ఎవరైనా ఎక్కువ సేపు వాడే వారు అయితే ఈ ట్యాబ్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే చాలనిపిస్తుంది. 9000 mAh బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది

ఎవరైనా ఎక్కువ సేపు వాడే వారు అయితే ఈ ట్యాబ్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే చాలనిపిస్తుంది. 9000 mAh బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది. అంతేకాదు, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తో త్వరగా ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది.

ఎవరైనా ఎక్కువ సేపు వాడే వారు అయితే ఈ ట్యాబ్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే చాలనిపిస్తుంది. 9000 mAh బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది

Photo Credit: Xiaomi

రెడ్‌మి ప్యాడ్ 2 నీలం మరియు బూడిద రంగు ఎంపికలలో వస్తుంది

ముఖ్యాంశాలు
  • 9000mAh బ్యాటరీ బ్యాకప్ తో ఎక్కువ సమయం ఉపయోగించవచ్చు
  • 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో స్మూత్ గా హ్యాండిల్ చేయవచ్చు
  • 600 నిట్స్ బ్రైట్నెస్ వల్ల బయట కూడా స్పష్టంగా స్క్రీన్ కనిపిస్తుంది
ప్రకటన

ఈ వారం ఇండియన్ మార్కెట్లో చాలా రకాల మొబైల్స్ లాంచ్ అయ్యాయి. వాటితో పాటు టాబ్లెట్స్ కూడా మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. రెడ్ మీ నుండి లాంచ్ అయిన కొత్త ట్యాబ్ రెడ్ మీ ప్యాడ్ 2. మొబైల్ కంపెనీల్లో ముందుండే ఈ బ్రాండ్‌ ఇప్పుడు ట్యాబ్లెట్ విభాగంలోనూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సరసమైన ధరకు, సూపర్ ఫీచర్స్‌తో వచ్చిన ఈ ప్యాడ్ 2 ట్యాబ్ బిజీ ప్రొఫెషనల్స్‌, స్టూడెంట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్ అందరికి పనికి వచ్చేలా కనిపిస్తోంది.ఈ ట్యాబ్‌ లో 11 ఇంచ్‌ 2.5K డిస్‌ ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్‌ రేట్‌తో స్క్రోల్ చేయడము, వీడియోలు చూడడము అన్నీ బట్టర్‌లా స్మూత్‌గా నడుస్తాయి. 600 నిట్స్ బ్రైట్నెస్ వల్ల బయట కూడా స్పష్టంగా స్క్రీన్ కనిపిస్తుంది.ఈ ట్యాబ్ లో

MediaTek Helio G100 ప్రాసెసర్‌ వినియోగించారు. 6nm టెక్నాలజీతో వచ్చిందే కాబట్టి గేమింగ్‌, వీడియో ఎడిటింగ్ వంటి పనులకీ సరిపోతుంది. ఈ రెడ్ మీ ట్యాబ్ 2 లో కొత్తగా HyperOS 2 ఇన్స్టాల్ చేశారు. గూగుల్ సర్కిల్ సెర్చ్‌ మొదటి సారిగా ఇందులో అందుబాటులో ఉంది. క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా స్క్రీన్‌ పై ఉన్నదేంటో వెంటనే సెర్చ్‌ చేయొచ్చు.

ఈ ట్యాబ్ ధర విషయానికి వస్తే... స్టోరేజ్ ఆప్షన్ కి తగ్గట్టుగా ధరలో మార్పు వస్తుంది. కేవలం వైఫైతో పని చేస్తూ 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ తో వచ్చే ట్యాబ్ ధర రూ.13,999గా ఉంది. అలాగే, వైఫై ప్లస్ సెల్యులార్ మోడ్ ఆప్షన్స్ సపోర్ట్ చేస్తూ 6GB + 128GB స్టోరేజ్ వేరియెంట్ తో వచ్చే ట్యాబ్ ధర రూ.15,999 గా ఉంటే , 8GB + 256GB RAM స్టోరేజ్ వేరియంట్ తో వచ్చే ట్యాబ్ ధర రూ.17,999గా ఉంది. ఈ ట్యాబ్ బ్లూ & గ్రే కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఎవరైనా ఎక్కువ సేపు వాడే వారు అయితే ఈ ట్యాబ్‌ను ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే చాలనిపిస్తుంది. 9000 mAh బ్యాటరీ బ్యాకప్‌ ఇస్తుంది. అంతేకాదు, 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ తో త్వరగా ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ఎక్కువ సమయం ట్యాబ్ యూస్ చేస్తే కళ్ళకి ఎటువంటి డామేజ్ కలగకుండా, అలాగే తడి చేతులతో పట్టుకున్న ట్యాబ్ కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ట్రిపుల్ TÜV Rheinland సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.

అలాగే ఈ ట్యాబ్ కి మంచి కెమెరా ఆప్షన్స్ కూడా అందించారు. మంచి ఫోటోలు దిగేందుకు వెనక సైడ్ ఎటు మెగాపిక్సల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సల్ కెమెరాని ఏర్పాటు చేశారు. మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ పొందేందుకు డాల్బీ అటమాస్ సపోర్ట్ తో క్వాడ్ స్పీకర్ సిస్టం ని కూడా ఇందులో బిల్ట్ చేశారు. స్మార్ట్ పెన్ సపోర్ట్ తో ఈ ట్యాబ్ ను ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు.స్కెచ్‌లు వేయాలి, నోట్లు రాయాలి అనుకునే వారికి ఇది చాల బాగుంటుంది. దీనికి అదనంగా రూ.3,299 చెల్లించాల్సి ఉంటుంది.

ఇందులో ఉన్న అదనపు ఫీచర్స్ చూస్తే...ఇది 4G కనెక్టివిటీ తో పనిచేస్తుంది, అలాగే వైఫై, బ్లూటూత్, 35mm ఆడియో జాక్, USB టైప్ C పోర్ట్ ఆక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక సెన్సార్ల విషయానికొస్తే యాక్సెలోమెటర్, అంబియాంట్ లైట్ సెన్సార్, హాల్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. ఈ ట్యాబ్ 254.58×166.04×7.36mm సైజ్ తో, 510g బరువుతో వస్తుంది.

మొత్తం చెప్పాలంటే... రెడ్ మీ ప్యాడ్ 2 ట్యాబ్ ఒక ఫ్యామిలీకి అవసరమయ్యే అన్నీ ఫీచర్లతో ఉంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. దయచేసి మీ ఫోన్లను రీస్టార్ట్‌ చేయండి అని ఎయిర్‌టెల్ వినియోగదారులకు సూచించింది
  2. లీకైన ఒప్పో ఎఫ్ 31 సిరీస్.. అదిరే లుక్స్‌తో రానున్న న్యూ మోడల్స్
  3. హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 న్యూ మోడల్.. సేల్ ఎప్పటి నుంచంటే
  4. ఇప్పుడు బెంగళూరులోని హెబ్బాళ్ స్టోర్ ఈ అనుభవాన్ని మరింత విస్తృతం చేయనుంది
  5. రత మార్కెట్‌లోకి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లు, అద్బుతమైన ఫీచర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చంటే?
  6. జెమినీ కెమెరా కోచ్, ఫేస్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఈరేసర్ ఫీచర్లు ఫోటోలు అందంగా చేస్తాయి
  7. రూ. 249 ప్లాన్‌ను నిలిపి వేసిన ఎయిర్ టెల్
  8. ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను సెట్ చేశారు
  9. అదిరే ఫీచర్స్, ధరతో హానర్ X7c 5G కొత్త మోడల్
  10. Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »