బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ OS టీవీల్లోనూ JioTV+ యాప్‌!

Reliance Jio తాజాగా ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ OS ద్వారా కూడా టీవీలలో కూడా JioTV+ యాప్ సేవ‌ల‌ను ప్రారంభించింది.

బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ OS టీవీల్లోనూ JioTV+ యాప్‌!
ముఖ్యాంశాలు
  • ఒకే లాగిన్ ద్వారా బహుళ భాషలకు సంబంధించిన 800 డిజిటల్ టీవీ ఛానెల్స్‌
  • జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5 వంటి 13 ప్రముఖ
  • జియో ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారులకు అన్ని ప్లాన్లపైనా లాగిన్ అవ‌కాశం
ప్రకటన
Reliance Jio ఇప్పుడు తన JioTV+ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు ప్లాన్ చేసింది. ఇప్ప‌టికే టెలికాం రంగంలో త‌న‌కంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న Reliance Jio.. ఇప్పుడు టీవీ విభాగంలోనూ అదే త‌ర‌హా పేరును సంపాదించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ జియో ఫైబర్ మరియు జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ వినియోగ‌దారుల‌కు జియో సెట్-టాప్ బాక్స్ (ఎస్‌టిబి) ద్వారా JioTV+ యాప్‌ను ప్రత్యేకంగా యాక్సెస్ చేసే అవ‌కాశం ఉండేది. అయితే, తాజాగా ఆండ్రాయిడ్, యాపిల్, అమెజాన్ ఫైర్ OS ద్వారా కూడా టీవీలలో JioTV+ యాప్ సేవ‌ల‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఒకే లాగిన్‌తో చాలా ర‌కాల‌ OTT యాప్‌ల‌కు సులువుగా  యాక్సెస్ పొందే అవ‌కాశం ఉండ‌నుంది. అలాగే, ఆధునిక గైడ్‌లు కాకుండా.. ఇది స్మార్ట్ రిమోట్ స‌పోర్ట్ చేస్తోంది. ఈ JioTV+ యాప్‌ని ఉపయోగించి వినియోగ‌దార‌లు ఒకే లాగిన్ ద్వారా బహుళ భాషలకు సంబంధించిన 800 డిజిటల్ టీవీ ఛానెల్‌లను వీక్షించే అవ‌కాశం ఉన్నట్లు Jio సంస్థ ఒక ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది. మ‌రెందుకు ఆల‌స్యం.. JioTV+ వెల్ల‌డించిన ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చూసేద్దామా?!

టెలికాం సంస్థ Jio వెలువ‌రించిన‌ పత్రికా ప్రకటనలో Reliance Jio తన JioTV+ స్ట్రీమింగ్ యాప్‌ అన్ని ప్రముఖ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉందని ప్రకటించింది. దీని ద్వారా న్యూస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆట‌లు, సంగీతం, కిడ్స్‌, బిజినెస్‌  మరియు భక్తి వంటి ప‌లు విభాగాలకు చెందిన ప‌లు 800 డిజిటల్ టీవీ ఛానెళ్లను చూసే అవ‌కాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. పిల్లల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ కంటెంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. జియో సినిమా ప్రీమియం, డిస్నీ+ హాట్‌స్టార్‌, సోనీలివ్‌, జీ5 వంటి 13 ప్రముఖ OTT యాప్‌ల నుండి కంటెంట్‌ను వినియోగించుకోగలరు.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి JioTV+ యాప్‌ను..


