Google ఈ ఫీచర్ గురించి మొదట జూలైలో చెప్పింది. “AI Mode తో మరింత లోతుగా పరిశీలించే అవకాశం” త్వరలో అందుతుందని అప్పుడే వెల్లడించింది. అయితే అప్పుడు ఇది పెద్దఎత్తున అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు మాత్రం మరింత విస్తృతంగా యూజర్లకు కనిపించడం ప్రారంభమైంది.
Photo Credit: Google
ఈ ఫీచర్ గురించి గూగుల్ మొదట జూలైలోనే ప్రస్తావించింది, అయితే ఆ సమయంలో ఇది విస్తృతంగా అందుబాటులోకి రాలేదు.
Google తన Circle to Search ఫీచర్‌ను దశలవారీగా మరింత ఉపయోగకరంగా మార్చేస్తోంది. మొదట స్క్రీన్‌పై కనిపించే అంశాలను సర్కిల్ చేసి సమాచారం పొందే సాధారణ టూల్‌గా ప్రారంభమైన ఇది, ఇప్పుడు క్రమంగా AI ఆధారిత శక్తిని పొందుతూ మరింత సహజ అనుభవాన్ని ఇస్తోంది. వినియోగదారులు స్క్రీన్ నుంచే కంటెంట్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతారన్న దానిపై Google చేస్తున్న కొత్త ప్రయోగాల్లో భాగంగా, తాజాగా మరో అప్‌డేట్ రోలౌట్ అవుతున్నట్లు సమాచారం. తొలి వివరాల ప్రకారం, ఈ మార్పు ఫాలోఅప్ ప్రశ్నలను నిర్వహించే విధానాన్ని గణనీయంగా మెరుగుపరచనుంది.
Android Authority తెలిపిన వివరాల ప్రకారం, Google యాప్ తాజా వెర్షన్ 16.47.49 లో, Circle to Search ఉపయోగిస్తున్నప్పుడు టైప్ చేసే ఫాలోఅప్ ప్రశ్నలు నేరుగా Google AI Mode లోకే వెళ్లేలా మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఈ అప్‌డేట్ అన్ని డివైసులకు చేరలేదని, వచ్చే రోజుల్లో దశలవారీగా అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. Gadgets 360 కూడా తాజా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసినప్పటికీ ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయలేకపోయింది, అంటే రోలౌట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్న మాట.
Google ఈ ఫీచర్ గురించి మొదట జూలైలో చెప్పింది. “AI Mode తో మరింత లోతుగా పరిశీలించే అవకాశం” త్వరలో అందుతుందని అప్పుడే వెల్లడించింది. అయితే అప్పుడు ఇది పెద్దఎత్తున అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు మాత్రం మరింత విస్తృతంగా యూజర్లకు కనిపించడం ప్రారంభమైంది.
ఇంతకాలం Circle to Search ద్వారా స్క్రీన్‌పై ఏదైనా భాగాన్ని సర్కిల్ చేస్తే మొదటి ప్రశ్నకు మాత్రం AI ఆధారిత సమాధానం వచ్చేది. కానీ తరువాత మీరు అడిగే ఏ ప్రశ్నైనా మళ్లీ పాత విధానంలో ఉన్న ఇమేజ్ సెర్చ్‌కి వెళ్ళిపోయేది. ఈ మార్పు వల్ల సంభాషణ తరహా అనుభవం మధ్యలో నిలిచిపోయేది.
కానీఈ కొత్త అప్‌డేట్‌తో ఇప్పుడు Circle to Search ఫలితాల ప్యానేల్ దిగువన ఒక సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఇందులో మీరు టైప్ చేసే ప్రశ్నలు అన్నీ నేరుగా AI Mode ద్వారా ప్రాసెస్ అవుతాయి. ఫలితంగా మొత్తం సెర్చ్ అనుభవం ఒకే ప్రవాహంలో కొనసాగుతుంది...మధ్యలో సిస్టమ్ స్టాండర్డ్ సెర్చ్‌కి తిరిగి వెళ్లదు.
ఈ మార్పుతో Circle to Search మరింత సమగ్రంగా పనిచేస్తోంది. ముఖ్యంగా హోంవర్క్ సాల్వింగ్, విజువల్ సమస్యల పరిష్కారం, ట్రావెల్ రీసెర్చ్ వంటి కొత్త అవకాశాలకు ఇదే సహజమైన దారి చూపుతోంది.
ప్రకటన
ప్రకటన
Redmi Pad 2 Pro, Redmi Buds 8 Pro Could Launch in China Soon