ఐరన్ మ్యాన్ ఈజ్ హియర్! Poco X8 Pro స్పెషల్ ఎడిషన్ రేట్ ఎంతో తెలుసా?

నేటి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ, చైనీస్ బ్రాండ్ పోకో తన 'X8 ప్రో' సిరీస్‌ను ఈరోజే గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఐరన్ మ్యాన్ ఈజ్ హియర్! Poco X8 Pro స్పెషల్ ఎడిషన్ రేట్ ఎంతో తెలుసా?

Photo Credit: Gadgets 360

Poco X8 Pro సిరీస్

ముఖ్యాంశాలు
  • Poco X8 Pro స్పెషల్ ఎడిషన్
  • గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది
  • 8GB + 256GB దాదాపు రూ. 33,999 ఉండచ్చు
ప్రకటన

నేటి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తూ, చైనీస్ బ్రాండ్ పోకో తన 'X8 ప్రో' సిరీస్‌ను ఈరోజే గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా 'పోకో X8 ప్రో 5G' , 'పోకో X8 ప్రో మాక్స్ 5G' మోడల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే టెక్ వర్గాల్లో ఈ ఫోన్ల ఫీచర్లు, ధరలపై ఓ రేంజ్లో చర్చ నడుస్తోంది. తాజాగా ప్రముఖ టెక్ బ్లాగర్ పరస్ గుగ్లానీ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోన్ల ధరలను లీక్ చేయడంతో ఆసక్తి మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ లవర్స్, గేమర్స్ ఈ లాంచ్ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లు, మిడ్-రేంజ్,  ప్రీమియం సెగ్మెంట్‌ల మధ్య గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తున్నాయి. షియోమీ సబ్-బ్రాండ్‌గా గుర్తింపు పొందిన పోకో, ఈసారి తన యూజర్ల కోసం అదిరిపోయే స్పెసిఫికేషన్లను జతచేయడం విశేషం.

ధరల విషయానికి వస్తే, పోకో X8 ప్రో 5G బేస్ వేరియంట్ (8GB + 256GB) దాదాపు రూ. 33,999 ఉండవచ్చని సమాచారం. అదేవిధంగా 12GB + 256GB వేరియంట్ ధర రూ. 37,999గా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ మోడల్ అయిన పోకో X8 ప్రో మాక్స్ 5G విషయానికొస్తే, దీని ప్రారంభ ధర రూ. 41,999 (12GB + 256GB) గా ఉండవచ్చు. హయ్యర్ ఎండ్ వేరియంట్ అయిన 12GB + 512GB ధర రూ. 45,999 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇవన్నీ లీక్డ్ ధరలే కాబట్టి, అధికారికంగా కంపెనీ ప్రకటించే వరకు వీటిని ఒక అంచనాగా మాత్రమే చూడాలి. అయినప్పటికీ, ఈ ఫీచర్లకు ఈ ధరలు చాలా రీజనబుల్‌గా ఉన్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు. యూత్ టేస్ట్‌కి తగ్గట్టుగా స్టైలిష్ డిజైన్ , స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్‌ను పోకో ఈసారి గ్యారెంటీ ఇస్తోంది.

ఈ లాంచ్‌లో మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, మార్వెల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా 'ఐరన్ మ్యాన్ ఎడిషన్'ను కూడా పోకో పరిచయం చేస్తోంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ధర సుమారు రూ. 43,999 ఉండవచ్చని టాక్. అదనంగా, కస్టమర్లను ఆకట్టుకోవడానికి లాంచ్ ఆఫర్ కింద దాదాపు రూ. 3,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా కంపెనీ ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఐరన్ మ్యాన్ థీమ్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం లుక్స్ పరంగానే కాకుండా, సాఫ్ట్‌వేర్ ఐకాన్స్, వాల్‌పేపర్స్ విషయంలో కూడా ఫ్యాన్స్‌ను మెప్పించనుంది. పాత తరం ఫోన్లకు భిన్నంగా ఈ ఫోన్లు లేటెస్ట్ ట్రెండ్‌ను సెట్ చేస్తాయని, ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లను, టెక్ గీక్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ ఎడిషన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

