డ్యూరబిలిటీ విషయానికి వస్తే, Moto Watch కి IP68 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము, నీటికి మంచి రక్షణ ఉంటుంది. అంతేకాకుండా 1 ATM ప్రెషర్ రేటింగ్ కూడా అందించారు. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్టంగా 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
Photo Credit: Motorola
మోటోరోలా మోటో వాచ్ లాంచ్‌ను ధృవీకరించింది
మోటరోలా తన తదుపరి స్మార్ట్‌వాచ్ Moto Watch ను భారత మార్కెట్‌లో జనవరి 23న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ వాచ్‌ను ఈ నెల ప్రారంభంలో CES 2026 వేదికపై పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అదే ఈవెంట్‌లో మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ వాచ్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. Moto Watch లో 1.4 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండగా, దీనికి Corning Gorilla Glass 3 రక్షణ అందించారు. ఈ సెగ్మెంట్‌లో గోరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వచ్చే ఏకైక స్మార్ట్‌వాచ్ ఇదేనని మోటరోలా చెబుతోంది. హెల్త్ ట్రాకింగ్ విషయంలో ఈ వాచ్ బలమైన ఫీచర్లతో వస్తోంది. అడుగుల లెక్కింపు, నిద్ర విశ్లేషణ, స్ట్రెస్ లెవల్స్, హార్ట్ రేట్, రక్తంలోని ఆక్సిజన్ స్థాయి వంటి వివరాలను ఇది అందిస్తుంది. ఈ హెల్త్ ఇన్‌సైట్స్ అన్నీ Polar టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. Polar అనేది హార్ట్ రేట్ సెన్సర్లు, స్పోర్ట్స్ వాచ్‌లలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బ్రాండ్.
డ్యూరబిలిటీ విషయానికి వస్తే, Moto Watch కి IP68 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము, నీటికి మంచి రక్షణ ఉంటుంది. అంతేకాకుండా 1 ATM ప్రెషర్ రేటింగ్ కూడా అందించారు. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే గరిష్టంగా 7 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అవుట్‌డోర్ వర్కౌట్స్ కోసం డ్యువల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ ఇవ్వడం వల్ల లొకేషన్ ట్రాకింగ్ మరింత ఖచ్చితంగా ఉంటుంది.
ఈ స్మార్ట్‌వాచ్ 47mm రౌండ్ డయల్ తో వస్తుంది. సాండ్-బ్లాస్టెడ్ అల్యూమినియం ఫ్రేమ్, స్టెయిన్‌లెస్ స్టీల్ క్రౌన్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తాయి. థర్డ్ పార్టీ 22mm బ్యాండ్స్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఉండటం వల్ల హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ చేయవచ్చు. నోటిఫికేషన్ అలర్ట్స్‌తో పాటు “Catch Me Up” వంటి Moto AI ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.
Moto Watch ను మ్యాట్ బ్లాక్, మ్యాట్ silvar రంగుల్లో విడుదల చేయనున్నారు. లాంచ్ తర్వాత ఈ స్మార్ట్‌వాచ్‌ను Flipkart, motorola.in తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద, డిజైన్, హెల్త్ ఫీచర్లు, బ్యాటరీ, GPS వంటి అంశాల్లో Moto Watch భారత మార్కెట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది..
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Vivo V70 FE Reportedly Surfaces on Geekbench With MediaTek Dimensity Chipset