అందుకోసం ఆండ్రాయిడ్ టీవీల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి JioTV+ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల‌ని సంస్థ సూచించింది. అలాగే, Apple TV లేదా Amazon Fire OS ఆధారితమైన TVల కోసం యాప్‌ను పొందడానికి అదే విధానాన్ని అనుస‌రించాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా జియో ఫైబర్‌, జియో ఎయిర్‌ ఫైబర్ వినియోగ‌దారులు కంటెంట్‌ను వీక్షించ‌వ‌చ్చు. అలాగే, వినియోగదారులు భాషతోపాటు కేటగిరీ ఫిల్టర్‌లను ఉపయోగించి కంటెంట్ ద్వారా కూడా బ్రౌజ్ చేయవచ్చు. కంపెనీ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. దాదాపు అన్ని స్మార్ట్‌టీవీ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ JioTV+ సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో వినియోగ‌దార‌లు క్వాలిటీతో కూడిన కంటెంట్‌ను వీక్షించే అనుభూతిని సొంతం చేసుకుంటారు.  

ఆ టీవీల‌కు మాత్రం అవ‌కాశం లేదు..

జియో ఫైబర్ పోస్టుపెయిడ్ అయితే రూ.599, రూ.899 ఆ పై ప్లాన్లు తీసుకున్న వినియోగ‌దారులు ఈ యాప్‌లో లాగిన్ అయ్యేందుకు అవ‌కాశం క‌ల్పించారు. అదే, జియో ఎయిర్‌ఫైబర్‌ వినియోగదారులకు అన్ని ప్లాన్లపైనా లాగిన్ అయ్యే వీలుంటుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. జియో ఫైబర్‌ ప్రీపెయిడ్ వినియోగ‌దారులైతే మాత్రం రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌ల‌ను క‌లిగి ఉండాల్సి ఉంటుంది. LG OS ఆధారితంగా ప‌నిచేసే స్మార్ట్ టీవీల‌కు ఈ యాప్ త్వ‌ర‌లోనే సపోర్ట్ చేస్తుంద‌ని కంపెనీ ప్ర‌క‌టించింది. అంతేకాదు, శాంసంగ్‌ స్మార్ట్‌టీవీని వినియోగిస్తువారు మాత్రం JioTV+ యాప్‌ను ఆ టీవీల్లో ఉప‌యోగించే అవ‌కాశం లేదు. అంచేత వారు యాప్‌కోసం త‌ప్ప‌నిస‌రిగా సెట్‌-టాప్‌ బాక్స్‌ను కొనుగోలు చేసుకోవాల‌ని తెలిపింది. నిజానికి,  ఓటీటీలకు వినియోగ‌దార‌లు ఇప్ప‌టివ‌ర‌కూ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతూ వ‌స్తున్నారు. తాజాగా ఈ JioTV+  ద్వారా వినియోగదారులకు చాలా వ‌ర‌కూ ఖర్చు త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. 
Comments

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. AI ఫీచర్లతో గూగుల్ ఫిక్సల్ 10 ప్రో ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా
  2. రెడ్మీ 15 5G భారత మార్కెట్లో విడుదల... ధర, ఫీచర్స్, ఇతర స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ మీకోసం
  3. తక్కువ ధరకు 4GB RAMతో Poco M7 Plus 5G కొత్త వేరియంట్ ఫోన్, త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ ప్రారంభం
  4. iQOO 15 హ్యాండ్‌సెట్ ఫోటోలు లీక్, వేర్వేరు కలర్స్‌లో సరికొత్త లుక్‌లో హ్యాండ్‌సెట్
  5. సెప్టెంబర్ 19 నుంచి ఇవ్వాల్సిన డెలివరీలు వాయిదా పడుతున్నాయి
  6. రియల్ మీ P3 Lite 5G ధరను రియల్‌ మీ చాలా ఆకర్షణీయంగా నిర్ణయించింది.
  7. నథింగ్ ఇయర్ 3 లో మార్పులివే
  8. ఐఫోన్ లవర్స్‌కి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆఫర్
  9. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ భారత్‌లో విడుదల కావడంతో, ఐఫోన్ 16 ధరను తగ్గించారు
  10. ఈ సిరీస్ ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మార్కెట్‌లో పోటీని మరింత పెంచే అవకాశం ఉంది
© Copyright Red Pixels Ventures Limited 2025. All rights reserved.
Trending Products »
Latest Tech News »