Photo Credit: Insta360
Insta360 Ace Pro 2 గ్లోబల్ మార్కెట్‌లోకి Ace Proకి సక్సెసర్‌గా అడుగుపెట్టింది. యాక్షన్ కెమెరా ఈ Ace సిరీస్‌కి సరికొత్త జోడింపుగా చెప్పుకోవచ్చు. గతంలో వచ్చిన మోడళ్ల కంటే మెరుగైన ఇమేజ్ క్వాలటీ, సులభంగా క్యాప్చర్ చేయడం, అప్‌గ్రేడ్ చేసిన ఆడియో, డిజైన్, మెరుగైన కృత్రిమ మేధస్సు (AI) సామర్థ్యాలను పొందవచ్చని కంపెనీ చెబుతోంది. ఇది 8K వీడియో రికార్డింగ్, 39 మీటర్ల వరకు వాటర్‌ఫ్రూఫింగ్, డెడికేటెడ్ ప్రో ఇమేజింగ్ చిప్, లైకా-ఇంజనీరింగ్ కలర్ ప్రొఫైల్‌లు వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంది.
Insta360 Ace Pro 2 ధర $399.99 (దాదాపు రూ. 34,000) నుండి ప్రారంభమవుతుంది. ఇది విండ్ గార్డ్, బ్యాటరీ, స్టాండర్డ్ మౌంట్, మైక్ క్యాప్, USB టైప్-సి కేబుల్‌తో వస్తుంది. ఇంతలో యాక్షన్ కెమెరా డ్యూయల్ బ్యాటరీ బండిల్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది కూడా పైన పేర్కొన్న యాక్సెసరీలను కలిగి ఉంటుంది. అదనంగా రెండు బ్యాటరీలను అందిస్తారు. దీని ధర $419.99 (దాదాపు రూ. 35,000)గా నిర్ణయించారు. Insta360 సరికొత్త ఆఫర్ బ్రాండ్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి ఇప్పటికే అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రిటైల్ భాగస్వాములను ఎంపిక చేసుకోవచ్చు.
Insta360 Ace Pro 2 1/1.3-అంగుళాల 8K సెన్సార్‌తో 13.5 స్టాప్‌ల వరకు డైనమిక్ రేంజ్, Leica SUMMARIT లెన్స్‌తో అమర్చబడింది. ఇది MP4 ఫార్మాట్‌లో స్లో మోషన్‌లో సెకనుకు 30 ఫ్రేమ్‌లు (fps), 4K 60fps యాక్టివ్ HDR, 4K 120fps వద్ద గరిష్టంగా 8K వరకు వీడియోలను క్యాప్చర్ చేయగలదు. అంతేకాదు, ఇది గరిష్టంగా 50-మెగాపిక్సెల్ రిజల్యూషన్‌లో ఫోటోలను కూడా క్యాప్చర్ చేయగలదు.
యాక్షన్ కెమెరా ప్యూర్ వీడియో అని పిలువబడే ప్రత్యేకమైన షూటింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది తక్కువ లైటింగ్ సమయాల్లోనూ నేచురల్ పరిస్థితిని సృష్టించి, శబ్దాలను నియంత్రిడంతోపాటు పిక్చర్‌కు అనుకూలంగా ట్యూట్ చేసుకునేలా AI న్యూరల్ నెట్‌వర్క్ సహాయపడుతుంది. Insta360 Ace Pro 2ని వాయిస్ లేదా సంజ్ఞ ద్వారా నియంత్రించవచ్చు. అలాగే, ఆటో ఎడిట్, AI హైలైట్స్ అసిస్టెంట్ వంటి AI-పవర్డ్ క్రియేటర్-ఫ్రెండ్లీ ఫీచర్స్‌ను పొందవచ్చు.
ఇది 2.5-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. అంటే, మునుపటి మోడల్‌తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పిక్సెల్ డెన్సిటీ, 6 శాతం మెరుగైన బ్రైట్‌నెస్ కలిగి ఉంది. మన్నిక పరంగా చూస్తే.. Insta360 Ace Pro 2 తొలగించగల లెన్స్ గార్డ్, న్యూ విండ్ గార్డ్‌తో వస్తుంది. అలాగే, యాక్షన్-ప్యాక్డ్ మూమెంట్‌లను రికార్డ్ చేస్తున్నప్పుడు గాలి శబ్దాన్ని నియంత్రణలో ఉంచుతుందని కంపెనీ చెబుతోంది. యాక్షన్ కెమెరా 1,800mAh బ్యాటరీతో వస్తుంది. దినిని దీన్ని 18 నిమిషాల్లో 80 శాతం, 47 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ చేయవచ్చు.
ప్రకటన
ప్రకటన