Photo Credit: Insta360
Insta360 X5 లో 360-డిగ్రీల ఆడియో రికార్డింగ్‌కు మద్దతుతో నాలుగు మైక్రోఫోన్‌లు ఉన్నాయి
యాక్షన్ కెమెరా ప్రియులకు ప్రముఖ చైనీస్ కంపెనీ ఇన్‌స్టా 360 గుడ్‌న్యూస్ చెప్పింది. 360- డిగ్రీ కెమెరాను ఇన్‌స్టా360 X5 పేరుతో విడుదల చేసింది. ఇది 1/1.28 అంగుళాల సెన్సార్‌లతో రూపొందించబడి, 8K/30fps 360 డిగ్రీ వీడియో రికార్డ్ చేసేలా తయారు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై పనిచేసే ప్యూర్ వీడియో లో లైట్ మోడ్ కూడా ఉందని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో రీప్లేస్ చేసే అవకాశం ఉన్న లెన్స్ సిస్టమ్ అందించారు. ఇది లెన్స్ పాడయినప్పుడు వినియోగదారులు వాటిని మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది 15 మీటర్ల వరకూ వాటర్‌ప్రూఫ్‌గా నిలవడంతోపాటు మూడు గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.అమెజాన్‌లో కొనుగోలుకు,ఇన్‌స్టా360 X5 ధర మన దేశంలో రూ. 54990గా కంపెనీ నిర్ణయించింది. అలాగే, దీనిని కంపెనీ అధికారిక వెబ్ సైట్‌తోపాటు అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంచారు. యూఎస్‌లో ఈ కెమెరా ధర $549.99(సుమారు రూ.46850)గా ఉంది. భారత్‌లో ఇన్‌స్టా360 X5 Essentials బండిల్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. వీటిలో అడిషనల్ బ్యాటరీ, యుటిలిటీ ఫాస్ట్ ఛార్జ్ కేస్, సెల్ఫీ స్టిక్, స్టాండర్డ్ లెన్స్ గార్డ్‌లు, లెన్స్ క్యాప్, క్యారీయింగ్ కేస్ వంటివి ఉంటాయి. ఇండియాలో దీని ధర రూ.67990గా ఉంది.
1/1.28 అంగుళాల సెన్సార్‌లతో ఇన్‌స్టా360 X4 మోడల్ 8K/30fps 360 డిగ్రీల వీడియో రికార్డ్ చేస్తుంది. అయితే, 360 డిగ్రీ వీడియో, ప్యూర్ వీడియో, బుల్లెట్ టైమ్, లూప్ రికార్డింగ్, టైమ్‌లాప్స్, రోడ్ మోడ్, టైమ్‌షిట్ మోడ్‌లకు కొత్త ఇన్‌స్టా360 X5 వీడియో రికార్డింగ్ కోసం సపోర్ట్ చేస్తోంది. ఇందులోని 72- మెగాపిక్సెల్స్, 18- మెగాపిక్సెల్స్ కెమెరాలు ఫోటోలను కాప్చ్యూర్ చేయగలవు. అలాగే, X4 మోడల్ కంటే 144 శాతం పెద్ద కెమెరా సెన్సార్‌లు ఉన్నట్లు కంపెనీ చెబుతోంది.
రెండు ఇమేజింగ్ చిప్‌లను కొత్త ఇన్‌స్టా360 X5లో అమర్చారు. అలాగే, 5ఎన్ఎం ఏఐ చిప్‌ని కూడా అందించారు. ఇది తక్కవ లైటింగ్ ఉన్న సమయంలో వీడియో రికార్డింగ్ చేసేందుకు రూపొందించిన ప్యూర్ వీడియో మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టవిటీ ఆప్షన్‌ల విషయానికి వస్తే.. Wi-Fi 5, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ 3.0 టైప్- సీ వంటివి ఉన్నాయి. అంతే కాదు, దీనికి అందించిన నాలుగు మైక్రోఫోన్‌లద్వారా బయట నుంచి వచ్చే గాలి సౌండ్‌ను తగ్గించేందుకు స్టీల్ మెస్‌ను అమర్చారు.
కొత్త X5 కెమెరాకు 2400 mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు. ఇది 20 నిమిషాల్లో 80 వరకూ ఛార్జ్ అవుతుంది. అలాగే, ఎండ్యూరెన్స్ మోడ్‌లో ఒకే ఛార్జ్‌పై 5.7K/24fps క్వాలటీతో 185 నిమిషాల వీడియో రికార్డ్ చేయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. అయితే, 8K/30fps వీడియో రికార్డ్ కావాలనుకుంటే మాత్రం 88 నిమిషాల రికార్డింగ్ మాత్రమే చేయొచ్చు. దుమ్ము, నీటి నియంత్రణకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.
ప్రకటన
ప్రకటన