ఫెస్టివల్ సేల్‌లో అదిరే ఆఫర్లు.. సెక్యూరిటీ కెమెరాల ధర ఎంతంటే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో లక్షల మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకర పరికరాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ సేల్‌లో సెక్యూరిటీ కెమెరాలు కూడా సరసమైన ధరలకే లభిస్తున్నాయి.

ఫెస్టివల్ సేల్‌లో అదిరే ఆఫర్లు.. సెక్యూరిటీ కెమెరాల ధర ఎంతంటే

Photo Credit: Asus

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 లో ఆసుస్ నుండి AI ఉత్పాదకత ల్యాప్‌టాప్‌లపై ఉత్తమ డీల్‌లను అందిస్తోంది

ముఖ్యాంశాలు
  • దసరా స్పెషల్ ఫెస్టివల్ ఆఫర్లు
  • సెక్యూరిటీ కెమెరాలపై డిస్కౌంట్లు
  • కనిష్ట ధర రూ. 1,199 మాత్రమే
ప్రకటన

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 ప్రస్తుతం బాగానే ట్రెండ్ అవుతోంది. దసరా సందర్భంగా ఇండియాలో పెట్టిన ఈ సేల్‌లో లక్షలాది మంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపకర పరికరాల్ని కొనుగోలు చేస్తున్నారు. ఇక ఈ పండుగ సీజన్‌కు ముందుగానే ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించారు. ఈ పండుగ ప్రయాణం, ఇంటిని విడిచి వెళ్లడం వంటి వాటితో సెక్యూరిటీ సమస్యలు తలెత్తవచ్చు. ఇంటికి భద్రత విషయంలో ముందు చూపు అవసరం. ఈ క్రమంలో ఇంటికి, ఆఫీస్‌లకు సెక్యూరిటీ కెమెరాలు అనేవి ఎంతో ముఖ్యం. మీరు మీ ఇంటికి భద్రతను పెంచాలని చూస్తున్నట్లయితే ఈ కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఉపయోగించుకోవచ్చు.

CP Plus, TP-Link, Qubo వంటి బ్రాండ్ల నుండి టాప్-రేటెడ్ సెక్యూరిటీ కెమెరాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఇండోర్ మానిటరింగ్, అవుట్‌డోర్ సర్వైలెన్స్‌కు అనువైన అనేక మోడల్‌లు బడ్జెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడల్‌లు మోషన్ డిటెక్షన్, క్లౌడ్ స్టోరేజ్, యాప్ పెయిరింగ్, నైట్ విజన్ వంటి స్మార్ట్ ఫీచర్‌లను అందిస్తాయి.

ప్రస్తుత అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025లో ప్రముఖ బ్రాండ్‌లు తమ బెస్ట్ సెల్లింగ్, లేటెస్ట్ సెక్యూరిటీ కెమెరాలపై 85 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నాయి. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, కూపన్ ఆధారిత డిస్కౌంట్లతో మరింత ఆకర్షణీయంగా మారుతాయి.

SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై కొనుగోలుదారులు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. Amazon Pay ICICI క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే చెల్లింపులకు కూడా ఈ డిస్కౌంట్లు లభిస్తాయి. అప్పుడు నో-కాస్ట్ EMI ఎంపికలు, Amazon Pay-ఆధారిత డిస్కౌంట్లు ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 నుండి సెక్యూరిటీ కెమెరాలపై టాప్ డీల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ సేల్ రూ. 60,000 లోపు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ల్యాప్‌టాప్‌లపై కొన్ని మంచి డీల్స్‌ను కూడా అందిస్తుంది. ఆసక్తిగల పాఠకులు రూ. 30,000 లోపు సౌండ్‌బార్లు, స్మార్ట్‌ఫోన్‌లపై ఉత్తమ డీల్స్‌ను కూడా పొందవచ్చు.

Tapo C200 360° కెమెరా ధర రూ. 3,299 కాగా.. ఈ సేల్‌లో డిస్కౌంట్‌తో రూ.1,199లకే లభించనుంది. Trueview WiFi 3mp Mini Pan-Tilt Zoom CCTV Camera ధర రూ.14, 000 కాగా రూ. 2, 999లకే రానుంది. Trueview 3+3Mp 4G Mini కెమెరా ధర రూ. 15,000 కాగా డిస్కౌంట్‌తో రూ. 7, 649లకే లభిస్తుంది.

ces_story_below_text

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. ముఖ్యమైన విషయం ఏమిటంటే, VoWiFi సేవలు పూర్తిగా ఉచితం. Wi-Fi ద్వారా చేసే కాల్స్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.
  2. మార్కెట్లోకి రానున్న మోటో న్యూ సిరీస్.. ఎక్స్70 ఎయిర్ ప్రో ఫీచర్స్ ఇవే
  3. త్వరలోనే వన్ ప్లస్ నార్డ్ 6.. కీ ఫీచర్స్ ఇవే
  4. ఈ Privacy Display ఫీచర్ పనిచేయాలంటే, సాధారణ OLED స్క్రీన్ సరిపోదు.
  5. The Freestyle+ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది AI OptiScreen టెక్నాలజీ
  6. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 200MP HP2 సెన్సార్ ఇదే ఇప్పటికే Galaxy S25 Ultraలో కూడా ఉపయోగించారు.
  7. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ డివైస్‌లో పలు ఇంటిగ్రేటెడ్ AI టూల్స్ ఉన్నాయి.
  8. వాట్సప్‌లో న్యూ ఇయర్ స్పెషల్ ఫీచర్స్.. ఇక ప్రత్యేకం కానున్న కొత్త ఏడాది
  9. Find N6లో శక్తివంతమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది.
  10. వాట్సప్‌లో న్యూ ఇయర్ స్పెషల్ ఫీచర్స్.. ఇక ప్రత్యేకం కానున్న కొత్త ఏడాది
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »