Photo Credit: Oppo
చైనాలో Oppo Find X8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, Oppo ప్యాడ్ 3 ప్రోతో పాటు Oppo Enco X3 ఇయర్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. అయితే, భారత్ మార్కెట్‌లో ఆగస్టులో రిలీజ్ చేసిన రీబ్రాండెడ్ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3గా కనిపిస్తాయి. Dynaudio ద్వారా ట్యూన్ చేయబడిన తాజా Oppo TWS ఇయర్‌ఫోన్‌లు 11mm బాస్ డ్రైవర్స్, 6mm ట్వీటర్‌లతో వస్తున్నాయి. ఆడియో క్వాలిటీని మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్పబడే డ్యూయల్ DAC యూనిట్లను అమర్చబడి ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్‌లు మొత్తం 43 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. మరెందుకు ఆలస్యం.. ఈ సరికొత్త Oppo Enco X3 ఇయర్‌ఫోన్‌లకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చూసేద్దామా?!
ఈ Oppo Enco X3 ధరను చైనాలో CNY 999 (దాదాపు రూ. 11,800)గా నిర్ణయించారు. ఇవి ప్రస్తుతం Oppo చైనా ఈ-స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లో CNY 949 (దాదాపు రూ. 11,200)కు ప్రత్యేక ప్రీ-సేల్ ధరలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ అక్టోబర్ 30న దేశంలో షిప్పింగ్‌ను ప్రారంభిస్తారు. ఈ సరికొత్త ఇయర్‌ఫోన్‌లు నలుపు, ఆఫ్-వైట్ అనే రెండు రంగులలో లభించనున్నాయి. ఇమేజ్‌లలలో చూస్తే మాత్రం.. ఈ కలర్స్‌లో ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Oppo Enco X3 సాంప్రదాయక ఇన్-ఇయర్ డిజైన్ మాదిరిగానే సిలికాన్ రౌండ్ స్టమ్ డిజైన్‌ను కలిగి ఉంది. పించ్ యాక్షన్, వాల్యూమ్ సర్దుబాటు కోసం స్లైడింగ్‌తో సహా కెపాసిటేటివ్ టచ్ కంట్రోల్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే, డ్యూయల్ DAC యూనిట్లతో పాటు 11mm బాస్ డ్రైవర్స్, 6mm ట్వీటర్లతో వీటిని రూపొందించారు. VPU బోన్ కండిషన్‌తో AI-సపోర్ట్ గల ట్రిపుల్ మైక్ యూనిట్‌లను అందించారు.
Oppo యొక్క Enco X3 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు 50dB వరకు సపోర్ట్ ఇస్తుంది. అంటే, ANC పర్యావరణంలోని సందర్భానుసారంగా నాయిస్‌ను సర్దుబాటు చేస్తుంది. అవి స్పిరిటల్ ఆడియోకు మద్దతిస్తాయి. అలాగే, ఈ ఇయర్‌ఫోన్‌లు డానిష్ లౌడ్‌స్పీకర్ తయారీదారైన డైనాడియో ద్వారా ట్యూన్ చేయబడ్డాయి. అలాగే, దుమ్ము, ధూళి, నీటి నిరోధకత కోసం IP55 రేటింగ్‌తో వస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన మోడల్స్‌తో పోల్చితే ఈ స్పెసిఫికేషన్స్ వాటికి గట్టిపోటీ ఇచ్చేలా కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Oppo చెబుతున్నదాని ప్రకారం.. Enco X3 ఇయర్‌ఫోన్‌లు ఛార్జింగ్ కేస్‌తో మొత్తం 43 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందించగలవు. అంతేకాదు, ఈ ఇయర్‌ఫోన్‌లు ఒక్కసారి ఛార్జ్‌పై 10 గంటల వరకు పని చేస్తాయి. LHDC 5.0 ఆడియో కోడెక్‌కు మద్దతుతో పాటుగా బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని కలిగి ఉన్నాయి. ఇయర్‌ఫోన్‌లు 54 ఎంఎస్ తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉన్నాయి. అదిరిపోయే డిజైన్‌లో వస్తోన్న ఈ ఒక్కో ఇయర్‌బడ్ బరువు 5.3గ్రాములుగా ఉంది.
ప్రకటన
ప్రకటన