మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్‌ఫోన్ వినియోగంలోనూ మార్పులు చూస్తున్నాం. అయితే, ఈ రోజుల్లో జేబులో ఫోన్ ఉందంటే.. దానికి కనక్ట్ అయ్యే ఇయర్‌ఫోన్స్ ఉండాల్సిందే. ఈ కారణంగా అనేక కంపెనీలు తమ టెక్నాలజీకి పదునపెట్టి కొత్త కొత్త ఇయర్‌ఫోన్‌లను మార్కెట్‌లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా.. ట్రూ వైర్‌లెస్ స్టీరియో (TWS) ఇయర్‌ఫోన్స్‌గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌తో Noise Buds N1 Proను మన దేశంలో విడుదల చేశారు. మరెందుకు ఆలస్యం Noise Buds N1 Pro బడ్స్ యొక్క ఫీచర్స్‌తోపాటు ధర ఎంతో కూడా తెలుసుకుందామా?!
ఈ బడ్స్ మొత్తంగా 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ని అందజేస్తాయని సంస్థ ప్రకటించింది. అంతేకాదు, 10 నిమిషాల ఛార్జ్‌తో 200 నిమిషాల ప్లేబ్యాక్‌ను అందించగల ఇన్‌స్టాఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఈ సెట్ సపోర్ట్ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ఇయర్‌ఫోన్‌లు 11mm డ్రైవర్‌లతో రూపొందించబడ్డాయి. అలాగే, బ్లూటూత్ 5.3, హైపర్‌సింక్ టెక్నాలజీ కనెక్టివిటీ ఎంపికలను కలిగి ఉంటాయి. ఈ కారణంగా బడ్స్ కనెక్టివిటీ సులభతరం అవుతుంది. Noise Buds N1 Pro మనదేశంలో రూ. 1,499లకు ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈ నెల చివరిలో అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నెలాఖరుకు ప్రత్యేక ఆఫర్‌లో భాగంగానే లభించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతోపాటు ఈ మోడల్ ఇయర్‌ఫోన్‌లు gonoise.com వెబ్‌సైట్‌లో కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రకటించింది. అలాగే, ఈ బడ్స్ క్రోమ్ బ్లాక్, లేత గోధుమరంగు, క్రోమ్ గ్రీన్, క్రోమ్ పర్పుల్ మొత్తం నాలుగు రంగులలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
క్వాడ్ మైక్ సెటప్‌తో..
Noise Buds N1 Pro మోడల్ 11mm డ్రైవర్లతో రూపొందించడంతోపాటు ఇన్వరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)కు సపోర్ట్ చేసే క్వాడ్ మైక్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది ఎలాంటి ఆటంకాలూ లేని స్పష్టమైన కాల్‌లను అందిస్తుంది. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు క్రోమ్, మెటాలిక్ ఫినిషింగ్‌తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే, టచ్ కంట్రోల్స్ 32dB ANC వరకు సపోర్ట్ చేస్తాయి. Noise Buds N1 Pro 40ms వరకు తక్కువ లేటెన్సీకి సపోర్ట్ చేయడం వల్ల గేమ్ లేదా స్ట్రీమింగ్ కంటెంట్ యొక్క ఆడియో, విజువల్ అవుట్‌పుట్‌ల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఎలాంటి ఆటంకం లేని మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఆస్వాదించవచ్చు. ఇది ఈ ఇయర్‌ఫోన్‌లలో అధనపు ఫీచర్‌గానే చెప్పుకోవచ్చు. ఇవి రూపొందించబడిన ఆకృతి కూడా ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
ఒక ఛార్జ్‌పై మొత్తం 60 గంటల బ్యాకప్..
దీంతోపాటు ఈ ఇయర్‌ఫోన్‌లు డ్యూయల్ పెయిరింగ్, హైపర్‌సింక్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. అంచేత వేగవంతమైన అవుట్‌పుట్‌ను అందుకోవచ్చు. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీకి సపోర్ట్ చేయడంతో ఇయర్‌ఫోన్‌లను స్టోరేజ్ కేస్ నుండి తీసినప్పుడు అప్పటికే కనక్ట్ చేసి పరికరాలకు సులభంగా కనెక్ట్ అయ్యే వేక్ అండ్ పెయిర్ ఫీచర్‌ను అందించారు. Noise Buds N1 Pro ఛార్జింగ్ కేస్‌తో సహా ఒక ఛార్జ్‌పై మొత్తం 60 గంటల బ్యాటరీ బ్యాకప్ అందజేస్తుందని దృవీకరించబడింది. ఇన్‌స్టాఛార్జ్ మద్దతుతో 10 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్ చేయడం ద్వారా వినియోగదారులకు 200 నిమిషాల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఇయర్‌ఫోన్‌లు IPX5 రేటింగ్‌తో అందుబాటులోకి రాబోతున్నాయి. మరి ఇంత తక్కువ ధరలో వస్తోన్న Noise Buds N1 Proను కొనుగోలు చేసేందుకు మీరూ సిద్ధంగా ఉన్నారా? మర్చిపోద్దు.. ఈ నెల చివరిలో అమెజాన్‌తోపాటు gonoise.com వెబ్‌సైట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.