The Meta AI voice mode feature is also said to include two US voices
ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ.. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా WhatsApp అప్‌డేట్‌లను అందిస్తూ వస్తోంది. తాజాగా Android కోసం WhatsApp త్వరలో ఇన్-యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్ Meta టూ-వే వాయిస్ చాట్ ఫీచర్‌ను ఇంటిగ్రేట్ చేయనున్నట్లు తెలిపింది. ఈ వాయిస్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. చాలామంది సెలబ్రిటీల వాయిస్‌లను వినియోగదారలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ ఫీచర్‌లో అదనంగా UK, US యాసలో కూడా వాయిస్‌ని ఉపయోగించుకునేందుకు వినియోగదారలకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా, Meta AI వాయిస్ మోడ్ వినియోగదారులతో మానవ తరహాలో సంభాషణలను నిర్వహించగలదు. మరెందుకు ఆలస్యం.. WhatsApp నుంచి రాబోతోన్న ఈ కొత్త ఫీచర్ విశేషాలను తెలుసుకుందామా?!
WhatsApp ఫీచర్ ట్రాకర్ WABetaInfo వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.19.32 కోసం WhatsApp బీటాలో పబ్లిక్ ఫిగర్స్(సెలబ్రిటీల) వాయిస్‌లకు సంబంధించిన సమాచారం గుర్తించే పనిలో ఉంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం కనిపించదు. Google బీటా ప్రోగ్రామ్‌కు సైన్ అప్ చేసిన వారు దీన్ని చూడలేరు. ఫీచర్ ట్రాకర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లను పరిశీలిస్తే.. Meta AI కోసం WhatsApp అనేక వాయిస్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడానికి ఈ వాయిస్‌ల పిచ్, టోనాలిటీ, యాక్సెంట్‌లలో విభిన్నంగా ఉంటాయి. ఇవి వినియోగదారులకు నాలుగు వేర్వేరు వాయిస్‌లను అందించే ChatGPT యొక్క ప్రస్తుత వాయిస్ మోడ్‌ని పోలి ఉంటాయి.
ఫీచర్ ట్రాకర్ ప్రకారం.. UK యాసతో మూడు, US యాసతో రెండు వాయిస్‌లు ఉన్నాయి. అయితే, ఆ వాయిస్‌ల జెండర్, పిచ్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలు బహిర్గతం కాలేదు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రజాప్రతినిధులకు చెందిన నాలుగు వాయిస్‌లు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వారి పేర్లు వెల్లడించనప్పటికీ, ప్రజలకు సుపరిచితులైన ప్రముఖులు కావచ్చునని సమాచారం.
అయితే, WhatsApp మాతృ సంస్థ Metaకి ఈ తరహా ఫీచర్ కొత్తేమీ కాదు. గత సంవత్సరం కంపెనీ మెసెంజర్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీలు, ఇతర ప్రముఖ వ్యక్తుల వ్యక్తిత్వాల ఆధారంగా అనేక AI చాట్‌బాట్‌లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇది సెలబ్రిటీల ఫ్రొఫైల్‌ను వినియోగదారులకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్ దాని కొనసాగింపుగా వస్తూ.. AI లెటర్స్‌ను మరింత పెంచేలా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
యాక్టివేట్ చేసిన తర్వాత..
ఇది కాకుండా.. WhatsApp కోసం Meta AI వాయిస్ మోడ్ యొక్క ఇంటర్‌ఫేస్ కూడా గత నివేదికలో వెల్లడైంది. యాక్టివేట్ చేసిన తర్వాత, ఫీచర్ దిగువన ఉన్న షీట్‌తో పాప్ అప్ చేయబడుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. పైన Meta AI, మధ్యలో బ్లూ రింగ్ సింబల్‌ను చూపిస్తుంది. ఈ ఫీచర్‌కు సంబంధించి మరింత సమాచారం తెలియాలంటే మరికొన్ని రోజలు వేచి చూడాల్సిదే!
ప్రకటన
ప్రకటన