Photo Credit: Huawei
హువావే వాచ్ ఫిట్ 3 తిరిగే, క్రియాత్మక కిరీటంతో అమర్చబడింది.
మన దేశంలో Huawei నుంచి Watch Fit 3 విడుదల అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ 1.82-అంగుళాల రెక్టాంగ్లర్ డిస్‌ప్లేతోపాటు 5 ATM వాటర్-రెసిస్టెంట్ రేటింగ్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వస్తోంది. అలాగే, ఒకే ఛార్జ్‌పై 10 రోజుల వరకు పని చేస్తుందని, ఫంక్షనల్ క్రౌన్‌తో అమర్చబడి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ స్మార్ట్ వేరబుల్ ఆండ్రాయిడ్, iOS ప్లాట్‌ఫామ్‌లకు అనుకూలంగా పని చేస్తుంది. వినియోగదారులు Watch Fit 3 నుండి తమ ఫోన్‌లలోని మ్యూజిక్ ప్లేబ్యాక్, కెమెరా షట్టర్‌ను నేరుగా కంట్రోల్ చేయవచ్చు. ఇది అనేక ఫిట్‌నెస్, వెల్నెస్ ఫీచర్లతో అందుబాటులోకి వస్తుంది.
భారత్‌లో ఈ Huawei Watch Fit 3 ధర రూ. 14,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఫ్లోరో ఎలాస్టోమర్ strapsతో గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్ వైట్, నెబ్యులా పింక్ కలర్ ఆప్షన్‌లలో లభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ద్వారా వెల్లడైంది. బూడిద రంగు నైలాన్ strapతో స్పేస్ గ్రే వేరియంట్ ధర రూ. 15,999 వద్ద లిస్టవుట్ చేయబడింది. ప్రస్తుతం Watch Fit 3కి చెందిన అన్ని వెర్షన్‌లు అమెజాన్‌లో రూ. 10,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్‌గా భావించవచ్చు.
కొత్త Watch Fit 3 మోడల్ 1.82-అంగుళాల రెక్టాంగ్లర్ AMOLED డిస్‌ప్లేతో 60Hz రిఫ్రెష్ రేట్, 77.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 480x408 పిక్సెల్స్ రిజల్యూషన్, 347ppi పిక్సెల్ డెన్సిటీ, 1,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ లెవల్, నిత్యం ఆన్‌లో ఉండే డిస్‌ప్లే సపోర్ట్‌తో వస్తోంది. ఇది హృదయ స్పందన రేటు, SpO2 లెవెల్, శ్వాస రేటు మానిటర్‌లతో పాటు పీరియడ్స్, స్లీప్ ట్రాకర్‌లను కూడా కలిగి ఉంటుంది. PPG సెన్సార్ వినియోగదారుల A-fib (ఏట్రియల్ ఫైబ్రిలేషన్), premature beat risksలను పర్యవేక్షించడంలో సహాయపడుతోంది.
ఈ వాచ్ 400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతే కాదు, దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే, గరిష్టంగా 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే, సాధారణ వినియోగంతో ఇది ఏడు రోజుల వరకు లేదా ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేలో ఉన్నప్పుడు నాలుగు రోజుల ఛార్జ్ ఉంటుందని తెలిపింది. దీనికి ఇన్‌బిల్ట్ GPS, చాలా ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లను కూడా అందించారు.
Watch Fit 3 బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే, వినియోగదారులు మ్యూజిక్ ప్లేబ్యాక్, అటాచ్ చేసిన ఫోన్ కెమెరా షట్టర్‌ను కంట్రోల్ చేసేందుకు అనుమతిస్తుంది అని కంపెనీ వెల్లడించింది. ఈ Watch Fit 3 మోడల్ ఫంక్షనల్, రొటేటింగ్ క్రౌన్‌తోపాటు మరొక ఫంక్షన్ బటన్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనిని కుడివైపు అంచున క్రౌన్ క్రింద అందించారు. వాచ్ 9.9mm మందంతో 26 గ్రాముల బరువును కలిగి ఉంది.
ప్రకటన
ప్రకటన