రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) 47వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 5G కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలికమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ జియో వృద్ధితోపాటు మరిన్ని రంగాలలో కంపెనీ సాధిస్తున్న పురోగతి గురించి అంబానీ వివరించారు. Jio AI-క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ని కూడా ప్రవేశపెట్టారు. ఈ ఆఫర్‌తో జియో వినియోగదారులు 100 GB వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందుతారు. ఈ ఏడాది దీపావళికి వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నారు.
టెలికాం అనుబంధ సంస్థ Jio.. 5G, 6G టెక్నాలజీలలో 350 కంటే ఎక్కువ పేటెంట్లను పొందిందని అంబాలి తెలిపారు. భారతదేశంలో పనిచేస్తున్న 5G రేడియో సెల్స్‌లో 85 శాతానికి పైగా జియోకి చెందినవేనని ఆయన పేర్కొన్నారు. కంపెనీ ట్రూ 5G నెట్‌వర్క్‌లకు 130 మిలియన్లకు పైగా వినియోగదారులను సాంపాదించిందని తెలిపారు. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ JioAirFiber 5G సేవలను మరింత విస్తరించనున్నట్లు తెలిపారు.
JioTV+ కోసం కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు ఆకాష్ అంబానీ తెలిపారు. సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ HD రిజల్యూషన్‌లో 860 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుందన్నారు. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కంటెంట్‌ను అందిస్తుంది. అలాగే, క్యాచ్-అప్ టీవీగా పిలువబడే కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు ప్రసారం తర్వాత కూడా వాటిని మళ్లీ టీవీలో చూడటానికి అవకాశం ఉంటుంది.
Jio సెట్-టాప్ బాక్స్ కోసం JioTV OS అని పిలువబడే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇది అల్ట్రా-HD 4K వీడియో రిజల్యూషన్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుంది. వివిధ యాప్‌లు, లైవ్ టీవీ, షోల కోసం OS కామన్ ఇంటర్‌ఫేస్‌ను కూడా అందిస్తుందని వెల్లడించారు. అలాగే, JioTV OSకి మరో కొత్త పరిచయం Jio యాప్ స్టోర్. మోషన్ బేస్‌డ్ ఫిట్‌నెస్, పిల్లల కోసం విద్యాపరమైన కంటెంట్, షాపింగ్‌తోపాటు మరిన్ని అంశాలను అందించే యాప్‌లన్నింటినీ JioSTB ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
కంపెనీ ప్రకటించిన మరో కీలకమైన అంశం JioPhoneCall AI. ఇది Jio క్లౌడ్‌లో ఫోన్ కాల్‌లను రికార్డ్ చేయడంతోపాటు స్టోర్ చేయగలదు. అలాగే, కాల్ రికార్డ్‌ను ఇతర భాషల్లోకి అనువధించవచ్చు. అంతేకాదు, ఆ కాల్‌ను టెక్ట్స్ రూపంలో కాలాలన్నా తీసుకునే అవకాశం ఉంటుంది. Jio వినియోగదారులు PhoneCall AIకి ప్రత్యేక ఫోన్ నంబర్‌ను కలిగి ఉంటారు. అలా వినియోగదారులు వారి కాల్‌కు ఆ నంబర్ కాన్ఫరెన్స్ కాల్‌గా కలపాలి. తర్వాత స్వాగత సందేశం ప్లే చేయబడుతుంది. అనంతరం కాల్‌ని రికార్డ్ చేయడంతోపాటు సేవ్ చేయడం కోసం వినియోగదారులు #1 ని ప్రెస్ చేయాలి. వినియోగదారులు #2ను నొక్కడం ద్వారా ట్రాన్స్‌క్రిప్షన్‌ను పాజ్ చేయవచ్చు. పునఃప్రారంభించడానికి #1ని, ట్రాన్స్‌క్రిప్షన్, రికార్డింగ్‌ని ముగించాలనుకుంటే #3ని ప్రెస్ చేయాలి.
Jio OTT ప్లాట్‌ఫారమ్ JioCinema వృద్ధి గురించి మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌ను భారతదేశంలో మొత్తం 62 కోట్ల మంది వినియోగదారులు వీక్షించారని, గత సీజన్‌లతో పోలిస్తే ఇది 38 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. JioCinema కేవలం 100 రోజుల్లోనే 15 మిలియన్ల పెయిడ్ చందాదారులను పొందిందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్ ఒరిజినల్ షోలు, అలాగే క్యూరేటెడ్ రియాలిటీ షోలు, చలనచిత్రాలు, HBO, పారామౌంట్, NBCU కంటెంట్‌ను అందిస్తోందన్నారు.
ప్రకటన
ప్రకటన