అలాగే Athlete365 యాప్ అథ్లెట్లకు పనితీరు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సహాయం అందించడంతో పాటు, పోటీలకు సంబంధించిన ముఖ్య సమాచారం కూడా అందిస్తుంది.
ఈరోజు Samsung Galaxy Z Flip7 ఒలింపిక్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది.
సామ్‌సంగ్ తాజాగా తన ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిలో మరో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. అదే Galaxy Z Flip7 Olympic Edition. ఇది 2026 ఫిబ్రవరి 4 నుంచి 22 వరకు జరగనున్న మిలానో–కోర్టినా వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఎడిషన్. ఒలింపిక్స్‌తో సామ్‌సంగ్‌కు ఉన్న దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.,ప్రతి ఒలింపిక్స్‌లోనూ సామ్‌సంగ్ ప్రత్యేక ఎడిషన్ డివైస్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే తరహాలో, ఈ Galaxy Z Flip7 Olympic Edition ఫోన్‌ను పోటీల్లో పాల్గొనే ప్రతి అథ్లెట్‌కు బహుమతిగా ఇవ్వనుంది. మొత్తం మీద సుమారు 90 దేశాలకు చెందిన 3,800 మంది అథ్లెట్లు ఈ ఫోన్‌ను పొందనున్నారు. అందుకే ఇది నిజంగా చాలా లిమిటెడ్ ఎడిషన్. సాధారణంగా ఇలాంటి ఒలింపిక్ ఎడిషన్ ఫోన్లు తర్వాత ఆన్‌లైన్ మార్కెట్‌లలో, ముఖ్యంగా eBay వంటి ప్లాట్‌ఫామ్‌లలో కనిపిస్తుంటాయి.
ఈ ప్రత్యేక ఎడిషన్ గురించి సామ్‌సంగ్ తన అధికారిక ప్రకటనలో మాట్లాడుతూ, “ఒలింపిక్ మరియు ప్యారాలింపిక్ వింటర్ గేమ్స్‌లో పాల్గొనే అథ్లెట్ల గౌరవాన్ని ప్రతిబింబించే ఐకానిక్ డిజైన్‌తో పాటు, ఒలింపిక్ విలేజ్‌లో మరియు పోటీల సమయంలో అథ్లెట్ల అనుభవాన్ని మెరుగుపరిచే ఉపయోగకరమైన సర్వీసులను ఈ డివైస్ అందిస్తుంది” అని పేర్కొంది. డిజైన్ విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో కనిపించే నీలి రంగు మిలానో–కోర్టినా 2026 ప్రత్యేక శైలిని ప్రతిబింబిస్తుందని సామ్‌సంగ్ చెబుతోంది. అదే సమయంలో ఇది సామ్‌సంగ్ బ్రాండ్‌కు చెందిన గుర్తింపుతో పాటు, ఇటలీకి ప్రత్యేకమైన “అజూర్ బ్లూ” సాంస్కృతిక భావనను కూడా సూచిస్తుందని వివరిస్తోంది. అంతేకాదు, ఈ రంగు ఒలింపిక్స్‌కు సంబంధించిన ఐక్యత, క్రీడాస్ఫూర్తి వంటి విలువలను కూడా ప్రతినిధ్యం వహిస్తుందని కంపెనీ అభిప్రాయం.
ఫోన్‌కు ఉన్న బంగారు రంగు మెటల్ ఫ్రేమ్ అథ్లెట్లు సాధించాలనుకునే అత్యుత్తమ విజయాలు, పోడియం క్షణాలను సూచిస్తుందని సామ్‌సంగ్ చెబుతోంది. అలాగే ఇది “బెస్ట్ ఇవ్వాలనే బ్రాండ్ ఆశయాన్ని” కూడా ప్రతిబింబిస్తుందట. ఈ డివైస్‌తో పాటు ఇచ్చే క్లియర్ మ్యాగ్నెట్ కేస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నీలి రంగు సర్క్యులర్ మ్యాగ్నెట్ చుట్టూ బంగారు రంగు లారెల్ ఆకులు ఉంటాయి. ఇవి విజయానికి ప్రతీకగా డిజైన్‌లో చేర్చినట్లు సామ్‌సంగ్ వెల్లడించింది.
సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఈ ఫోన్ పూర్తిగా ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. ప్రత్యేక ఒలింపిక్ థీమ్ వాల్‌పేపర్లు మాత్రమే కాకుండా, అథ్లెట్లకు అవసరమైన అనేక యాప్స్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసి అందించనున్నారు. అందులో Galaxy Athlete Card ద్వారా అథ్లెట్లు ఒకరితో ఒకరు డిజిటల్ ప్రొఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు, ఇంటరాక్టివ్ యాక్టివిటీల్లో పాల్గొనవచ్చు. అలాగే Athlete365 యాప్ అథ్లెట్లకు పనితీరు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సహాయం అందించడంతో పాటు, పోటీలకు సంబంధించిన ముఖ్య సమాచారం కూడా అందిస్తుంది.
ఇవే కాకుండా, అధికారిక Olympic Games యాప్, IOC Hotline, PinQuest వంటి ఇతర యాప్స్ కూడా ముందే ఇన్‌స్టాల్ చేసి ఇవ్వనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్‌తో పాటు సామ్‌సంగ్ అథ్లెట్లకు 100GB 5G eSIMను కూడా అందించనుంది. చాలామంది అథ్లెట్లు తమ ఐఫోన్‌లను వదిలి మారరని కంపెనీకి తెలిసినా, అవసరమైన కనెక్టివిటీ అందించడంలో ఎలాంటి లోటు లేకుండా చూసినట్టు ఇది చూపిస్తోంది. ఈ Galaxy Z Flip7 Olympic Edition ఫోన్లను జనవరి 30 నుంచి ఆరు నగరాల్లోని ఒలింపిక్ విలేజ్‌లలో అథ్లెట్లకు పంపిణీ చేయనున్నారు.
ces_story_below_text
ప్రకటన
ప్రకటన
Sony Said to Be Planning State of Play Broadcast for February