ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ OnePlus తన OnePlus బడ్స్ ప్రో 3ని వచ్చే వారం మన దేశంతోపాటు గ్లోబల్ మార్కెట్లలోను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, గత ఏడాది విడులైన బడ్స్ ప్రో 2తో పోల్చితే ఇప్పుడు విడుదల కాబోతోన్న OnePlus Buds Pro 3 ఇయర్‌బడ్స్ డిజైన్‌తోపాటు ఫీచర్స్‌లోనూ పెద్ద మార్పులతో వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇవి IP55 రేటెడ్ బిల్డ్‌తోపాటు 5.4 బ్లూటూత్ కనెక్టివిటీతో లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. తాజాగా రాబోయే బడ్స్ ప్రో 3 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 43 గంటల వరకు వినియోగంలో ఉంటుంది. ఒక్కో అప్‌డేట్ చూస్తుంటే.. ఈ మోడల్ కోసం మరింత సమాచారం తెలుసుకోవాలని అనిపిస్తుంది కదూ.. మరెందుకు ఆలస్యం ఆ వివరాలు మీకోసమే!
OnePlus Buds Pro 3 ఆగష్టు 20న అధికారికంగా ఆవిష్కరించబడుతుందని కంపెనీ X పోస్ట్ ద్వారా ప్రకటించింది. ఆ రోజు భారతదేశంలో సాయంత్రం 6.30 గంటలకు ఈ లాంచింగ్ కార్యక్రమం జరుగనుండగా.. ప్రపంచ మార్కెట్లలో ఉదయం 9:00 (EST), మధ్యాహ్నం 2:00 (BST) మరియు 3:00pm (CEST)కి జరుగనుంది. OnePlus యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బడ్స్ ప్రో 3 యొక్క ప్రారంభ తేదీని వెల్లడిస్తూ ఒక ప్రత్యేక ల్యాండింగ్ పేజీని రూపొందించింది.
వారికి రివ్యూ చేసే అవకాశం..
ఈ పేజీలో రాబోయే మోడల్ కేస్ డిజైన్ OnePlus Buds Pro 2 మాదిరిగానే ఉన్నట్లు అనిపించవవచ్చే. అలాగే, ముందు భాగంలో లెదర్ ఫినిషింగ్‌తోపాటు కుడివైపున జత చేసే బటన్, దిగువన USB టైప్-C పోర్ట్‌ను అందించారు. ఈ OnePlus Buds Pro 3పై ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు దీనికి సంబంధించిన మరిన్ని ఆప్‌డేట్స్ కోసం పేజీలోని “Notify Me” బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. అంతేకాదు.. భారత్‌తోపాటు యూరప్, ఉత్తర అమెరికా నుంచి కమ్యూనిటీ సభ్యులకు ఈ కొత్త ప్రొడక్టును స్టోర్‌లలోకి వచ్చే ముందు రివ్యూ చేసే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.
పది నిమిషాల ఛార్జ్‌తో ఐదు గంటలు
గతంలో లీకైన వివరాల ప్రకారం చూస్తే.. OnePlus Buds Pro 3 తాజాగా IP55 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వస్తుంది. అలాగే, OnePlus Buds Pro 2తో పోలిస్తే నాలుగు గంటలు ఎక్కువ అంటే 43 గంటల బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీని ప్రకారం పది నిమిషాల ఛార్జ్‌తో ఐదు గంటల వరకూ మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఇవి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. ఈ కారణంగా బడ్స్ కేవలం 94 మిల్లీసెకన్ల వద్ద అల్ట్రా-లో లేటెన్సీ ఆడియోను చేరవేస్తుంది. 11 mm వూఫర్‌తోపాటు 6mm ట్వీటర్‌తో కూడిన డ్యూయల్ డ్రైవర్ సెటప్‌ను కలిగి ఉంటాయి.
50dB అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్..
OnePlus బడ్స్ ప్రో 3 డిజిటల్-టు-అనలాగ్ కన్వర్టర్ (DAC)ని కలిగి ఉంటుంది. అలాగే, 24-bit/192kHz ఆడియోతో LHDC 5.0 ఆడియో కోడెక్‌కు మద్దతునిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతోపాటు బడ్స్ ప్రో 2 అందించిన 49dB అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కంటే OnePlus Buds Pro 3లో 50dBని అందించనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ ఫీచర్స్‌ను బట్టీ గతంలో వచ్చిన వెర్షన్‌తో పోల్చినప్పుడు ఈ కొత్త మోడల్ రెండు రెట్లు వాయిస్ కాల్స్ క్లారిటీని అందిస్తోందని అంచనా వేస్తున్నారు. OnePlus యొక్క రాబోయే ఫ్లాగ్‌షిప్ ఇయర్‌బడ్స్ ధర మనదేశంలో సుమారు రూ.12000 వరకూ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చిన OnePlus బడ్స్ ప్రో 2 ధర రూ. 11,999గా వచ్చింది.