ల‌డికాన‌ప్ప‌టికీ, త్వ‌ర‌లోనే రానున్న‌ట్లు మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అంతే కాదు, ఇది ఫ్రాస్టెడ్ సిల్వ‌ర్‌, స్మార్ట్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్‌ల‌లో ల‌భించ‌నుంది.

4 మిడ్ బాస్‌, 4 ట్విట‌ర్ యూనిట్‌లు

స్నాప్‌డ్రాగ‌న్ 8 ఎలైట్ 3ఎన్ఎం ప్రాసెస‌ర్‌తో ప‌రిచ‌య‌మైన OnePlus Pad 3 ఆడ్రాయిడ్ 830 జీపీయూ, 12జీబీ, 16జీబీ ర్యామ్ 256జీబీ లేదా 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను క‌లిగి ఉంది. ఇది మ‌ల్టీ లెవ‌ల్ వేరియ‌బుల్ రిఫ్రెష్ రేట్ కార‌ణంగా మ‌రింత స్మూత్‌గా ప‌ని చేస్తుంది. దీనికి మొత్తంగా 4 మిడ్ బాస్‌, 4 ట్విట‌ర్ యూనిట్‌లు అందించారు. అలాగే, ఇది ఓమ్నీ బేరింగ్ సౌండ్ ఫీల్డ్ టెక్నాల‌జీ ఆధారంగా ప‌ని చేస్తుంది.

12,140mAh బ్యాట‌రీ

OnePlus Pad 3 కెమెరా విష‌యానికి వ‌స్తే.. ఈ ట్యాబ్‌కు 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరాను అందించారు. అలాగే, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో దీనిని రూపొందించారు. మెట‌ల్ యునిబాడి డిజైన్‌తో కేవ‌లం 5.97 మీమీ మందంతో ఇది ఉంటుంది. అయితే, ఈ ట్యాబ్ కు సంబంధించి ముఖ్య‌మైనది దీని బ్యాట‌రీ. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో 12,140mAh బ్యాట‌రీని అమ‌ర్చారు. ఇది కేవ‌లం 92 నిమ‌షాల్లో ఛార్జ్ ఫుల్ అయిపోతుంది.

డేటా షేరింగ్‌ల‌కు స‌పోర్ట్

ఈ ట్యాబ్ క‌నెక్టవిటీ ఆప్ష‌న్‌ల‌ను చూస్తే, Wi-Fi 7, బ్యూటూత్ 5.4, యూఎస్‌బీ 3.2 జెన్ 1, ఎన్ఎఫ్‌సీ, టైప్ సీ ఆడియో, 5జీ డేటా షేరింగ్ వంటివి ఉన్నాయి. అలాగే, OnePlus హ్యాండ్‌సెట్‌ల‌తో నోటిఫికేష‌న్స్‌, ఫైల్ ట్రాన్స్ఫ‌ర్, డేటా షేరింగ్ ల‌కు స‌పోర్ట్ చేస్తుంది. అంతే కాదు, కీ బోర్డ్‌కు పెద్ద కీ కాప్స్‌తోపాటు క‌మాండ్ కీస్‌, ఎఐ బ‌ట‌న్, మాగ్నెటిక్ క‌నెక్ష‌న్ వంటి ఇత‌ర ఫీచ‌ర్స్‌ను కంపెనీ అందించింది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఈ ఫోన్‌లో ప్రత్యేకించి ప్రో విజువల్ ఇంజిన్ ఉంటుంది, దీని ద్వారా పలు ఏఐ ఆధారిత ఎడిటింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి
  2. ఈ ఫోన్‌ 4400mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 నిమిషాల్లో 50% ఛార్జ్
  3. ChatGPT said: ఆఫర్లు బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు, నో కాస్ట్ EMIతో ఎఫెక్టివ్ ధరలకు అందుబాటులో ఉన్నాయి
  4. ఈ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లు, కూపన్‌లతో లభ్యమవుతూ నో కాస్ట్ EMI ఫైనాన్స్ ఎంపికలు అందుబాటులో
  5. జూలై 14న ఇండియ‌న్ మార్కెట్‌లోకి Vivo X Fold 5, Vivo X200 FE
  6. స‌రికొత్త బ్యాట‌రీ అప్‌గ్రేడ్‌తో మార్కెట్‌లోకి iPhone 17 Pro Max
  7. ఇది మిడ్ రేంజ్‌ సెగ్మెంట్లో గట్టి పోటీగా జూలై 12 నుంచి అమెజాన్‌లో లభ్యం
  8. ప్రైమ్ డే 2025: ఎకో, ఫైర్ టీవీ, కిండిల్‌లపై గరిష్ఠంగా 50% డిస్కౌంట్
  9. నథింగ్ హెడ్‌ఫోన్ 1లో 1040mAh బ్యాటరీ ఉంది, 120 నిమిషాల్లో Type-C ద్వారా ఛార్జ్ అవుతుంది
  10. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »