డీప్ థింక్ మోడ్, నేటివ్ ఆడియో అవుట్‌పుట్‌తో జెమిని 2.5 AI మోడల్స్ అప్‌గ్రేడ్

దీంతోపాటు కంపెనీ డెవలపర్‌ల కోసం తాజా జెమిని మోడళ్లతో ఆలోచన సారాంశాలు, ఆలోచన బడ్జెట్‌లను కూడా ప‌రిచ‌యం చేస్తోంది.

డీప్ థింక్ మోడ్, నేటివ్ ఆడియో అవుట్‌పుట్‌తో జెమిని 2.5 AI మోడల్స్ అప్‌గ్రేడ్

Photo Credit: Google

జెమిని 2.5 ప్రో డీప్ థింక్ 2025 UAMOలో 49.4 శాతం స్కోర్ చేసిన‌ట్లు వెల్ల‌డించిన కంపెనీ.. వినియోగ‌దారుల‌కు ఇక పండ‌గే

ముఖ్యాంశాలు
  • వెబ్‌దేవ్ అరీనా, ఎల్‌ఎంఏరీనా లీడర్‌బోర్డ్‌లలో అగ్రస్థానంలో జెమిని 2.5 ప్ర
  • గూగుల్ జెమిని 2.5 మోడళ్లతో లైవ్ APIకి నేటివ్ ఆడియో అవుట్‌పుట్ అటాచ్ చేస్త
  • ఎంటర్‌ప్రైజెస్ దీనిని వెర్టెక్స్ AI ప్లాట్‌ఫామ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు
ప్రకటన

తాజాగా, గూగుల్ I/O 2025లో జెమిని 2.5 ఫ్యామిలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల కోసం గూగుల్ అనేక కొత్త ఫీచర్లను ప‌రిచ‌యం చేసింది. ఇందులో మౌంటెన్ వ్యూ ఆధారిత టెక్ దిగ్గజం డీప్ థింక్ అని పిలువబడే మెరుగైన లాజిక్‌ మోడ్‌ను ప్రత్యేకంగా చెప్పొచ్చు. ఇది జెమిని 2.5 ప్రో మోడల్ ద్వారా శక్తిని గ్ర‌హిస్తుంది. అలాగే, నేటివ్ ఆడియో అవుట్‌పుట్ అనే కొత్త, నేచుర‌ల్, హ్యూమ‌న్ స్పీచ్ కూడా క‌లిగి ఉంటుంది. ఇది లైవ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API) ద్వారా అందుబాటులోకి వ‌స్తుంది. దీంతోపాటు కంపెనీ డెవలపర్‌ల కోసం తాజా జెమిని మోడళ్లతో ఆలోచన సారాంశాలు, ఆలోచన బడ్జెట్‌లను కూడా ప‌రిచ‌యం చేస్తోంది.పాత మోడల్స్‌ థింకింగ్ వెర్షన్‌లతో పోలిస్తే,రాబోయే మ‌రికొన్ని నెల‌ల్లో జెమిని 2.5 AI మోడల్ సిరీస్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్న‌ అన్ని కొత్త డెవ‌ల‌ప్‌మెంట్స్‌, ఫీచ‌ర్స్‌ను ఈ టెక్ దిగ్గ‌జం ఓ బ్లాగ్ పోస్ట్‌లో వెల్ల‌డించింది. ఈ నెల మొద‌ట్లో గూగుల్ మెరుగైన కోడింగ్ సామర్థ్యాలతో జెమిని 2.5 ప్రో అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంఛ్‌ చేసింది. ఇది వెబ్‌దేవ్ అరీనా, LMArena లీడర్‌బోర్డ్‌లలో సైతం అగ్రస్థానంలో నిల‌బ‌డింది. తాజాగా, డీప్ థింక్ మోడ్‌తో గూగుల్ AI మోడల్ మెరుగైన ఫ‌లితాల‌ను అందిస్తుంది.

రీజనింగ్ మోడ్ బెంచ్‌మార్క్ స్కోర్‌

వివిధ టెస్ట్‌ల త‌ర్వాత దీనికి సంబంధించిన‌ రీజనింగ్ మోడ్ బెంచ్‌మార్క్ స్కోర్‌లను కంపెనీ వెల్ల‌డించింది. ఇందులో ప్ర‌ధానంగా, జెమిని 2.5 ప్రో డీప్ థింక్ 2025 UAMOలో 49.4 శాతం స్కోర్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. LiveCodeBench v6, MMMU లలో కూడా మంచి స్కోర్ చేస్తోంది. డీప్ థింక్ ప్ర‌స్తుతం డెవ‌ల‌ప్‌మెంట్ ద‌శ‌లో ఉంది. ఇది రీజనింగ్ మోడ్ జెమిని API ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఒక నెల క్రితం విడుదలైన జెమిని 2.5 ఫ్లాష్ మోడల్‌కు కొత్త సామర్థ్యాలను అటాచ్ చేస్తున్న‌ట్లు గూగుల్ వెల్ల‌డించింది.

లైవ్ APIని యాక్సెస్

Google AI స్టూడియో ద్వారా డెవలపర్‌లకు ప్రివ్యూలో జెమిని 2.5 ఫ్లాష్ కొత్త వెర్షన్ అందుబాటులో ఉంది. ఎంటర్‌ప్రైజెస్ దీనిని వెర్టెక్స్ AI ప్లాట్‌ఫామ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, జెమిని యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మూడు ప్ర‌ధాన‌మైన ఫీచ‌ర్స్ ఉన్నాయి. అందులో మొద‌టిది అఫెక్టివ్ డైలాగ్‌. ఇది AI మోడల్ వినియోగదారు వాయిస్‌లోని భావోద్వేగాలను గుర్తిస్తుంది. రెండ‌వ‌ది ప్రోయాక్టివ్ ఆడియో. దీని ద్వారా నేపథ్య సంభాషణలకు అనుగుణంగా దానితో మాట్లాడినప్పుడే ప్రతిస్పందించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది.

జెమిని ఆలోచనా సామర్థ్యాలను

ఇక మూడ‌వ‌ది థింకింగ్. ఇది స్పీచ్ జనరేషన్ జెమిని ఆలోచనా సామర్థ్యాలను ఉప‌యోగించి, సంక్లిష్ట ప్రశ్నలకు మౌఖికంగా సమాధానం ఇస్తుంది. జెమిని API, వెర్టెక్స్ AIలోని 2.5 ప్రో, ఫ్లాష్ మోడల్‌లు ఆలోచనల సారాంశాలను ప‌సిగ‌డ‌తాయి. Google ప్రతి ప్రతిస్పందనతో హెడర్‌లు, కీలక వివరాలు, మోడల్ చర్యల గురించిన‌ సమాచారంతో సహా వివరణాత్మక సారాంశాన్ని వెల్ల‌డిస్తుంది.

Comments
Facebookలో షేర్‌ Gadgets360 Twitter Shareట్వీట్ షేర్ Snapchat రెడ్డిట్ వ్యాఖ్యానించండి

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ఒప్పో K13X 5G ప్రైస్ ఏ రేంజ్ లో ఉంటుందంటే... బెస్ట్ బడ్జెట్ ఫోన్ అనే చెప్పవచ్చు
  2. అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న వివో X ఫోల్డ్ 5...ప్రైస్ ఎంతో తెలుసా
  3. అదిరిపోయే ఫీచర్స్ తో వస్తున్న హువాయ్ బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్...ప్రైస్ ఎంతో తెలుసా
  4. టెక్నో పోవా 7 నియో 4G ఫీచర్స్ అదిరిపోయాయి. కంప్లీట్ డీటెయిల్స్ మీకోసం
  5. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో OnePlus Pad 3.. అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో మార్కెట్‌లోకి
  6. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెస‌ర్‌తో మార్కెట్‌లోకి OnePlus 13s: ధర, స్పెసిఫికేషన్స్ మీకోసం
  7. Vi, Vivo స‌రికొత్త‌ ఒప్పందం.. భారత్‌లోని Vivo V50e కొనుగోలుదారులకు ప్రత్యేకమైన 5G రీఛార్జ్‌ ప్లాన్‌
  8. నాలుగు స్టోరేజ్ ఆప్ష‌న్‌ల‌లో Realme 15 5G హ్యాండ్‌సెట్ అందుబాటులోకి.. నివేదిక‌లు ఏం చెబుతున్నాయంటే
  9. బడ్జెట్ ధరలో లావా నుంచి బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ధర ఎంతంటే
  10. అతి తక్కువ ధరకే Samsung Galaxy S25 Ultra.. డోంట్ మిస్!
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »