Photo Credit: CMF By Nothing
CMF బడ్స్ 2 ప్లస్ (చిత్రంలో) నీలం మరియు లేత బూడిద రంగు షేడ్స్‌లో అందుబాటులో ఉన్నాయి
CMF బడ్స్ 2తోపాటు మన దేశంలో CMF బడ్స్ 2ఏ, CMF 2 ప్లస్ టీడబ్ల్యూఎస్ ఇయర్ ఫోన్‌లను కంపెనీ ఒకేసారి పరిచయం చేసింది. యాక్టీవ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్‌ను ఇవి 50 dB వరకూ ఇవ్వడంతోపాటు వీటి కేసులతో 61 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ బడ్స్ నథింగ్ ఎక్స్ యాప్‌కు సపోర్ట్ చేయడంతోపాటు డ్యూయల్ డివైస్ కనెక్టివిటీకి మద్దతుగా ఉంటాయి. గత ఏడాది జూలైలో మన దేశంలో విడుదలైన CMF బడ్స్ ప్రో 2 లానే ఈ మూడూ డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తున్నాయి.మన దేశంలో ధరలు,CMF బడ్స్ 2ఏ ధర ఇండియాలో రూ. 2199 ఉండగా, బడ్స్ 2, బడ్స్ 2 ప్లస్ మోడల్స్ ధరలు వరుసగా రూ. 2699, రూ. 3299గా నిర్ణయించారు. ఈ మూడు కూడా ఫ్లిప్‌కార్ట్ ద్వారా మన దేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. బడ్స్ 2ఏ, బడ్స్ 2లు డార్క్ గ్రే, ఆరెంజ్ షేడ్స్‌లో లభించనున్నాయి. బడ్స్ 2 లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటోకి రానుంది. బ్లూ, లైట్ గ్రే కలర్‌లో CMF బడ్స్ 2 ప్లస్ మోడల్ లభిస్తుంది.
డైరాక్ ట్యూనింగ్‌లో 12.4 ఎంఎం బయో ఫైబర్ డ్రైవర్‌లను అటాచ్ చేసి బడ్స్ 2ఏ రానున్నాయి. బడ్స్ 2లో డైరాక్ ఆప్టియో ట్యూనింగ్, ఎన్52 మాగ్నెటెలతో 11 ఎంఎం పీఎంఐ డ్రైవర్స్‌ను అందించారు. ఇవి ఖచ్చితమైన ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ టెస్ట్ ద్వారా వ్యక్తిగత సౌండ్ హియరింగ్ ప్రొఫైల్ సపోర్ట్‌తో రానుంది. బడ్స్ 2ఏ 42 dB ఏఎన్‌సీ వరకూ సపోర్ట్‌తో ట్రాన్స్పరెన్సీ మోడ్‌తో, బడ్స్ 2 మోడల్ 48 dB హైబ్రిడ్ ఏఎన్‌సీ వరకూ సపోర్ట్ చేస్తోంది.
ఈ మూడు మోడల్స్ కూడా విండ్ నాయిస్ రిడక్షన్ 3.0, అల్ట్రా బాస్ టెక్నాలజీ 2.0, కాల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్స్‌తో రూపొందించబడ్డాయి. బడ్స్ 2ఏ క్లియర్ వాయిస్ టెక్నాలజీ సపోర్ట్‌తో 4 హెచ్‌డీ మైక్‌లను, బడ్స్ ప్లస్‌లో ఒక్కొక్కటీ క్లియర్ వాయిస్ టెక్నాలజీ 3.0తో ఆరు హెచ్‌డీ మైక్ యూనిట్‌లు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ బడ్స్ దుమ్ము, స్ప్లాష్ నియంత్రణకు ఐపీ54 రేటింగ్, బేస్-ప్లస్ మోడల్స్ ఐపీ55 రేటింగ్‌తో ఉన్నాయి.
కొత్త CMF మూడు బడ్స్ వేరియంట్‌లూ 460 mAh బ్యాటరీతో వస్తున్నాయి. బడ్స్ 2ఏ మోడల్‌లో ప్రతి ఇయర్‌బడ్‌లో 43 mAh బ్యాటరీ ఉంటుండగా, బడ్స్ 2- బడ్స్ 2 ప్లస్‌లో 53 mAh బ్యాటరీని అందించారు. బడ్స్ 2ఏ ఇయర్‌ఫోన్స్ ఏఎన్‌సీ లేకుండా 8 గంటలు పని వరకూ పని చేస్తాయని, కేస్‌లో దాదాపు 35.5 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. మొత్తంగా, ఈ మూడు వేరియంట్‌లూ మంచి బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ప్రచారంలో ఉంది.
ప్రకటన
ప్రకటన