Photo Credit: Apple
కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో జరిగిన ఆపిల్ కంపెనీ యొక్క ఇట్స్ గ్లోటైమ్ ఈవెంట్‌లో Apple Watch Series 10ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌వాచ్‌ను Apple సంస్థ రెండు వేరియంట్‌లలో ఆవిష్కరించింది. ఈ సరికొత్త స్మార్ట్‌వాచ్ గతంలో వచ్చిన సిరీస్ కంటే సన్నగా, పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. వాచ్ యొక్క కుడి వైపున డిజిటల్ క్రౌన్‌తోపాటు ఫిజికల్ బటన్‌ను అందిస్తోంది. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో కూడిన కొత్త చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ Apple Watch Series 10తో ఆపిల్ స్టాండర్డ్ మోడల్‌కు సపోర్ట్‌గా డెప్త్ యాప్‌ను ఎక్స్‌పెండ్ చేసింది.
Apple Watch Series 10 ప్రారంభ ధర 42mm GPS వేరియంట్ అయితే రూ. 46,900, సెల్యులార్ అయితే ధర రూ. 56,900గా నిర్ణయించారు. 42mm సెల్యులార్‌లోని టైటానియం వేరియంట్ ధర రూ. 79,900, 46mm అయితే ధర రూ. 84,900గా ఉంది. ఇప్పటికే ఈ వాచ్‌ల ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 20 నుండి అమ్మకాలు మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది. వీటితోపాటు Apple Watch అల్ట్రా 2 కొత్త బ్లాక్ టైటానియం కలర్‌వేలో రూ. 89,900కు లభిస్తుంది. దీని ప్రీ-ఆర్డర్‌లు కూడా ఇప్పటికే మొదలవ్వగా.. సెప్టెంబర్ 20 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Apple కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. Watch Series 10 న్యూ వైడ్ యాంగిల్ OLED డిస్‌ప్లేను కలిగి, గత సిరీస్‌లతోపోల్చుకుంటే 40 శాతం బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. దీనిలో లైవ్ టెక్ట్స్ టైప్ చేసుకోవడంతోపాటు మెసేజ్‌లు, మెయిల్‌లు పంపుకోవడం చాలా సులభం. ఈ వాచ్ 9.7 మిమీ మందం కలిగిన ఉంటుంది. అలాగే, సిలికాన్ నానోపార్టికల్స్ ఉపయోగించి తయారు చేయబడిన పాలిష్ చేసిన అల్యూమినియం ఫ్రేమ్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే, ఆపిల్ కంపెనీ వాచ్ సిరీస్ 10 యొక్క టైటానియం వేరియంట్‌ను కూడా ఆవిష్కరించింది. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ ఆపిల్ వాచ్ సిరీస్ 9 కంటే తక్కువ బరువు కలిగి ఉంటుంది.
ఈ 10 సిరీస్‌లో OS 10 పిక్స్ యాప్, ట్రాన్స్‌లేషన్ యాప్‌తోపాటు అనేక కొత్త ఫీచర్స్‌ను పొందవచ్చు. ఇది న్యూ S10 చిప్‌తో పని చేస్తూ.. నాలుగు-కోర్ న్యూరల్ ఇంజిన్‌తో రూపొందించబడింది. Watch Series 10లో ప్రత్యేకతల్లో ప్రధానమైనది స్లీప్ అప్నియాను గుర్తించే సామర్థ్యం. నిజానికి, 80 శాతం స్లీప్ అప్నియా కేసులు నిర్ధారణ కాకపోవడంతో నిద్రలో శ్వాసకోశ రుగ్మతల పర్యవేక్షించే లక్ష్యంతో ఈ ఫీచర్‌ను కంపెనీ పరిచయం చేసినట్లు తెలిపింది. దీని ద్వారా వినియోగదారులకు ముందస్తుగానే విషయం చేరవేసి, వారిని అలర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఫీచర్ 150 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ వాచ్ కేవలం 30 నిమిషాల ఛార్జింగ్‌తో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
ప్రకటన
ప్రకటన