బ్యాటరీ, పర్ఫార్మెన్స్ విషయంలో పోకో ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించేలా ఉంది. పోకో X8 ప్రో 5G మోడల్‌లో భారీ 6,500mAh బ్యాటరీని అమర్చగా, ప్రో మాక్స్ మోడల్‌లో ఏకంగా 9,000mAh బ్యాటరీని ఇచ్చారు. ఇంత పెద్ద బ్యాటరీ కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి బ్యాకప్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, రెండు ఫోన్లు కూడా 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి, దీనివల్ల ఫోన్ నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది. ప్రో మాక్స్ మోడల్‌లో అదనంగా 'వైర్డ్ రివర్స్ ఛార్జింగ్' ఫీచర్ కూడా ఉంది, దీని ద్వారా మీరు ఇతర గాడ్జెట్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. నేటి జనరేషన్ వాడకానికి అనుగుణంగా హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం ఈ బ్యాటరీ సామర్థ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది.

సాంకేతిక పరంగా చూస్తే, పోకో X8 ప్రో మాక్స్ 5Gలో అత్యంత శక్తివంతమైన 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను వాడారు. మరోవైపు ప్రో మోడల్‌లో 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను అందించారు. ఈ రెండు ప్రాసెసర్లు కూడా 5G కనెక్టివిటీతో మెరుపు వేగంతో పనిచేస్తాయి. కెమెరాల విషయానికి వస్తే, రెండింటిలోనూ 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్లతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి, వ్లాగర్లకు ఇది మంచి ఎంపిక కానుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు జరగబోయే అధికారిక ఈవెంట్‌లో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ ఫోన్ల ఫీచర్లు చూస్తుంటే, పోకో తన మార్కెట్ షేర్‌ను భారీగా పెంచుకోవాలని గట్టి ప్లాన్‌తోనే వచ్చినట్లు అర్థమవుతోంది.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Nokia 123 Shield Phone: చేతిలోంచి జారినా, నీళ్లలో మునిగినా నో ప్రాబ్లమ్.. టైప్-సి పోర్ట్‌తో నోకియా కొత్త ఫోన్ వచ్చేసింది!
  2. Xiaomi Power Bank: ఒకేసారి 3 డివైజ్లు ఛార్జ్ చేసుకోవచ్చు.. షావోమి నుంచి 67W పవర్ బ్యాంక్ లాంచ్
  3. OPPO Find X10 Series: ఒప్పో నుంచి సరికొత్త లుక్‌తో ఫైండ్ X10 సిరీస్.. కెమెరా డిజైన్ లీక్!
  4. iQOO Neo 11S: ఛార్జర్ ని మరచిపోయినా నో ప్రాబ్లమ్.. 8000mAh బ్యాటరీతో ఐకూ కొత్త ఫోన్ తెచ్చేస్తోంది!
  5. Samsung AI Galaxy Glasses: కళ్లజోడు పెట్టుకుంటే చాలు.. ప్రపంచాన్నంతా చూసేయొచ్చు.. శామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్ గ్లాసెస్!
  6. Samsung Galaxy Z Fold 8: 50MP డ్యూయల్ కెమెరా, లైట్ వెయిట్ టైటానియం బాడీ.. శామ్‌సంగ్ నయా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్!
  7. Samsung Galaxy Watch Ultra 2 Launched: చేతికి ఈ వాచ్ ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనే లేదు.. శామ్‌సంగ్ నుంచి అల్ట్రా వాచ్ 2 లాంచ్!
  8. Garmin Cirqa Smart Band launched: స్క్రీన్ లేని గార్మిన్ సిర్కా స్మార్ట్ బ్యాండ్ లాంచ్.. డిస్‌ప్లే లేకపోవడమే దీని ప్రత్యేకం!
  9. Samsung Galaxy Z Fold 8 Ultra: ఫోన్ తెరిస్తే ట్యాబ్.. మడిచితే ఫోన్.. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో శామ్‌సంగ్ విధ్వంసం!
  10. Samsung Galaxy Card Launched: శామ్‌సంగ్ నుంచి తొలి క్రెడిట్ కార్డ్.. శామ్‌సంగ్ గెలాక్సీ కార్డ్ లాంచ్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »